*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Thursday, September 30, 2010

స్వేచ్ఛ

స్వేచ్ఛ  లేక బానిసత్వమై

ఎంత మనోవేదనను మింగాడో మరి
తెలియదు ఎవరికి.

పట్ట లేక ,పట్ట లేక రాశాడు ఉత్తరం నాన్న కి .

'తన బాధలు చాలవన్నట్టు
కొడుకు బాధలు కూడానా'
అనుకున్నాడు ఆ తండ్రి

"నీ ఇష్టం పోరా " అన్నాడు .

ఏమీ చేయలేని అమాయకత్వం
నవ్వింది కొడుకులా.
*
జ్యోత్స్న ,
9 వ తరగతి, కొల్లిపర  (2006)
"ప్రియమైన  అమ్మా నాన్నా!" పిల్లల లేఖలు సంకలనం నుంచి.






Prabhava,Books and Beyond ! * All rights reserved.

Saturday, September 25, 2010

Me ,The Super Hero !

బాలోత్సవ్  కథారచన-2009 ,  జూనియర్లలో తృతీయ బహుమతి పొందిన విహార్  కథ. 
***
కథ చెప్పేటప్పుడు , కథకుడికి భాష అనువుగా ఉండాలి కానీ అడ్డంకి కాకుడదు.
కథ చెప్పినా రాసినా అది సృజనాత్మక ప్రక్రియే.
అలా, పిల్లలను  వారికి నచ్చిన భాషలో నచ్చినన్ని  కథలు రాయమంటే, ఎక్కువమంది తెలుగులోను కొద్ది మంది ఇంగ్లీషులోను...చాలా కొద్దిమంది హిందీ లోనూ రాశారు.
అన్నింటినీ చదివి, సృజన శీలత ,భావవ్యక్తీకరణ ప్రధానాంశాలుగా కొన్ని కథలను ఎంపిక చేయగా , ఆంగ్ల కథ తృతీయ బహుమతి పొందింది. చదివి చూడండి.
***
 Me ,The Super Hero ! 

Once ,I was walking on the seashore.Suddenly ,there were noone left, except me. And, I fell into the sea.
I was half drowned and suddenly, with my luck, I found a flat ice piece .I went on to it and sat on it .It floated and reached a very huge iceberg.I jumped on to it and shouted for help.But, no one could hear , to reply me ,as I am too far from my place. I was afraid of water but, not sitting on iceberg.
Then, I went on roaming on the iceberg. Unfortunately ,I slipped into a pit.
Going deeper and deeper into the pit ,I cried out with an extremely loudvoice ,
 “Help ! Help!”
I fell  into the depths and reached the sea bed .I saw a fish and I touched it.
It truned into a fairy.The fairy took me out of water and spoke in lovely  sweet voice,” I was turned into a fish by witche's curse and you saved me. If a human touches me , the curse will be broken.”As a reward ,she gave me superpower which was my dream and now become true.
I flew into the air and went nto the deep sea and crushed the iceberg and returned to my place.
I enjoyed it as fun but ,not took it seriously .
I showed all my powers to my friends and attracted all of them to me.
I misused my powers.Sometimes I attracted and sometimes I frightened them with my superpowers. I never felt it as a fault.
One day, when Tsunami hit the shore ,I was at the seashore,
I didn’t use my powers .Instead I got frightened and ran away.When Tsunami was closer , I flew away.
From that day ,every night I hear a voice,”Use your powers for good!”
Then I realised .
I wanted to go to the fairy and request her to take away my superpowers.
While I was talking ,I saw another Tsunami coming closer to the shore.
This time I didn’t run away .I went much closer to it. I went into the sea. Blew  the water  high up into the air and without giving a gap,I freezed it.I went to the fairy and asked her to take the powers from me.
But, she refused and said in sweet voice, “I saw everything what you did .You realised your mistake.You have even saved the people from Tsunami.You have all the qualities of a super hero.”
But, I didn’t agree.I asked her again and again.
But, the fairy said “All the best!” and disappeared.
From then onwards , I used the powers for good  only.
*
Vihar Reddy, 7th class ,Kadapa 14-11-2009


Prabhava,Books and Beyond ! * All rights reserved.

Friday, September 24, 2010

అన్నం పెట్టే చేతులు

 బాలోత్సవ్ -2009 ,కథారచనలో సీనియర్ లలో ద్వితీయ బహుమతి పొందిన ఎం .అశోక వర్ధన్ కథ.

అన్నం పెట్టే చేతులు
*
పల్లెల్లోని సహత్వం ,ప్రకృతి..పట్నంలోని కృత్రిమత్వంతో కలిసి కలిసి ,కల్తీ అయ్యి ,అక్కడక్కడా కొన్ని హైబ్రీడ్ చెయ్యని చెట్ల రూపంలో ..సహజంగా కనిపిస్తోంది.
పట్నం నిండా వేగానికి బిజీకి అలవాటు పడ్డ దబ్బున్న  బిజినెస్ మ్యాగ్నెట్లే  
ఎక్కువ. అక్కడక్కడా రామయ్య లాంటి చేనేత వృత్తుల వాళ్ళు ,సహజత్వం ప్రాకృతికతత్వం కలిపినట్లు కనిపిస్తారు.
 అది రాం నగర్ కాలనీ.సర్వం బంగ్లాలమయం.
అక్కడక్కడా ,చిన్ని చిన్ని ఇళ్ళల్లో ,రామయ్య లాంటి చేనేతవృత్తుల వాళ్ళు.
ప్రతి రోజూ రామయ్య తన ఇంటి కిటికీలొ నుండి ఎత్తుగా,పాలరాతి మహల్ లా కనబడే మోహన్ రావ్ ఇంటిని చూస్తూ ఉండేవాడు.'ఎప్పటికైనా అలా ఉంటే బాగుండు  'అనుకొనేవాడు. అయినా వాస్తవం తెలిసిన మనిషి. కలలు కంటూనే ,ఒక పక్క తన పని తాను చేసుకొంటాడు. పని చేయక పోతే పూట గడవదు.తన మీద ఆధారపడే భార్య ,కూతురు. చిన్ని ఇల్లు చింతలు లేని ఇల్లులా ..ఉన్న దాంట్లో కాపురాన్ని నెట్టుకొస్తున్నారు.చదువు విలువ తెలుసుకొని కూతురు ,విద్య, ని చదివిస్తున్నారు .. పెద్ద బడిలో.
ఇక, మోహన రావు కూతురు మైథిలి ."డాడీ ! నాకు వాచ్ కావాలి " అన్న మరుక్షణం మైథిలి చేతికి వాచ్ ఉంటుంది. మోహన రావు కి కూతురంటే అంత ఇష్టం మరి.కూతురి కోసం ఎంత పెద్ద మీటింగ్స్ అన్నా వదులుకొని వస్తాడు. తల్లి లేని లోటును తీర్చడానికే ఇదంతా.
ఏదేమైనా ,మోహన రావు మనిషి. మామూలు ధనవంతుడు.
అందరు ధనవంతుల్లాంటి వాడే
విద్య, మైథిలి మంచి స్నేహితులు .ఒకే బడి. ఇళ్ళు పక్కపక్కనే ఉన్నా, మోహనరావు మైథిలిని విద్యతో కలవనివ్వడు. "ఏంటీ ,సిగ్గులేకుండా బికారీ వాళ్ళతొ "అంటూ లోపలికి తీసుకొచ్చేవాడు. కూతురితో విషయంలో నో కాంప్రమైజ్ .
"వాళ్లకూ మనకూ ఏంటి తేడా డాడీ?"అంటూ మైథిలి అమాయకంగా అడిగే ప్రశ్నకి నో ఆన్సర్.

***
 రామయ్య రోజు మగ్గంతో పని చేస్తున్నాడు, "ఇందిరా,ఇందిరా" అంటూ భార్యను కేకేసాడు.
"ఏంటండీ?" అంటూ వంటగదిలో నుండి వచ్చింది ఇందిర.
""ఈ రోజు ఏం జరిగిందో గుర్తుందా?"
"అయ్యో, ఇంకా అదే పట్టుకు వేలాడుతున్నారే, అన్నయ్య వచ్చి , మగ్గం నేసిన తరువాత ఎలాగు ఉపయోగంలేదు ధరలు మండివిషయం . ఎక్కడోఒక చోట పనిలోకి కుదురు.'అన్నాడుగా.అయినా దానికి తొందరేం వొచ్చింది?"
"అదేనే ,మనకు తెలిసిన విద్యల్లా ఇదే.ఈ రెండు చేతులూ ఉన్నంత కాలం నేను మీ ఇద్దరినీ కంటికి రెప్పల్లా కాపాడుకొంటా. దానికి ఈ మగ్గం ఉంది. కానీ, బావ చెప్పే మాటల్లో వాస్తవం కనిపిస్తోంది."
"మీరు ముందు ఆ ఆలోచన ఆపి పని చేయండి. సాయంకాలానికి అనసూయమ్మకి చీర నేసి అమ్మాలి. అయినా,మన అదృష్టం బావుంది కాబట్టే ఇంత బాగా ఉన్నాం.పూటకి గతి లేని వాళ్ళ కంటే మనం చాలా మెరుగు" అంటూ లోనికెళ్ళింది ఇందిర.
అంతలో " నాన్నా" అంటూ విద్య వచ్చింది.గలాగలా తననుకొన్నది ,తనకు తెలిసింది ,బడిలో జరిగింది ..అలా అలా చిట్టి చిట్టి మాటలతో చెప్పింది.
"విద్యా ఇందిరా , మీ ఇద్దరూ నా రెండు కళ్ళు మీకు ఏ కష్టం రానివ్వను .విద్యమ్మా, నిన్ను బాగా చదివించి మంచి డాక్టర్ని చేస్తా. "
"సరే నాన్నా ,నేను డాక్టరౌతా !" అని చెంగు చెంగున గెంతులేస్తూ లోనికెళ్ళింది.
***

మైథిలి ఇంట్లో ఉంది. రోజూలాగా.విద్య కంటే వెయ్యిరెట్లు డబ్బున్నా,తను ఒంటరే.ఇంట్లో దాదాపు లోటు తీర్చడానికి యంత్రాలున్నా,మనుషుల్లేరు. నాన్న అప్పుడప్పుడూ ఉంటాడు.
విద్య వద్దకెళ్దామని అనుకొన్నా అది కుదిరేది కాదు. కానీ,ఒక రోజు కుదిరింది.
మైథిలి ఇంకా ఆడుతుంది. సాయంత్రం 4 గంటల్కి. గోడకేసి బాల్ కొట్టి ,మళ్ళీ గోడతోటే ఆడుతోంది. ఆయాలతో ఆడాలంటే చిరాకు. అందుకే చుట్టూ చూసింది. ఎదురుగా చిన్న ఇల్లు. రోజూ కనిపించేదే.నేడు తలుపులు తెరుచుకొన్నట్లు అనిపిణ్చింది.విద్య ఇల్లది.
మగ్గం నేస్తూ రామయ్య రెస్ట్ తీసుకోవడానికి కాసేపు ఆగాడు.కిటికీ లోనుండి బంగ్లాలో మైథిలి కనిపిస్తోంది.
అలా కాసేపు ఉక్క పోసే ఇంట్లో నుండి గాలికి బైటికి వచ్చాడు.విద్య కోసం మైథిలి వద్దామనుకొంది. బాల్ గోడ బయటికేసింది.వాచ్మాన్ కళ్ళు కప్పి ,బైటకొచ్చింది. రోడ్డుదాటి,ఉరుక్కుంటూ స్వేచ్చగా వదిలిన పక్షిలా బయటకొచ్చింది. కానీ,రామయ్య కళ్ళకు పాపతో పాటూ వేగంగా వస్తున్న కారు కనిపించింది. కారు వాడు చూసుకోవడం లేదు.పాప పరుగు. రామయ్య కాళ్ళు అప్రయత్నంగా కదిలాయి.
***
ఆ రోజు జిల్లా ఎడిషన్లో మొదటి హెడ్ లైన్.
"తృటిలో తప్పిన ప్రమాదం.బిజినెస్ మాగ్నెట్ కూతురికి తప్పిన అపాయం.చేనేత కార్మికుడికి స్వల్ప గాయాలు.చేతులు విరిగి పోయి ఆస్పత్రిలో చేరిన రామయ్యానే చేనేత కార్మికుడు"
ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక గది.
ఇందిర ఏడుస్తూ ఉంది. రామయ్య ముఖం దీనంగా ఉంది. మాట్లాడాలంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు.
పక్కనే చేతికి వేసిన బ్యాండేజీలను తాకుతున్న విద్య.
" యాం వెరీ సారీ! మాప్రయత్నం మేం చేశాం.కాస్త ముందుగా వచ్చి ఉండాల్సింది. చేతులు ఇక పని చేయవు. అయినా బాధ పడకండి.కృత్రిమమైనవి తయారు చేయవచ్చు" అన్నాడు డాక్టర్."ఎంతవుతుందండీ?"ఇందిర ప్రశ్న.
"లక్షన్నర అవ్వచ్చు .అంతే." డాక్టర్ వెళ్లి పోయాడు. తిరిగి చేతులు వస్తాయన్న ఆశ కూడా వెళ్ళి పోయింది.
"ఇక మీరు పనెలా చేస్తారండీ.మన జీవితాలు ఆగిపోయిట్లే . మన లాంటి  చేనేత వృత్తుల వారికి చేతులే కదా కావాలి.అన్నాయ్య కూడా చెపుతూనే ఉనాడు. అయినా, ఎవర్నో రక్షించబోయి మీరు వెళ్ళడమేమిటి? మళ్ళీ ఏడుస్తూ అంది ఇందిర.
"ఔను, మన జీవితాలు ఆగి పోయాయి." అని తల దించుకొన్నాడు రామయ్య.
"ఏమండీ, మీరు కాపాడింది పాపనేగా, ఎలోగోలా నేను అయ్యని అడీగి డబ్బులు తీస్కొస్తా.మనకి దారి లేదు" అని కాస్త తేరుకొని చెప్పింది ఇందిర.
అంతలోనే మోహన్ వచ్చారు. ప్రెస్ వాళ్ళతో .ఫోటోల వాళ్ళతో వచ్చి రామయ్య చేతిలో పూల బొకే పెట్టి ,స్మైల్ ఇచ్చి, ఫోటో దిగాడు.
 "రామయ్యా, చాలా థ్యాంక్స్.నా కూతుర్ని కాపాడావు." అన్నాడు మోహన్.
మొట్టమొదటిసారి అతను రామయ్యతో మాట్లాడాడు.
కలగజేసుకుంది ఇందిర.
"అయ్యా ,అయ్యా..ఆయన చేతులు పడిపోయాయట. చేతులు కదపలేడట. మీ పాపను రక్షించబోయే కదా,చేతులు పోగొట్టుకుంది .అయ్యా అయ్యా ! ఆపరేషన్ కి లక్షలౌతాయట!" అని మాట్లాడుతూ ఉండగానే,
" సరే సరే చేయించండి  .అన్నిటికంటే ప్రాణాలు ముఖ్యం. అవి దక్కాయి గా.మరీ చేతులు  కావాలనుకొంటే అలానే చేపియ్యండి. మరో  విషయం .త్వరగా చేయించకపోతే మరీ కష్టమౌద్ది. వీలున్నంత త్వరగా చేయించండమ్మాఓకే ," అంటూ వెళ్ళి పోయాడు.
ఆమె ఏమడుగుతందో తెలుసు .అందుకే ఇలాగ.
"మన జీవితాలు ఇంతేనా.మన గతి ఇంతేనా .నాకు చేతులు లేనప్పుడు నేను జీవించి అవసరం లేదు. మనకు అన్నం పెట్టే మగ్గం ఇప్పుడు పని లేకుండా పోతుంది. దేవుడా! ఇప్పుడెలా! లక్షన్నరట,ఎలా తేవాలి ? నేను చనిపోవడమే శరణ్యం," అంటూ ఆవేదన చెందాడు రామయ్య.
" డబ్బున్నోళ్ళతా అందరే.సిగ్గూ లజ్జా కోశానా లేదు.మనిషికి సాయం చేయాలన్న ఆలోచనా లేదు. ఆడి కూతురు సచ్చుంటే తెలిసొచ్చేది " అంటూ నిప్పులు చెరిగింది ఇందిర.
"పాపం.. పాపనేమీ  అనకు. వాడినీ వాడి డబ్బునీ ఏదో ఒక రోజు ప్రపంచమే ఛీ కొడ్తది.అప్పుడు వాడికి తెలిసొస్తది." అంటూ కోపంతో అన్నాడు రామయ్య.
"మనం మన జీవితాలు . ప్రపంచం గవర్నమెంటోళ్ళు మారితే తప్ప ,మన జీవితాలు బాగుపడవు.అయ్యో దేవుడా ," అంటూ  బాధ పడింది ఇందిర.
*
నిజమే ఇది. ఆలోచించి మార్పులు చేయకుంటే రామయ్య లాంటి వాళ్ళెందరో రాలిపోతారు.
*
ఎం .అశోక వర్ధన్,పదోతరగతి ,నవభారత్ పబ్లిక్ స్కూల్, పాల్వంచ
*
Prabhava,Books and Beyond ! * All rights reserved.

Wednesday, September 22, 2010

నేను ఉంటే

నేను ఉంటే..
.
చీకటిగా ఉంటుంది.
సూర్యుడు కనబడడు.
చలిగా ఉంటుంది.

స్నానం చేయ లేరు.
బట్టలు ఉతక లేరు.
మీ ఇల్లు నానుతుంది.

ఆవులను కట్టడానికి కష్టం.
గడ్డి వేయడానికి మరీ కష్టం.

 వంట చేయాలంటే కట్టెలుండవ్.
 బడికి రావాలంటే బట్టలుండవ్ 


నన్ను అందరూ తిట్టుకొంటారు.

నేను ఉంటే,

బజ్జీలు తింటాం.
మట్టితో బొమ్మలు చేస్తాం. 

బడిలో కథలు రాస్తాం.
ఆటలు ఆడుతూ తడుస్తాం.

పిల్లలకు జ్వరాలు వస్తాయి.
అమ్మానాన్నలకు కష్టాలు వస్తాయి.

నేను ఆకాశంలో ఉంటా.
నేను మబ్బుగా ఉంటా.

నా పేరే మోడం.

*
నేను ఉంటే,
వర్షం కురుస్తుంది.

*
వి.హరినాథ్, 4 వ తరగతి. హరితవనం,రిషీవ్యాలీ పల్లె బడి.
19-12-7
*
Prabhava,Books and Beyond ! * All rights reserved.

Tuesday, September 21, 2010

Count Up On!

Rabbits..Rabbits..One Two Three
Will you come and play with me?


Camels ...Camels ...Four  Five Six
Why do you have a hump like this ?


Monkeys...Monkeys..Seven Eight Nine
Come on ..Let's climb a grape wine.


When I counted up to Ten,
The Elephant said," Now..Start Again!"

*
S.Meghana ,
5th Class, Nellore 7-9-2010
*


Prabhava,Books and Beyond ! * All rights reserved.

Monday, September 20, 2010

మడతపేజీ


వాసిరెడ్డి నవీన్ గారు  అతిథులను అహుతులకు పరిచయం చేసి, వేదిక మీదికి ఆహ్వానించారు.

డా. మంజులత గారు  కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
.డా. మంజులత గారు  కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
డా.ఆనంద స్వరూప్ గారు పుస్తకాన్ని ఆవిష్కరించారు .
శ్రీమతి అబ్బురి చాయా దేవిగారు తొలిప్రతిని అందుకొన్నారు.
డా. ఆనంద స్వరూప్ గారు: మడతపేజీ నుంచి వ్యవసాయానికి సంబందించిన అంశాల్నుంచి 
నేను కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకొన్నాను.
డా. మంజులత గారు : చంద్ర లత ప్రకృతి గురించి చెప్పినా పిల్లల గురించి చెప్పినా   భాషా  శైలి, తనదైన ముద్ర ఉన్నది.వీటన్నిటిలోను స్వాభావికత పదిలం చేసుకోవాలని గట్టిగా చెపుతారు.
శ్రీమతి అబ్బూరి ఛాయ దేవి గారు: చంద్రలత ఎప్పుడు ఒక సరికొత్త అంశంతో మన ముందుకు వస్తుంది. ఈ మారు ఈ బ్లాగుటపాల సంకలనంతో.కొత్తగా బ్లాగులు రాయాలనుకొనే వారికి ఎలా రాయ వచ్చునో  దీనిని చదివి తెలుసుకోవచ్చు. క్లుప్తంగా,లోతుగా ,సామాజిక స్పృహతో రాసిన టపాలివి.
శ్రీమతి కొండవీటి సత్యవతి  గారు:  వర్షం పడినప్పుడు ఆ అనుభవాన్ని పంచుకోవాలనుకొని రాసాం అనుకోండి ఎవరు ప్రచురిస్తారు ? బ్లాగుల్లో మనకు  నచ్చినవి రాసుకొని నలుగురితో పంచుకొనే స్వేఛ్ఛ ఉంది.   
వీవెన్ గారు: బ్లాగు సంకలనాలతో ఒక పుస్తకం రావడం  ఇదే మొదలు . 
మడత పేజీ పుస్తకం , e- ప్రపంచానికి సాహిత్య ప్రపంచానికి ఒక లంకె అవుతుందనుకొంటాను.




Prabhava,Books and Beyond ! * All rights reserved.

Friday, September 17, 2010

A Naughty Ant !

నిన్న మేమంతా మా పాటికి మేం ఏదో మాట్లాడుకొంటూ ఉంటే,
మెల్లి గా మా వెనక చేరి, ఇదుగోండి..
ఇలా బోర్డంతా రాసేసి గీసేసి ..ఆ పై ఒక కాపీ రైట్ ముద్ర కూడా వేసేసింది .. 
చిన్నారి గడుగ్గాయి . డి .ప్రతీక !
ఇంకెక్కడా?
ప్రభవలోనే !
మీ మీ ఇంటి గోడల మీదా పిల్లలు ఇలాంటి గోడ కవిత్వాలేమైనా రాస్తున్నారేమో చూడండి.
మాకూ చూపించండి.
మేం ఎదురు చూస్తూ ఉంటామండోయ్!
*
I am  a naughty ant.
I will bite a girl.

Her mother will scold me.
I will bite her too.

The girl's father will scold me.
I will bite him too!

*

D.Pratheeka , 
Prabhava, 16 -9-10

*
Prabhava,Books and Beyond ! * All rights reserved.

Thursday, September 16, 2010

ఒక పుస్తకావిష్కరణ.ఒక సమాలోచన.

పొద్దున్నే లేవాలంటే ఎవరికైనా  బద్దకం గానే ఉంటుంది.
అందులోను ఆదివారం ఆ పై వానాకాలం.
హాయిగా కాసేపు ముసుగుపెట్టాలని ఎందుకనిపించదు?
వారం రోజుల పాటు ఉరుకులు పరుగులు.
వారాంతం .
ఏదో నచ్చినట్లు నడుచుకోవాలని అందరం అనుకొంటాం.

ఎవరైనా పిలిచి పాఠం చెపుతానంటే, "అబ్బా ఆదివారం కూడానా !" అని అనుకోకుండా  ఉండగలమా ?
 మీరే చెప్పండి!
అయితే, సోదరీసోదరీమణులారా..

 మీ వారాంతపు తీరుబడిని మాక్కొంచం  ఇప్పించండి.స్నేహపూర్వకంగా...!
ఒక ఆత్మీయ సమావేశం. మరి కొంత సమాలోచన.ఒక పుస్తకావిష్కరణ.
రచయితలమూ బ్లాగు -రచయితలము కలిసి కాసేపు కబుర్లాడుకొని ...
మళ్ళీ మన ఆదివారం ప్రణాళికల్లోకి మనం !
ఎప్పటిలాగానే!

మీ పిల్లలని  వెంట బెట్టుకొని రండి. వారికి ఈ-తెలుగు ను పరిచయం చేయడానికి , వీవెన్ గారు మరికొందరు e-తెలుగు మిత్రులు మనతో నాలుగు ముక్కలు పంచుకోవడానికి ..వస్తున్నారు.
 వీలైయితే, మీ సమస్యలనూ,సందేహాలనూ ...
మీ ల్యాప్ టాప్లనూ పట్టుకు రండి.
మాష్టార్లు ప్రయివేట్లు చెప్పేస్తారుట!


వివరాలు...ఇక్కడ.

సమాలోచన

డా. గద్దె  ఆనంద్ స్వరూప్ గారు ,
గణిత శాస్త్రజ్ఞులు ,బ్లాగురచయితబ్లాగ్మిత్రులు,
మెల్ బోర్న్ ,ఆస్ట్రేలియా
డాఆవుల మంజు లత ,
 పూర్వ ఉపాధ్యక్షులు ,తెలుగు విశ్వవిద్యాలయం
 శ్రీమతి  కొండవీటి సత్యవతి గారు
మా గోదావరి”,బ్లాగు రచయిత,సంపాదకులు ,భూమిక.
 శ్రీ వీవెన్ గారు,
             లేఖిని రూపశిల్పికూడలి నిర్వాహకులు,e-తెలుగు స్థాపక సభ్యులు.

                                        అందరికీ ఆహ్వానం.
                                 ప్రత్యేక కార్యక్రమం
శ్రీ వీవెన్ గారు  తెలుగును తెరకెక్కించడంలోని 
మెళుకువలను ,ఉపకరణాలను , బ్లాగు నిర్వహణను
ఇతరేతర e- తెలుగు సమాచారాన్ని అందిస్తారు
మరికొందరు  తెలుగు మిత్రులతో పాటు.
మీ  సాంకేతిక పరమైన సందేహాలు,సంశయాలను వారు వివరణలు ఇస్తారు.
మరి మీరు వచ్చేటప్పుడు వీలైనన్ని ప్రశ్నలను వెంటపెట్టుకు రండి ! 
మర్చిపోకుండా!
మీ ప్రశ్నలను ముందుగానే 
 prabhava.books @ gmail.com  కు పంపగలిగితే మరీ మంచిది.
సమయం:


19 సెప్టెంబర్,ఆది వారం
ఉదయం 10:00 గంటల నుంచి 
స్థలం:
సుందరయ్య విజ్ఞాన కేంద్రం(మిని హాలు) ,బాగ్ లింగంపల్లి  , హైదరాబాద్
ఫోన్ :27667543


 Note: Prabhava offers a very handsome discounts on all PRABHAVA PRACHURANALU on this ocassion. Catch a book ,if you can !


*
Prabhava,Books and Beyond ! * All rights reserved.

Sunday, September 12, 2010

ఎలాగో,ఆ రాత్రి !

 ఒక రోజు ఉదయం .
వాతావరణం చలిగా ఉంది.
మంచు వర్షంలా పడుతున్నది.
అంతకు ముందు రోజు మా స్కూలు ఉపాధ్యాయులు మరుసటి రోజు ఒక పెద్ద అడవికి పరిశోధనకు వెళ్ళాలనీ నిర్ణయించుకొన్నారు.
అందువలన,
 ఆ రోజు ఉదయం నేను లేచేసరికి ,టైం 6 గంటలు అవుతోంది.నేను త్వరగా , రెడీ అయ్యి స్కూల్ కు వెళ్ళే సరికి , నా స్నేహితులు అందరూ వచ్చేశారు.మేము వెళ్ళే బస్సు పది గంటలకు వస్తుంది.
మేమందరం చాలా ఆనందంగా ఉన్నాం. కానీ, చాలా చలిగా ఉన్నది.
మా పాఠశాల అంతా హడావుడిగా ఉన్నది. అక్కడ తోటలో ఉన్న పూలు కూడా చలికి విచ్చుకోలేదు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా వచ్చారు.
అందరు వారికి కావలిసిన అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలను సమకూర్చుకొని ,ఎంతో ఆత్రుత తో బస్సు   కోసం వేచి ఉన్నారు.
బస్సు వచ్చింది. అందరు వెళ్ళి బస్సులో కూర్చున్నారు.
బస్సులో అందరు జోక్స్ వేస్తూ,అడవికి వెళ్ళే మార్గం గురించి మాట్లాడు కొంటూ ,పాటలు పాడు కొంటూ సరదాగా వెళ్ళాము. ఇక , అడవిలో ప్రవేశానికి కొంత దూరంలో బస్సు ఆగింది.
అక్కడి నుంచి  నడిచి వెళ్ళాలి.
అందరూ ఆ అడవిలో గల పచ్చని చెట్లు ,చల్లని గాలి ,ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అనుభవిస్తూ ,పరిశోధనలు జరుపుతున్నారు.
అలా వెళుతుంటే, అక్కడ ఒక పెద్ద జలపాతం కనిపించింది.అక్కడ, పైనుంచి దూకే నీరు ,ప్రక్కన ఉన్న పూలు అందరినీ ఆకర్షించాయి.
అలా వెళుతుండగా,నేను పక్షులను చూసుకొంటూ ,నా దగ్గర ఉన్న బ్యాగుతో సహా నడుచుకొంటూ ,నాకు తెలియకుండానే ఒక దీవిలోకి వెళ్ళి పోయాను.
అప్పుడు నాకు చాలా భయమేసింది.
నా బ్యాగులో ఉన్న మూడు వస్తువులను ఒకసారి తడిమి చూసుకొన్నాను. అవి కత్తి,లైట్,బట్టలు.
నాకు బాగా ఆకలి వేస్తుంటే , ఏమైనా దొరుకుతున్నదా అని వెతుకుతూ పోయాను.
అక్కడ ఉన్న చెట్లో పండ్లు కనిపించాయి. ఉన్న కత్తితో ఆ పండును కోసి తిన్నాను. 
అలాగే, ముందుకు వెళుతుండగా ,అంతా నిశ్శబ్దంగా ఉన్నది.సూర్యాస్తమయం అయింది.చీకటిగా ఉన్నది.నక్క కూతలు వినబడ్డాయి.పువ్వులు సువాసనలు వెదజల్లాయి.
ఆ చీకటిలో నా దగ్గర ఉన్న లైట్ తీసుకొని ,ఒక రాయి మీద కూర్చున్నాను. ఎలాగో,ఆ రాత్రి గడిచింది.సూర్యుడు ఉదయించాడు.పక్షులు కిలకిలలాడాయి.
నాకు అప్పుడు ఒక ఆలోచన వచ్చింది.
దిక్సూచిని తయారు చేసుకొన్నాను.దాని సాయంతో ఆ దీవిని దాటాను. అప్పుడు నా స్నేహితులు నన్ను  వెతుకుతూ వచ్చారు.
అందరినీ కలిసి ఇంటికి వెళ్ళిపోయాను.


*
రచన : పి.అశ్విని ,పదవ తరగతితెట్టు. 22-8-2010
బొమ్మ:  సుమన్విత ,గ్రీష్మ ప్రభవ,  2010, నెల్లూరు



Prabhava,Books and Beyond ! * All rights reserved.

Saturday, September 11, 2010

చిన్ని నా బొజ్జకు


చిట్టి గణపతి.

గట్టి గణపతి.
మట్టి గణపతి.

పువ్వు కాయ
పసుపు కుంకుమ.

మా బొజ్జ గణపతికి

పలుమార్లు జేజేలు.
పదహారు గుంజిళ్ళు.

చిన్ని నా బొజ్జకు
కుడుములు ఉండ్రాళ్ళు !

 వినాయక చవితి శుభాకాంక్షలు !

       .




Prabhava,Books and Beyond ! * All rights reserved.

Thursday, September 9, 2010

ఏమనుకొంటే అది

బాలోత్సవ్ -2009 కథ రచనలో ,
జూనియర్ల విభాగంలో  ప్రోత్సాహక   బహుమతి గెలుచుకొన్న
చాందిని థ.




 ఏమనుకొంటే అది 

అనగనగా ఒక రైతు. రైతు కి ఒక కూతురు ఉంది
అతడు మగ పిల్లవాడు కావాలని కోరుకున్నాడు. కానీ, రైతుకి ఆడబిడ్డ పుట్టిందని అసహ్యం. ఆమెను అతను ముట్టుకోను కూడా ముట్టుకోలేదు
ఆమె పేరు లక్ష్మి అని వాళ్ళ అమ్మ పెట్టింది.ఆమె రోజు బడికి వెళ్ళేది.వాళ్ళ అమ్మానాన్నలు పొలములోకి వెళ్ళే వారు.ఆమె అంటే వాళ్ళ ఊళ్ళో వాళ్ళకి కూడా ఇష్టం లేదు.
ఆమె చక్కటి పుత్తడిబొమ్మ. ఆమె తరగతిలో ఎప్పుడూ ముందుడేది.కాని ఆమె ఎవ్వరికీ ఇష్టం లేదు.
ఆమె రోజు కుంగిపోయేది.
ఆమె ఒక రోజు బాగా ఎండకొడుతుందని ఒక చెట్టుకిందికి వచ్చింది. చెట్టు కూడా ఆమెను మెచ్చడం లేదు. అప్పుడు ఆమె ఒక దేవత  ప్రత్యక్షమైంది.  దేవత తనకు వరం కావాలో కోరుకోమంది.
ఆమె ఎవరికీ లేని ఒక అద్బుత శక్తి అది ఎవరికీ లేనిది 'నేను ఏమనుకొంటే అది జరగాలనీ "కోరుకుంది
దేవత ఆమె కోరిన వరాన్ని ఇచ్చి అదృశ్యమైంది
శక్తితో తనకేమి చేయాలో తెలియడం లేదు. 
ఏడాది వానలు పడడం ఆగిపోయింది.అప్పుడు వాళ్ళ పొలం అప్పుడు వాళ్ళ పొలం , ఊళ్ళో వాళ్ళ పొలాలు అన్నీ ఎండి పోయాయి.
అప్పుడే అమ్మాయికి ఆలోచన తట్టింది.
"నన్ను ఎలాగో అందరూ తిట్టుకుంటున్నారు.నేను పాఠాల్లో చదువుకొనే దేమిటీ ?ఉపకారికి అపకారం చేయరాదు .చేసినచో వారికి మళ్ళీ ఉపకారం చేయవలెను కానీ అపకారం చేయరాదు.వాళ్ళు నన్ను మెచ్చుకొంటారు కావచ్చని, ఆమె తన కున్న శక్తితో ,వర్షాలు  కురిపించింది.
తరువాత ఊళ్ళో వాళ్ళందరి పంటలు పండాయి .
విషయం తెలిసిన తరువాత , అమ్మాయిని అందరు మెచ్చుకొన్నారు.
*
  రచన : బి. చాందిని,  7 వ తరగతి,,కాశీ బుగ్గ, వరంగల్ .
 బొమ్మ : క్షితిజ , 1వ తరగతి ,,గ్రీష్మప్రభవ -2010, నెల్లూరు.


Prabhava,Books and Beyond ! * All rights reserved.