తెలుగు వర్క్ షాపుల్లో చాలా చురుకుగా ఉండేవాడు.
నవ్వుముఖంతో. రాయలంటే మాత్రం ఎందరిలాగానో కాస్త వాయిదా వేసేవాడేమో కానీ,
వాదనల్లో మాత్రం చురుకుగా ముందుండే వాడు. వారి తరగతి అంతా అంతే కదా మరి.
ఇప్పుడు పదకొండో తరగతిలోకి వచ్చేసి, తనకంటూ కొంత ప్రత్యేకమైన రచనావేదికను ఏర్పాటు చేసుకొన్నాడు.
ఆ ఆలోచనలేమిటొ అనుభూతులేమిటొ మీరూ స్వయంగా చూడండి.
ఆపై ,ఆరో తరగతిలో మైత్రేయరాసిన చిన్ని రచనను చదవండి.
ఇప్పటిదాకా మైత్రేయ పూర్తిపేరు ,
మైత్రేయరంగ అని నాకు తెలియనే తెలియదు..:-)
చిన్న వయసు .పెద్ద ఆలోచనలు.
లేత కలం. లోతైన భావనలు.
మీరూ చూడండి
Conscience of Cognitation లో.
http://letusblogmaithreya.blogspot.com
మైత్రేయకు అనేక శుభాకాంక్షలు.
అభిమానంగా.
***
జాతర
*
ఒక ఊరు. ఆ ఊరి పేరు రామాపురం. ఆ ఊరిలో రంగయ్య అనే రైతు ఉండే వాడు.
అతను ఒక రోజు పొలం వెళ్ళి వచ్చాడు. స్నానం చేసి భోజనం చేసాడు.
ఆ రోజు ఆ ఊరిలో పెద్ద జాతర. ఆ జాతరకు రంగయ్య తన కుటుంబంతో వెళ్ళాడు.
జాతర లో దేవుని గుడిని రంగురంగుల దీపాలతో అలంకరించారు.
రకరకాల వస్తువుల దుకాణాలు ,అలంకరించిన ఎడ్లబండ్లు ,రంగుల రాట్నాలు,
అనేకరకాల బొమ్మలు ,కుండలు కడవలౌ ,బానలు మూకుడులు ఉన్నాయి.
అక్కడ రచ్చబండ ఉంది.
దానిపై జ్యోతిష్యుడు కూర్చుని జోస్యం చెపుతున్నాడు.
రంగయ్య అక్కడి గుంపులో చేరి వింటున్నాడు.
అప్పుడు ఒక దొంగ వాళ్ళ డబ్బు కొట్టేసాడు.
తరువాత వాళ్ళు పోలీసులను పిలిచారు.పోలీసులు వెంటనే జీపులో వచ్చారు.
దొంగను పట్టుకొని, డబ్బును రగయ్య చేతికి ఇచ్చారు.
ఆ డబ్బుతో అందరు వాళ్ళకు కావలసిన వస్తువులు కొనుక్కొని,
తిరిగి ఇంటికి వెళ్ళారు.
***
మైత్రేయ ఆరో తరగతి.
రిషీవ్యాలీ స్కూలు,
(పిల్లనగ్రోవి - పిల్లల కలాలు సంకలనం నుంచి)
Prabhava,Books and Beyond ! * All rights reserved.
No comments:
Post a Comment