*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Showing posts with label పిల్లలకు జేజే - పిల్లలరచన. Show all posts
Showing posts with label పిల్లలకు జేజే - పిల్లలరచన. Show all posts

Thursday, April 11, 2013

ఇదిగిదుగో ఉగాది !

వేప చెట్టు చూడండి
అందమైన చెట్టు అది
ఆకులన్ని పచ్చగా
పువ్వులేమో తెల్లగా
ఒక పువ్వు నోటిలోకి పెట్టుకున్నాను
వెంటనే కళ్ళు తిరిగి పడిపోయాను
ఆ పూతను గిన్నెలోకి వేసుకున్నాను.

చెరుకు గడని చూడండి
చాలా పెద్ద గడ అది
దాని తీపి రసం పిండాకా,
బెల్లం తయారు చేశాకా,
బెల్లం ముక్క తిన్నాను.
పొట్ట నొప్పితో చచ్చాను.
ఆ బెల్లాన్ని గిన్నెలోకి వేసుకున్నాను.


చిన్నచిన్న పొదలు - చిటారి కొమ్మలు -
వాటికి వేలాడి ఉన్నాయి కాయలు
ఆ కాయలు ఎర్రవి, పచ్చవి
కొన్ని చేదువి, కొన్ని వగరువి
ఒకటి నోటిలోకి పెట్టాను.
వగరుదనం వల్ల రోజంతా 
ఏమీ తినలేకపోయాను.
ఆ కాయలు కోసి గిన్నెలోకి 
వేసుకున్నాను.

మిరప పొదలు ఎన్నో ఉన్నాయి.
రంగు రంగుగా కళ్ళకు బాగున్నాయి.
చూద్దామని ఒకటి నోటిలోకి పెట్టాను.
కారంతో మండి చచ్చాను.
ఆ కాయనూ గిన్నెలోకి వేసుకున్నాను.

ఒక మామిడి చెట్టు చూశాను
పచ్చి మామిడికాయ కోశాను.
ఆ పుల్లదనంతో కళ్ళు మూశాను.
అయినా, గిన్నెలోకి వేసాను.

ఇవన్నీ ఒకటొక్కటిగా తినటం కష్టం.
ఆ ఐదు వేరే వేరే రుచులు
వాటిల్ని కలిపితే ఒక అభిరుచి తయారవుతుంది
దాని పేరే ఉగాది పచ్చడి

అలాగే జీవితం 
అన్ని రసాలు కలిసినది
అందుకనే మనం దేముడికి 
ధన్యవాదాలు చెప్పాలి.

*                                                
నివేద్,
9వ తరగతి
రిషీ వ్యాలీ పాఠశాల
*** 
మరికొన్ని పిల్లలకవితలు
 http://chandralata.blogspot.in/
http://www.prabhavaschool.com/

Prabhava,Books and Beyond ! * All rights reserved.

Thursday, November 3, 2011

ఆహా..ఓహో..!


ఆహా ...ఓహో...
నేనే మేఘాన్నయితే..
చిటపట గాలులు తోలి ,
ఉరుములు మెరుపులు మెరిసి వర్షం పడనిస్తా!
వాగులు వంకలు పోయి ..
వరదలు పోయి ..
చెరువులు బావులు నిండిస్తా.
పచ్చటి పంటలు పండిస్తా.

***
 యం.వరలక్ష్మి ,6వ తరగతి,రిషివ్యాలీ పల్లె బడి



Prabhava,Books and Beyond ! * All rights reserved.

Sunday, September 25, 2011

అమ్మా , ఓ అమ్మా!

రెండుగంటల ముందు వెళ్ళింది,
 నా ఆహారం కారణం.
ఈ వంటరితనం నా ఆనందం,
తిట్టడానికి లేదు కదా!
అమ్మా, ఓ అమ్మా,
నువ్వు తిరిగి రావద్దే !

కడుపుమంట ,ఆకలి దంచుతుంది,
నా భోజనం ఎక్కడ?
నా సంతోషం మాడిమసిగా మారింది,
కోపం నా ఏకైక భావం.
అమ్మా,ఓ అమ్మా, 
నా కోపాన్ని పరీక్షించ వద్దు! 


చీకటి ముసురుకొంటొంది నాచుట్టూ,
నా కోపము భయముగా మారింది.

ఏంటా శబ్దం? సర్పమో,కౄర మృగమో ,
నా ప్రాణం ఆపదలో చిక్కి ఉంది.
అమ్మా,ఓ అమ్మ,
నువ్వు ఎక్కడ ఉన్నావు?

నల్లటి దూరం నుండి వేగంగా వస్తుంది ,
అదుగో మా అమ్మ!
నా నోటి నుండి ఏమి వచ్చినా,
నువ్వు మాత్రం బాధ పడకు.
ఎందుకంటే,
అమ్మా ,ఓ అమ్మా, 
నువ్వంటే నా ప్రాణం కదా?

***


ప్రియ బిక్కాని,
10 వ తరగతి,
రిషీవ్యాలీ స్కూలు 5.9.11

***
Prabhava,Books and Beyond ! * All rights reserved.

Saturday, February 5, 2011

The strange case of Caveman and Rockstar

ప్రభవ పిల్లలకు జేజే ,కథారచనలో ద్వితీయ బహుమతి పొందిన హీబా ఫర్హీన్  కథ  
***
One day I was doing my homework .
The next Sunday was Diwali.So I was tring to complete my homework.
Suddenly the pen was out of ink. I was quite hungry.I wanted to buy few chocolates.
 I informed my mom and went to the nearby shop.
My house is close to Gandhi bomma/statue/.
I left the house and walked on.
A strangeman appeared on infront of me.
He was little ugly. He was wearing a dress which had leaves and animal skin.
His hair was unruly. I was very excited  to  see him.
A parachute landed exactly opposite to caveman and a rockstar walked out. The rockstar was very handsome. He wore disgner pant and shirt and  a stylish belt.A guitar was hanging on his shoulder.He wore a bead-chain. To my surprise , the caveman was also wearing the same bead-chain.
On that Sunday morning , road was lonely and silent.
Both of them werenot aware where they are.

Rockstar approached caveman and asked,”May I know where am I ?”
The caveman said,”I don’t know. I was lost in teh forest and reached in the countryside”
“Where do you come from?” asked the rockstar.
“I am from the jungle of Jarkhand !” the caveman replied.

I was enjoying there conversation.Suddenly  the traffic picked up as if everyone is on the road.
All of them surrounded the Rockstar and very happy to see the Rockstar ,but  not the caveman.
Someppeople were laughing at caveman.He was feeling lost and lonely.
I went to the cave man and started talking to him.I wanted him to be happy too.
The Rockstar was very proud of his admirers and the caveman was very humble.

After observing them ,I understood that if someone is fair or dark ,you have to judge them by manners and habit. You may have heard the proverb, “Don’t judge by hte cover of the book ,judge the content in it.”
***
Nadivardhanam group.
Hiba Farheen,6th class ,Gomathy  Global School. 
***

Prabhava,Books and Beyond ! * All rights reserved.

Friday, January 14, 2011

To Live Forever

ప్రభవ పిల్లలలకు జేజే ,కథారచనలో ప్రథమ బహుమతి పొందిన ప్రణవ్ కథ  సంక్రాంతి ప్రత్యేక ప్రచురణ .
 మీరు మీ కుటుంబం, మీ బంధుమిత్రులు సంతోషంగా సంక్రాంతి  గడపాలని కోరుతూ ....ప్రణవ్ కు అభినందనలతో. To Live Forever
అన్నట్లు , ప్రణవ్ రాసిన చిన్ని కవితనూ మీరు లోగడ చదివారు. 
మరో మారు ఇక్కడ చదవండి.
http://prabhavabooks.blogspot.com/2010/11/dont-want-to-miss.html

*
To Live Forever









I am an Ostrich .
My name is Pranav.
We are last Ostrich family living on this Earth.
We were worried that we'll be vanished soon.
I might miss my family.
In order to make my family live forever ,I've to find a way.










I have decided to go to my tree friend for a suggestion.

My mother told me to be careful and come with victory.
I told my mother not to worry about me .I went to the place where my friend was living.
I asked him to do something to make my family and me live forever.
He told me to do the Meenu Mountains and get the “Forever Drink “
My tree friend said,“Who ever drinks it,  will live forever.But, you have to make two voyages which are challenging and dangerous. I know you brave and strong. But, I will give you two magic fruits that can help you “
I too the magic fruits and thanked my friend . I started my journey.

Humans say I am the fasted bird known to them.
                                                  I am fast.I could reach the place very quickly.

But, till some distance ,
I could see nothing but firestones on the path.
Then ,I remembered the magic fruits that my treefriend gave me.
I ate the first fruit.
I was amazed that I was flying . 
Suddenly , I dropped down. 
I recalled my treefriend’s words. That magic will work only upto a certain limit.
Then , I ran as fast as I could. I couldnot go beyond the river.
The upland began . It was very steep and high.I ate the second fruit that my friend gave .


I am surprised to find my self jumping high .


I was amazed that I was flying . Suddenly , I dropped down. I recalled my treefriend’s words. That magic will work only upto a certain limit.
Then , I ran as fast as I could. I couldnot go beyond the river.The upland began . It was very steep and high.I ate the second fruit that my friend gave .
I am surprised to find my self jumping high .What a wonder, an Ostrich flying, atlast ! I landed on the top of the cliff. I was tired. I rested for a while .I continued my journey. Soon I reached Meenu Mountains and took the  pot of “Forever Drink” and returned to my family. 

I shared my experiences  and the drink with everyone . My mother said,” How wonderful it would be if your good friend lives with us?”
I invited my friend to our home and shared “Forever Drink “


He now lives with us along  his family, children , grand children and great grand children.
His relatives and friends also joined us .He gives magic fruits to any one who meets him.
And, we all lived happily ever after.


***
D.Pranav Reddy
6th class,Discovery , Gomathy School, Nellore




Prabhava,Books and Beyond ! * All rights reserved.

Tuesday, December 28, 2010

లేత కలం... లోతైన భావనలు.

మైత్రేయ చిన్నప్పుడు చిన్న చిన్న తెలుగు రచనలు చేశాడు.
 తెలుగు వర్క్ షాపుల్లో  చాలా చురుకుగా ఉండేవాడు.
నవ్వుముఖంతో. రాయలంటే మాత్రం ఎందరిలాగానో కాస్త వాయిదా వేసేవాడేమో కానీ,
వాదనల్లో మాత్రం చురుకుగా ముందుండే వాడు. వారి తరగతి అంతా అంతే కదా మరి.
ఇప్పుడు పదకొండో తరగతిలోకి వచ్చేసి, తనకంటూ కొంత ప్రత్యేకమైన రచనావేదికను ఏర్పాటు చేసుకొన్నాడు.
 ఆ ఆలోచనలేమిటొ అనుభూతులేమిటొ మీరూ స్వయంగా చూడండి.
ఆపై ,ఆరో తరగతిలో మైత్రేయరాసిన చిన్ని రచనను చదవండి.
ఇప్పటిదాకా మైత్రేయ పూర్తిపేరు ,
మైత్రేయరంగ అని నాకు తెలియనే తెలియదు..:-)

చిన్న వయసు .పెద్ద ఆలోచనలు.
లేత కలం. లోతైన భావనలు.
మీరూ చూడండి
Conscience of Cognitation లో.

http://letusblogmaithreya.blogspot.com

మైత్రేయకు అనేక శుభాకాంక్షలు.

అభిమానంగా.
***

జాతర 
*
ఒక ఊరు. ఆ ఊరి పేరు రామాపురం. ఆ ఊరిలో రంగయ్య అనే రైతు ఉండే వాడు.
అతను ఒక రోజు పొలం వెళ్ళి వచ్చాడు. స్నానం చేసి భోజనం చేసాడు.
ఆ రోజు ఆ ఊరిలో పెద్ద జాతర. ఆ జాతరకు రంగయ్య తన కుటుంబంతో వెళ్ళాడు.
జాతర లో దేవుని గుడిని రంగురంగుల దీపాలతో అలంకరించారు.
 రకరకాల వస్తువుల దుకాణాలు ,అలంకరించిన ఎడ్లబండ్లు ,రంగుల రాట్నాలు,
 అనేకరకాల బొమ్మలు ,కుండలు కడవలౌ ,బానలు మూకుడులు ఉన్నాయి.
అక్కడ రచ్చబండ ఉంది.
దానిపై జ్యోతిష్యుడు కూర్చుని జోస్యం చెపుతున్నాడు.
రంగయ్య అక్కడి గుంపులో చేరి వింటున్నాడు.
అప్పుడు ఒక దొంగ వాళ్ళ డబ్బు కొట్టేసాడు.
తరువాత వాళ్ళు పోలీసులను పిలిచారు.పోలీసులు వెంటనే జీపులో వచ్చారు.
దొంగను పట్టుకొని, డబ్బును రగయ్య చేతికి ఇచ్చారు.
ఆ డబ్బుతో అందరు వాళ్ళకు కావలసిన వస్తువులు కొనుక్కొని,
తిరిగి ఇంటికి వెళ్ళారు.
***
మైత్రేయ ఆరో తరగతి.
రిషీవ్యాలీ స్కూలు,
(పిల్లనగ్రోవి  - పిల్లల కలాలు సంకలనం  నుంచి)


Prabhava,Books and Beyond ! * All rights reserved.

Tuesday, October 26, 2010

సాహసాలు చేస్తా



9-11-2008
ప్రభవ  పిల్లల పండుగ సందర్భం గా నిర్వహించిన ,
పిల్లలకు జే జే -2008 రచన   సబ్ జూనియర్స్లో  ,తృతీయ బహుమతి.

***
నాకు గనుక అద్బుత శక్తి వస్తే ,
అనేక సాహసాలు చేస్తాను.
మనిషిని పులిని చేస్తాను. పులిపిల్లల దంతాలు లెక్కబెడతాను.
ఆకాశంలో ఎగురుతాను . గాలిలో నడుస్తాను.

నక్షత్రాలను లెక్కిస్తాను.
నీళ్ళను మట్టిలా మారుస్తాను.

పిల్లిని జింకలా మారుస్తాను.
ఆవును మనిషిలా మారుస్తాను.


 ప్రజలను కాపాడుతాను.
*
టి .వరకుమార్,5 వ తరగతి సబ్ జూనియర్స్ ,తృతీయ బహుమతి.
9-11-2008

*
Prabhava,Books and Beyond ! * All rights reserved.

Sunday, October 24, 2010

పండ్లను పువ్వులుగా

ప్రభవ  పిల్లల పండుగ సందర్భం గా నిర్వహించిన ,
పిల్లలకు జే జే -2008 రచన , సబ్ జూనియర్స్ ,ద్వితీయ బహుమతి.
*


నాకు గనుక అద్బుత శక్తి వస్తే,
 నేను ప్రజలను కాపాడుతాను.
 నా మీదికి దాడి చేయడానికి వచ్చిన వారిని ఎదిరించి ఫైట్ చేస్తాను.
చంద్రమండలంలోకి వెళ్తాను.సూర్యును వద్దకు వెళతాను.మేఘాలపై నడుస్తాను. గాలిలో సాహసాలు చేస్తాను.నక్షత్రాల వద్దకు వెళతాను.
 మనిషిని బొమ్మలా మారుస్తాను.పొదల్లో ఉన్న కుందేలును ఏనుగులా మారుస్తాను.ఏనుగును జింకలా మారుస్తాను.
అడివిని చెరువులా మారుస్తాను.గడ్డిని పాములా మారుస్తాను. నా శక్తితో సింహాన్ని చీలుస్తాను.
 సింహంతో ఆడుకొంటాను.
 ఆహార పదార్ధాలను వజ్రాలుగామారుస్తాను.పండ్లను పువ్వులుగా మారుస్తాను.
 నాకు దగ్గరలో నదిలో పడిఉన్న పాపకు ప్రథమ చికిత్స చేసి కాపాడతాను.
నా అద్బుత శక్తితో ఇతరులకు సహాయం చేస్తాను.




డి.విజయ చంద్రిక , 4 వ తరగతి. సబ్ జూనియర్స్ ,ద్వితీయ బహుమతి.
9-11-2008


Prabhava,Books and Beyond ! * All rights reserved.

Friday, October 22, 2010

పెద్ద వాళ్ళకు రక్షకుడు

ప్రభవ  పిల్లల పండుగ సందర్భం గా నిర్వహించిన ,
పిల్లలకు జే జే -2008 రచన లో సబ్ జూనియర్ విభాగం , ప్రథమ బహుమతి.
***.


నాకే ఒక అద్బుత శక్తి వస్తే,

నేను పేద వారికి సహాయం చేస్తాను.
ఎవరన్నా ఆపదలో ఉంటే సహాయం చేస్తాను.

24 గంటలూ టివి చూస్తూ ఉంటాను. హోం వర్క్ మాయం చేస్తాను. ఆదివారం క్రికెట్లో గెలుస్తాను.

నేను మాయం అయి ,దేవుడి దగ్గరికి వెళ్ళి ,వారితో "మంచి వాడు" అని రాయమంటాను.
నేను చందమామ దగ్గరకు వెళతాను. నేను చరిత్రలో మిగిలి పోతాను.

మగవాళ్ళు ఆడవాళ్ళను ఏడ్పించకుండా మంచివాళ్ళలా మార్చేస్తాను.

నేను  చుక్కలలో ఆడుకొంటాను. నేను కుక్కలకు మాటలు వచ్చేలా చేస్తాను.

నేను  ఎన్నో స్టిక్కర్స్ కొనుక్కొని అందరికీ ఇస్తాను.

డబ్బు ఉందని, డబ్బులేని వారిని  హింసిస్తూ ఉంటారు. వారికి తగిన శిక్ష పడేట్లు చేస్తాను.

నేను స్కూల్లో నాలాంటి వాళ్ళను చేసి ,ఒక అబ్బాయి ని స్కూల్ లోకి పంపుతాను. నేను ఆడుకొంటాను.

పెద్ద వాళ్ళకు రక్షకుడిగా ఉంటాను.


*


ఎన్.ధర్మతేజ ,5 వ తరగతి. సబ్ జూనియర్ విభాగం , ప్రథమ బహుమతి.



Prabhava,Books and Beyond ! * All rights reserved.

Thursday, October 21, 2010

ఎట్లా నటించారో అట్లా

ప్రభవ  పిల్లల పండుగ సందర్భం గా నిర్వహించిన ,
పిల్లలకు జే జే -2008 రచన లోఎన్ .భవ్య ,
తృతీయ బహుమతి, రచన

*


నేను యుకెజి చదివేటప్పుడు ఒక సినిమా చూచాను. 
దాని పేరు "మీనాక్షి."
ఆ సినిమా మీనాక్షి దేవతకు సంబంధించినది.
 ఆ సినిమా చివరన మీనాక్షి దేవత  ఒక రాక్షసుణ్ణి చంపింది.
 ఆ సీన్లో మీనాక్షి దేవత రాక్షసుణ్ణి కాలి క్రింద వేసుకొని ,త్రిశూలంతో చంపింది.
 సినిమా చూసిన తరువాత ,నేను  మా తమ్ముడు  ఆ సినిమాలో ఎట్లా నటించారో అట్లా నటించాలనుకొన్నాము. ఆ ఆటలో మా తమ్ముడు రాక్షసుడు. నేను దేవత.
అప్పుడు నేను తమ్ముడి పొట్టపై కాలితో తొక్కాను .
వెంటనే తమ్ముడు వాంతి చేసుకొన్నాడు. అప్పుడు మా అమ్మ వచ్చి నన్ను కొట్టింది.
మనుషులు దేవతలతో సమానం అంటారు. 
కానీ ,మా తమ్ముడిని నేను కాలితో పొట్టపై తొక్కాను. అందుకని ఈ విషయం తలుచుకొంటే , నాకు బాధ కలుగుతుంది.

ఇక, నేను ఎప్పుడూ స్కూలికి సెలవు పెట్టను.
 నేను ఆరోతరగతి చదువుతున్నప్పుడు మా బంధువుల పెళ్ళి వచ్చింది. వాళ్ళు మకు చాలా దగ్గర బంధువులు.  నేను ఆ పెళ్ళికి రానని చెప్పినా ,మా అమ్మ తీసుకొని వెళ్ళింది. మూడురోజులు బడికి సెలవు పెట్టాల్సి వచ్చింది.కాబట్టి నాకు ఫుల్ అటెండెన్స్ ప్రైజ్ మిస్ అయిపోయింది. అందుకని మా అమ్మ మీద నాకు చాలా కోపం వచ్చింది.

ఒక రోజు మధ్యాహ్నం  లంచ్ చేయడానికి ఇంటికి వచ్చాను. లంచ్ అయ్యాక ,నేను స్కూలుకి వెళుతుండగా ,దారిలో ముగ్గురు బెగ్గర్స్ కనబడ్డారు .వారిలో ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి వయస్సు 3 ఆర్ 4 సంవత్సారాలు ఉంటుంది. ఆ అబ్బాయికి మిగిలిన ఇద్దరు బెగ్గర్స్ ఎలా బెగ్ చేయాలి అని ట్రేయినింగ్ ఇస్తున్నారు. నాకు ఆ విషయం చూసి చాలా జాలి బాధ కలిగాయి.
అప్పుడు , నేను పెద్ద అయిన తరువాత , ఖచ్చితంగా ఎవరినీ బెగ్ చేయనీయకుండా కాపాడాలని నిర్ణయించుకొన్నాను.

ఎన్ .భవ్య ,
9-11-2008, 
8వ తరగతి.   సీనియర్లలో  , తృతీయ బహుమతి.
***

Prabhava,Books and Beyond ! * All rights reserved.

Wednesday, October 20, 2010

అమ్మ చదువుకొంది కాబట్టి

టి. శ్రావణి. 8 వ తరగతి
ప్రభవ  పిల్లల పండుగ సందర్భం గా నిర్వహించిన ,
పిల్లలకు జే జే -2008 రచన లో సీనియర్ విభాగం లో ద్వితీయ బహుమతి రచన .
***


నేను ఇప్పుడు రాయదలిచినది బాధ కలిగించే విషయం.
అంటే ,

మా ఇంటి ప్రక్కన ఉండే ఒక అతను తాగి వచ్చి ,
తన భార్యను కొట్టే వాడు .
ఆమె పిల్లల చదువు కోసం దాచుకొన్న డబ్బును తీసుకొని కూడా తాగేవాడు.

ప్రతిరోజూ ఆమెను హింసలు పెట్టే వాడు.
అలా ఆయన తాగి తాగి,ఒక రోజు మరణించాడు.

ఇప్పుడు ఆమె భర్త చని పోయినందుకు బాధపడాలో ,లేక అతను పెట్టే హింసలు తగ్గాయని ఆనంద పడాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.

ఆ స్థానం లో మీరే కనుక ఉన్నట్లయితే ఎలా ఊహిస్తారో నాకు తెలియదు.వాళ్ళ అమ్మ చదువుకొంది కాబట్టి ,
మంచి ఉద్యోగం చేస్తూ ,పిల్లలను బాగా చదివించుకొనే స్థాయి ఏర్పడింది. కానీ ,పిల్లలను చదువుకోమంటే వాళ్ళు సహకరించడం లేదు. ఎప్పుడు చూసినా క్లాసులకు వెళ్ళ కుండా వీధుల వెంట తిరిగే వారు.

ఒక రోజు వాళ్ళమ్మ రిపోర్టులు చూడడంతో ,వాళ్ళు ఏ మాత్రం చదువుతున్నారో అర్ధమైంది. 
అప్పటినుండి వాళ్ళ అమ్మ జాగ్రత్త తీసుకోవడంతో వాళ్ళు చక్కగా చదువుతున్నారు.

మొదట బాధ కలిగించినా చివరకు ఆనందమే లబిస్తుంది.

టి. శ్రావణి. 8 వ తరగతి
ప్రభవ  పిల్లల పండుగ సందర్భం గా నిర్వహించిన ,
పిల్లలకు జే జే -2008 కథారచన లో సీనియర్ విభాగం లో ద్వితీయ బహుమతి..
9-11-2008


Prabhava,Books and Beyond ! * All rights reserved.

No politics , Please !

ప్రభవ  పిల్లల పండుగ సందర్భం గా నిర్వహించిన ,
పిల్లలకు జే జే -2008  రచన  జూనియర్ (ఇంగ్లీషు )లలో ప్రథమ  బహుమతి. జి.  ప్రణీత్  భరద్వాజ  రచన.
***

If I get an unlimited power, I will buy this whole world . 
I will fill this whole world with trees.Those trees will give me good health. 

There shall be no politics in the world.
People in the whole world shall work except children.
In the whole world many children are dying because of traffic. Traffic shall be under control.
There should be freedom for everyone in the world.


I will built large number of schools .
There will be some rules for the school. 
These rules would create some interest  in education .
    • Teachers should not beat the children.
    • They shouldnot give home work.
    • They should not have writing work.
    • When the teacher tells some lesson ,students  could save it in their laptops.
    • Students  wouldnot have heavy school bags.
    • Teachers shouldn’t stress the children.
    • The school should be for four hours only.
    • The school should be for five days a week.
 *

G.Praneeth Bharadhwaja ,6th class.9-11-2008

Prabhava,Books and Beyond ! * All rights reserved.

Thursday, October 14, 2010

మా అత్తమ్మ

ప్రభవ  పిల్లల పండుగ సందర్భం గా నిర్వహించిన ,
పిల్లలకు జే జే -2008 రచన లో ప్రథమ బహుమతి పొందిన
డి. గురు ప్రసన్న   ఏం రాసిందో మీరే చదివి చూడండి.
***
మా అత్తమ్మ

హల్లో!
ఈ రోజు మీకు నేను మా అత్తమ్మ గురించి చెప్పబోతున్నాను.
నేను చెప్పబోయే విషయం చాలా బాధాకరమైనది.

 నేను మా అత్తమ్మను అత్త అని ఏనాడు అనుకోలేదు.
అమ్మ వలె తను ప్రేమను పంచేది. తాను నాకు గురువుగా పాఠాలు చెప్పేది.తను స్నేహితురాలిగా సలహాలు ఇచ్చేది. 
అలా జరుగుతుండగా ,ఒకనాడు మా అత్తమ్మకు పెళ్ళిసంబంధాలు వచ్చాయి.
ఒక పెళ్ళి సంబంధం కుదిరి, మా అత్తమ్మ పెళ్ళి చేసుకొని వెళ్ళిపోయింది.
మరవళికి మా అత్తమ్మతో నేను వెళ్ళాను.
నేణు వెళ్ళిన రోజు  , అంతా మా అత్తమ్మను బాగానే చూశారు.
పెళ్ళి అయిన మూడు నెలల నుండి అంతా తారుమారయ్యింది.
చీటికీ మాటికీ తిడుతూ ఉండేవారు.వాళ్ళలో మొదటివ్యక్తి అమ్మన్నమ్మ.
ఈమె మా అత్తమ్మ వాళ్ళ భర్త అక్క.ఈమె ఇంటిలోనే మా అత్తమ్మ కాపురం ఉండేది.
మా అత్తమ్మ మామయ్య సంతోషంగా ఉండడం చూడలేక, 
మా అత్తమ్మ కాపురాన్ని వాళ్ళ ఇంటికి అవతల వైపుగా ఉన్న, తెల్ల రంగా ఇంటి పైభాగాన ఉన్న మూడవ అంతస్తులోకి జేరిపించింది.
మా అత్తమ్మ పెళ్ళి అయిన తరువాత ఏనాడు సంతోషంగా లేనే లేదు.
మేము వెళ్ళిన ప్రతిసారీ ఏడుస్తూనే ఉండేది.
అడిగితే చెప్పేదే కాదు.
ఇలా ఎన్ని కష్టాలు పెట్టినా కూడా ,తన మనస్సులో తను బాధ పడేదే కానీ ,మాకు చెప్పేదే కాదు.

ఇలా కొంత కాలం గడిచాక, మేము అప్పుడప్పుడు వెళుతున్నామని వాళ్ళ కాపురాన్ని కావలికి మార్చారు.
కావలిలో సివయ్య అని ఒకాయన ఇంటిలో కాపురం ఉండే వాళ్ళు.
 నన్ను మన్నించండి.
ఎందుకంటే ,నేను  మీకు ఒక విషయం చెప్పడం మరిచాను.
అదేమిటంటే, మా అత్తమ్మకు గర్భం వచ్చినప్పటి  సంగతి.
ఏ ఆడపిల్లకైనా గర్భం వస్తే పుట్టింటికి రావడం ఆనవాయితీ.
అలాగే మా అత్తమ్మ కూడా మా ఇంటికి వచ్చింది.
కొద్ది రోజూ బాగానే ఉన్నింది.
హఠాత్తుగా ఒకరోజు నొప్పులు వచ్చేసరికి వైద్యశాలకు తీసుకెళ్ళము.
నొప్పులు తగ్గి ఒక అబ్బాయి పుట్టాడు.
ఆ అబ్బాయిని చూడడానికి మామయ్యను రమ్మంటే ,ఎలాగో వచ్చాడు.
వచ్చి చూసి వెళ్ళి పోయాడు.
తరువాత వాళ్ళ అక్క వాళ్ళ కుటుంబం అంతా చూసారు.
ఇక, వైద్యశాల నుంచి ఇంటికి తీసుకు వచ్చాం.

కొద్ది రోజుల తరువాత ,ఫోన్ చేసి వాళ్ళు మా అత్తమ్మను వాళ్ళ ఇంటికి రమ్మన్నారు.
మా అమ్మానాన్నా ఎంత చెప్పినా వినలేదు.
'నేను వెళ్ళాలి” అనింది.
సరే అని మా అత్తమ్మకు తోడుగా మా నాన్నమ్మను పంపించాం.

కావలి వెళ్లిన తరువాత  వాళ్ళు," మా ఇంటికి ఇప్పుడు ఎందుకు వచ్చావు ?" అని అడిగారు.
వెళ్లి కొద్ది రోజుల తరువాత రమ్మన్నారు.
మళ్ళీ ఇంటికి ఇంటికి తిరిగి వచ్చేసి ,కొద్ది రోజుల తరువాత వెళ్ళింది.

అప్పుడు మా అత్తమ్మకు పుట్టిన బాబును జొన్నవాడకు వాళ్ళ అక్కవాళ్ళు తీసుకు వెళుతారు 'అని చెప్పి బాబుని ఇవ్వమన్నాడు.
మా అత్తమ్మ వస్తానంటే వద్దన్నాడు.
బలవంతంగా తల్లినీ బిడ్డనూ వేరు చేసాడు.
కొద్దిసేపటి తరువాత , మా అత్తమ్మ ఫోన్ చేసి , అక్కడ జరిగిన సంగతి చెప్పింది.
మా అత్తమ్మ కు సర్ది చెప్పారు.

ఆ మరుసటి రోజు వాళ్ళు ఫోన్ చేసి ," మీ అమ్మాయి మీ ఇంటికి వచ్చేస్తుంది "అని చెప్పారు.
మా వాళ్ళు అందరూ అలిసి ,ఒక్కొక్కరూ ఒక్కో దగ్గరకు వెళ్ళి ,ఎంత వెతికినా కనబడలేదు.

మరుసటినాడు, ఈనాడు పేపర్లో రాపూరు రైలు పట్టాల మధ్య పడి ఉన్న ఒక శవం అని చదివి ,అది మా అత్తమ్మలాగా ఉండడం గమనించి ,కావలి రైల్వే స్టేషన్ కు వెళ్ళి చూడగా ,అది అత్తమ్మదని తెలిసింది.

ఆ రోజు మా వాళ్ళు వెళ్ళే సమయంలో  ,మా మామయ్య వాళ్ళు ఆ శవాన్ని అనాధ శవం అని రాపిస్తుండగా ,
మా వాళ్ళు వెళ్ళి ,"అది మా అమ్మాయి " అని రాయించారు.

నేను మొట్టమొదట ఎక్కువగా బాధపడిన సంఘటన ఇది.
ఇది కథ కాదు నిజం.
నేను ఎంత ఎక్కువగా బాధ పడ్డానో నాకు తప్ప ఇంక మరెవ్వరికీ తెలియదు.

*
డి గురు ప్రసన్న , 8 వ తరగతి.
నెల్లూరు.
9-11-2008



 .




Prabhava,Books and Beyond ! * All rights reserved.