ప్రభవ పిల్లల పండుగ సందర్భం గా నిర్వహించిన ,
పిల్లలకు జే జే -2008 రచన లోఎన్ .భవ్య ,తృతీయ బహుమతి, రచన
*
నేను యుకెజి చదివేటప్పుడు ఒక సినిమా చూచాను.
దాని పేరు "మీనాక్షి."
ఆ సినిమా మీనాక్షి దేవతకు సంబంధించినది.
ఆ సినిమా చివరన మీనాక్షి దేవత ఒక రాక్షసుణ్ణి చంపింది.
ఆ సీన్లో మీనాక్షి దేవత రాక్షసుణ్ణి కాలి క్రింద వేసుకొని ,త్రిశూలంతో చంపింది.
సినిమా చూసిన తరువాత ,నేను మా తమ్ముడు ఆ సినిమాలో ఎట్లా నటించారో అట్లా నటించాలనుకొన్నాము. ఆ ఆటలో మా తమ్ముడు రాక్షసుడు. నేను దేవత.
అప్పుడు నేను తమ్ముడి పొట్టపై కాలితో తొక్కాను .
వెంటనే తమ్ముడు వాంతి చేసుకొన్నాడు. అప్పుడు మా అమ్మ వచ్చి నన్ను కొట్టింది.
మనుషులు దేవతలతో సమానం అంటారు.
కానీ ,మా తమ్ముడిని నేను కాలితో పొట్టపై తొక్కాను. అందుకని ఈ విషయం తలుచుకొంటే , నాకు బాధ కలుగుతుంది.
ఇక, నేను ఎప్పుడూ స్కూలికి సెలవు పెట్టను.
నేను ఆరోతరగతి చదువుతున్నప్పుడు మా బంధువుల పెళ్ళి వచ్చింది. వాళ్ళు మకు చాలా దగ్గర బంధువులు. నేను ఆ పెళ్ళికి రానని చెప్పినా ,మా అమ్మ తీసుకొని వెళ్ళింది. మూడురోజులు బడికి సెలవు పెట్టాల్సి వచ్చింది.కాబట్టి నాకు ఫుల్ అటెండెన్స్ ప్రైజ్ మిస్ అయిపోయింది. అందుకని మా అమ్మ మీద నాకు చాలా కోపం వచ్చింది.
ఒక రోజు మధ్యాహ్నం లంచ్ చేయడానికి ఇంటికి వచ్చాను. లంచ్ అయ్యాక ,నేను స్కూలుకి వెళుతుండగా ,దారిలో ముగ్గురు బెగ్గర్స్ కనబడ్డారు .వారిలో ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి వయస్సు 3 ఆర్ 4 సంవత్సారాలు ఉంటుంది. ఆ అబ్బాయికి మిగిలిన ఇద్దరు బెగ్గర్స్ ఎలా బెగ్ చేయాలి అని ట్రేయినింగ్ ఇస్తున్నారు. నాకు ఆ విషయం చూసి చాలా జాలి బాధ కలిగాయి.
అప్పుడు , నేను పెద్ద అయిన తరువాత , ఖచ్చితంగా ఎవరినీ బెగ్ చేయనీయకుండా కాపాడాలని నిర్ణయించుకొన్నాను.
ఎన్ .భవ్య ,
9-11-2008,
8వ తరగతి. సీనియర్లలో , తృతీయ బహుమతి.
***
Prabhava,Books and Beyond ! * All rights reserved.
No comments:
Post a Comment