*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Wednesday, May 28, 2014

యట్లెట్లా! అట్లెట్లే !

"సూడండప్పా ఇనుకోండమ్మా. నేను ముంద్రే సెప్పతా ఉండా,
ఎవురు ఏమి ఎబుడు ,ఏడ అని నన్ను అడగొద్దండ,నడిసిండేది రాస్తా ఉండా ,
సదివితే సదవండా ఇంటే ఇనండా ,
నన్నేమన్నా అంటిరో ,నేను అర్దర్కులు నాయాలే కాదు ,
శానా తక్కువ నా కొడుకుని ... ఇట్లు ఈ కత రాసినోడు.
"యట్లెట్లా ఇంగో కీత సెపు సామీ ఆ సుద్ది " వక్కాకు నమలతా అనే మా అవ్వ .
"మోవ్ ! ఎన్ని కితాలు ఎట్లెట్ల సెప్పినా అదంతే. 
శంబూకుడు తప్పుసేసే తబుసు సేసి. శీరాముడు వాని తలా నరికె" కోపముగా అనిరి సాములోళ్లు. 
"ఇంత బిర్న కోపము సేసుకొంటే ఎట్ల సామీ! 
మేము ఎన్ని యుగాలనింకా కోపము సేసుకోకుండా ఉండాము.
నిదానము .నిదానము సామీ " సున్నము నోట్లా యేసుకొని మాట్లాడే అవ్వ
( యట్లెట్లా! నుంచి)


రచయిత వైద్యుడు కదా.ఆయన వృత్తి నైపుణ్యాన్ని కూడా ఈ కతల్లో నింపిరి. 
కొన్ని తావుల్లో చేదు మందులు మింగిస్తారు. కొన్ని తావుల్లో చురుక్కుమని సూదితో పొడుస్తారు. 
కొన్ని తావుల్లో  మలాము పూసి మెత్తని  కట్టు  కడుతారు. 
పత్రికల తెలుగులో లేదు కదా అని  ఈ కతలను పక్కకు పెట్టంద్దండీ. పత్రికల తెలుగు అద్దాల అరల్లోని అందాల బొమ్మ అయితే, తావు తెలుగు చెమటను చిందించి సాకే అమ్మ.
 "మా తావు తెలుగు కాదు కదా " అని ముఖం చిట్లించకండి. 
తెలుగు తల్లి కనిన గారాబు బిడ్డ మా హోసూరు తెలుగు. 
మా తెలుగు తావి మిమ్మల్ని కమ్ముకొని జోకొడుతుంది.
 నిజమైన మాట ఇది. నమ్మకం లేక పోతే మొదలు పెట్టి చూడండి. 
నంద్యాల నారాయణ రెడ్డి (+91 9360514800)
***
నా తావుకి వచ్చే రోగులకి మందులిచ్చి పంపేయకుండా ,
బిడువు చేసుకొని రవంచ పొద్దు వాళ్ళతో మాట్లాడతా ఉంటాను. 
అంతకు ముందర ఎపుడూ విని ఉండని మాటలు వస్తే,
వాటిని జోపానముగా రాసి పెట్టుకొనేది అలవాటయ్యింది. 
ఇట్లా మాటలని మూటకట్టుకొంటా ఉండిన నాతో ,
" ఇంకొక కతల పుస్తకం తేవాలని" రమేశప్ప చెప్పిరి. 

ఇట్లా రాస్తా రాస్తా హోసూరు మాండలికమనే విమానమెక్కి, 
ఆంధ్రా అసెంబ్లీ లో దూరి,దేశమంతా పారాడి, మంచీ చెడ్డలు చూసి,
 భూమమ్మ కూతురికీ పొద్దప్పకొడుకీ పెండ్లి చేసి  మబ్బు దేవునికి మొక్కి వస్తిని.
డా. అగరం వసంత్ 


54  కతలు 
వెల :  రూ.100/- 

చేపలుకి :
డా.అగరం వసంత్  (0)9488330209/ 7795094148
స వెం రమేశ్ :  (0) 8500548142   
ఉమా మహేశ్వరరావు 8985425888

***
ప్రభవ (0861)2333767/ 2337573
prabhava.books@gmail.com


Prabhava,Books and Beyond ! * All rights reserved.

Monday, May 26, 2014

మోతుకుపూల వాన

మోతుకుపూలంటే ..?!?
దారంతా ఉవ్వెత్తున లేచిన మంటలా ఎర్రగా విరబూసిఉన్నాయి...అవేనా?
ఊహూ ..కాదు. అవి అగ్ని పూలు.
సభాప్రాంగణం వాకిట్లో తమ రేకులతో ఎర్రతివాచీ పరిచాయి... అవేనా ?
కానే కాదు. అవి తురాయి పూలు.
మరి మోతుకుపూలంటే ఏందబ్బా.. త్వరగా చెప్పూ..
మా బతుకులు !


పూలచినుకులు ..
పంతొమ్మిది రచయితల కథలు.
వెల -80/-
ప్రచురణ: కృష్ణగిరి రచయితల సంఘం,హోసూరు
ప్రతులకు : 

కృష్ణగిరి జిల్లా తెలుగు రచయితల సంఘం, 
2-1095, ఆవులపల్లి రోడ్,బస్తి,హోసూరు-635109,
కృష్ణగిరి జిల్లా,తమిళనాడు.

చేపలుకి :
స వెం రమేశ్ :  (0) 8500548142   
ఉమా మహేశ్వరరావు 8985425888
డా.అగరం వసంత్  (0)9488330209/ 7795094148
***
ప్రభవ (0861)2333767/ 2337573
prabhava.books@gmail.com



Prabhava,Books and Beyond ! * All rights reserved.

Saturday, May 24, 2014

సొంపూ సోయగం


నిండా పంతొమ్మిదేళ్ళు రాని వయసులో రాయడం మొదలెట్టి ,
ఈ కొద్దికాలంలోనే తన రాతలను ఒక పుస్తకరూపంలో అందుకొంటున్న ఆ క్షణాన 
సుమను చూస్తే ఎంత ముచ్చటేసిందో ! 

ఆ పూట కార్యక్రమాన్ని తన స్నేహితురాలితో పాటు ,
తెలుగుతల్లికి మల్లెపూదండ వేసి ప్రారంభించినా, 
వేదిక మీద కు రావడానికి బిడియ పడుతూ సిగ్గు పడుతూ ,
పాటలొలికిన ఆ నోటిలో మాటలు కరువయినట్లు, 
ఆర్తిగా మప్పిదాలు పలికి
గబుక్కున వెళ్ళి తన కుర్చీలో కూచున్న వైనం ,  
మన తెలుగు కతకు వేసిన సరికొత్త చిగురు పసిడి మొగ్గ లా తోచింది.
 సుమకు అనేకానేక శుభాకాంక్షలు. 
తనలానే అనేక సుమాలు మోసులెత్తి 
తెలుగుకతమ్మవడి నింపాలని కోరుకుందాము.
***

దేవిశెట్టి పల్లి మాలగేరిలో ఒక పేద ఆలూమగలైన రామక్కకెంచప్పలకు పుట్టిన మా మునిరాజన్న కతలు రాసేది మొదులు పెట్టినంక ,ఆయనకనే ఒక మరియాదను నలుగుర్లో సంపాదించుకొన్నాడు.
అదంతా చూస్తా ఉంటే నాకు కూడా ఏదన్నా రాయాలనిపిచింది. 
ఏమి రాయాల అని యోచనలో ఉంటే ,
మా మునిరాజన్న ఒక నాడు నాతో ,
" మన ఇండ్లల్లో చేసునే వంటల్ని రాయుమని చెప్పిండాడు రమేశయ్య ,
రాస్తావా బిడ్డా " అన్నాడు .
నేను ఎగిరి గంతేసి సరే అంటిని ,కాగితమూ కలమూ తీసుకొని మొదులు పెడితిని. 
బిరబిర ఒబ్బట్ల వంటకము గురించి రాసి మా అన్న చేతిలో పెడితిని. 
నేను రాసిండే దానిని చదవతా పడి పడీ నగుతా ఉండాడుమునిగాడు. నాకు రేగిపోయింది. 
"ఏమయింది నా రాతలకి ఏల అట్లా  నగేది,చెప్పి చావు " అని అరిస్తిని. 
అపుడు చెప్పినాడు మా అన్న ," తిక్కల బిడ్డా,మా టీవి లో వచ్చే మా వూరి వంట చూసేసి 
అదే మాదిరిగా రాసేస్తే ఎట్ల?"
నిజం చెప్పాలంటే నాకు వంట చేసేది అంత బాగా రాదు.
మా అమ్మా పిన్నమ్మా ఒదినలే మాఇంట్లో వంటచేసేది.అందుకే
ఈ కతల్లో వంట తక్కువ .మా అమ్మ బతుకే ఎక్కువ. 
ఈ కతల్లో చానా వంటలకు కొలతలు చెప్పలేదు నేను.
కొలిచిచేసే వంటలు ఎట్లుంటాయో మీకూ తెలుసు . నాకూ తెలుసు.


నా పేరు ముందు ఉందే రామక్క ,ఆమే నన్ను కన్నతల్లి. 
అబ్బ పేరునే మా పేరుకు ముందు పెట్టుకుంటాము. 
నేను మా అమ్మ పేరు పెట్టుకొంటిని.
ఏలంటే అమ్మ లేక పొతే నేను లేను. నా పుటక లేదు. 
నా చదువు లేదు. ఈ కతలు లేవు. మీతో చెప్పుకొనేకి ఇన్ని మాటలు లేవు. 
అందుకనే ,మీ అట్లా పెద్దోళ్ళతో మాట్లాడే తెంపు కోసరమే పేరులో కూడా అమ్మను తోడు తెచ్చుకొంటిని.
ఇంతకీ  మా వంటలు బాగుండాయో లేదో చెప్పనే లేదే మీరు !
రామక్క గారి సుమ

ముఖ చిత్రం : " పత్రచిత్రకారిణి " డా.లక్ష్మీ సుహాసిని 
తన పుస్తకాన్ని కొని చదవడమే సుమకు మనమిచ్చే ప్రోత్సాహం !
సుమ పుస్తకం ప్రతులకు:
కృష్ణగిరి జిల్లా తెలుగు రచయితల సంఘం, 
2-1095, ఆవులపల్లి రోడ్,బస్తి,హోసూరు-635109,
కృష్ణగిరి జిల్లా,తమిళనాడు.

చేపలుకి :
స వెం రమేశ్ :  (0) 8500548142   
డా.అగరం వసంత్  (0)9488330209/ 7795094148
సుమ  (0) 9715420303 
ఉమా మహేశ్వరరావు 8985425888

***
ప్రభవ (0861)2333767/2337573
prabhava.bppks@gmail.com
Related Link : More Photos :http://chandralata.blogspot.in/2014/05/blog-post_24.html

Saturday, May 10, 2014

చదవగలిగినంత !

ఒక పుస్తకం విలువను కొలవవలసింది ఆ పుస్తకం నుండి మనం గ్రహించిన సారాంశంతో మాత్రమే. 
The worth of a book is to be measured by what one  can carry away from it.

***

వేసంకాలపు చల్లటి కబురు !
అమూల్యమైన పుస్తకాలను తగ్గింపు ధరలలో...ఈ నెల పదిహేనో తారీఖు వరకు మాత్రమే నండోయ్ !
తెలుగు, ఇంగ్లీషు,  కొన్ని హింది పుస్తకాలు కూడాను. పిల్లల పుస్తకాలపై కొద్దిగా ఎక్కువ తగ్గింపు!
కొని చదవ దలుచుకొన్నవారికి చదివించాలనుకొన్న వారికి , కొనదగినంత !
***
Prabhava
prabhava.books@gmail.com     (0861)2333767












Prabhava,Books and Beyond ! * All rights reserved.

ఏకాంత నృత్యం

Siva Somayajula

https://www.facebook.com/syaji0 


"వేదికనలంకరించిన పెద్దలకీ, విచ్చేసిన అతిధులకీ కూడా నా నమస్సులు

పగడమల్లెలు”, అచ్చులో వచ్చిన నా మొట్టమొదటి కథ
నా మొదటి కథకికథా సాహితిలో దక్కుతున్న గౌరవాన్ని గురించి నవీన్ గారు నాకు -మెయిల్ ద్వారా తెలిపినప్పుడు,

ఒక నిమిషం పాటు నా కాళ్ళు నేల మీద నిలువలేదు. సినిమాల్లో చూపించినట్టు చిన్నపాటిఏకాంత నృత్యంచేశానన్న మాట.

ఒక కొత్త కథకుడికి కథకి ఇలా తెలుగు కథాప్రపంచంలోని దిగ్గజాల కథల పక్కన ఉండే స్థానం కలిపించిన నవీన్ గారికీ, శివశంకర్ గారికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

కథ రాయటానికి ప్రోత్సహించీ, ఓపికగా పలుమార్లు ఎడిట్ చేసిన నారాయణ స్వామి గారికి కూడా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

ఆంధ్రజ్యోతి కథా ఎడిటర్ వసంత గారికీ, కథ చదివి వారంతట వారుగా నాకు ఎన్నో అభినందనలు, ప్రోత్సాహకర వ్యాఖ్యలూ అందజేసిన తోటి రచయితలకు కూడా సందర్భంగా ధన్యవాదాలు అందజేసుకుంటున్నాను.


కథ నేపథ్యం గురించి చెప్పాలని ఉన్నా, ఎన్నుకున్న కథనప్రక్రియ వల్ల,
చెప్పకపోతేనే, కథకూ, కథను ఇంకా చదవని పాఠకులకీ కూడా,
న్యాయం చేసినట్టు ఉంటుందని నా అభిప్రాయం. కనక ఇక్కడితో ఆపేస్తాను.

చివరిగా, నేనక్కడ ప్రత్యక్షంగా లేనప్పటికీ, అభిమానంతో, నే చెప్పదలుచుకున్న మూడు నాలుగు ముక్కలను
నా తరఫున మీకు అందజేస్తున్న, చంద్రలత గారికి నా ధన్యవాదాలు. "

***

Prabhava,Books and Beyond ! * All rights reserved.

Thursday, May 1, 2014

చూడండిలా!

Watch us at Youtube ! Now!
 http://youtu.be/upsw_ijS188

Admissions are open!
WELCOME !

Prabhava,Books and Beyond ! * All rights reserved.