వేప చెట్టు చూడండి
అందమైన చెట్టు అది
*
Prabhava,Books and Beyond ! * All rights reserved.
అందమైన చెట్టు అది
ఆకులన్ని పచ్చగా
పువ్వులేమో తెల్లగా
ఒక పువ్వు నోటిలోకి
పెట్టుకున్నాను
వెంటనే కళ్ళు తిరిగి
పడిపోయాను
ఆ పూతను గిన్నెలోకి
వేసుకున్నాను.
చెరుకు గడని చూడండి
చాలా పెద్ద గడ అది
దాని తీపి రసం
పిండాకా,
బెల్లం తయారు చేశాకా,
బెల్లం ముక్క
తిన్నాను.
పొట్ట నొప్పితో
చచ్చాను.
ఆ బెల్లాన్ని
గిన్నెలోకి వేసుకున్నాను.
చిన్నచిన్న పొదలు -
చిటారి కొమ్మలు -
వాటికి వేలాడి
ఉన్నాయి కాయలు
ఆ కాయలు ఎర్రవి, పచ్చవి
కొన్ని చేదువి, కొన్ని వగరువి
ఒకటి నోటిలోకి
పెట్టాను.
వగరుదనం వల్ల రోజంతా
ఏమీ తినలేకపోయాను.
ఆ కాయలు కోసి
గిన్నెలోకి
వేసుకున్నాను.
మిరప పొదలు ఎన్నో
ఉన్నాయి.
రంగు రంగుగా కళ్ళకు
బాగున్నాయి.
చూద్దామని ఒకటి
నోటిలోకి పెట్టాను.
కారంతో మండి
చచ్చాను.
ఆ కాయనూ
గిన్నెలోకి వేసుకున్నాను.
ఒక మామిడి చెట్టు
చూశాను
పచ్చి మామిడికాయ
కోశాను.
ఆ పుల్లదనంతో కళ్ళు
మూశాను.
అయినా, గిన్నెలోకి వేసాను.
ఇవన్నీ ఒకటొక్కటిగా
తినటం కష్టం.
ఆ ఐదు వేరే వేరే
రుచులు
వాటిల్ని కలిపితే ఒక
అభిరుచి తయారవుతుంది
దాని పేరే ఉగాది
పచ్చడి
అలాగే జీవితం
అన్ని
రసాలు కలిసినది
అందుకనే మనం
దేముడికి
ధన్యవాదాలు చెప్పాలి.
*
నివేద్,
9వ తరగతి
http://www.prabhavaschool.com/Prabhava,Books and Beyond ! * All rights reserved.
No comments:
Post a Comment