టి. శ్రావణి. 8 వ తరగతి
ప్రభవ పిల్లల పండుగ సందర్భం గా నిర్వహించిన ,
పిల్లలకు జే జే -2008 రచన లో సీనియర్ విభాగం లో ద్వితీయ బహుమతి రచన .
***
నేను ఇప్పుడు రాయదలిచినది బాధ కలిగించే విషయం.
అంటే ,
మా ఇంటి ప్రక్కన ఉండే ఒక అతను తాగి వచ్చి ,
తన భార్యను కొట్టే వాడు .
ఆమె పిల్లల చదువు కోసం దాచుకొన్న డబ్బును తీసుకొని కూడా తాగేవాడు.
ప్రతిరోజూ ఆమెను హింసలు పెట్టే వాడు.
అలా ఆయన తాగి తాగి,ఒక రోజు మరణించాడు.
ఇప్పుడు ఆమె భర్త చని పోయినందుకు బాధపడాలో ,లేక అతను పెట్టే హింసలు తగ్గాయని ఆనంద పడాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.
ఆ స్థానం లో మీరే కనుక ఉన్నట్లయితే ఎలా ఊహిస్తారో నాకు తెలియదు.వాళ్ళ అమ్మ చదువుకొంది కాబట్టి ,
మంచి ఉద్యోగం చేస్తూ ,పిల్లలను బాగా చదివించుకొనే స్థాయి ఏర్పడింది. కానీ ,పిల్లలను చదువుకోమంటే వాళ్ళు సహకరించడం లేదు. ఎప్పుడు చూసినా క్లాసులకు వెళ్ళ కుండా వీధుల వెంట తిరిగే వారు.
ఒక రోజు వాళ్ళమ్మ రిపోర్టులు చూడడంతో ,వాళ్ళు ఏ మాత్రం చదువుతున్నారో అర్ధమైంది.
అప్పటినుండి వాళ్ళ అమ్మ జాగ్రత్త తీసుకోవడంతో వాళ్ళు చక్కగా చదువుతున్నారు.
మొదట బాధ కలిగించినా చివరకు ఆనందమే లబిస్తుంది.
ప్రభవ పిల్లల పండుగ సందర్భం గా నిర్వహించిన ,
పిల్లలకు జే జే -2008 కథారచన లో సీనియర్ విభాగం లో ద్వితీయ బహుమతి..
9-11-2008
Prabhava,Books and Beyond ! * All rights reserved.
1 comment:
chala baga rasimdi... ammayi evaro... gud
Post a Comment