ప్రభవ పిల్లల పండుగ సందర్భం గా నిర్వహించిన ,
పిల్లలకు జే జే -2008 రచన , సబ్ జూనియర్స్ ,ద్వితీయ బహుమతి.
*
నాకు గనుక అద్బుత శక్తి వస్తే,
నేను ప్రజలను కాపాడుతాను.
నా మీదికి దాడి చేయడానికి వచ్చిన వారిని ఎదిరించి ఫైట్ చేస్తాను.
చంద్రమండలంలోకి వెళ్తాను.సూర్యును వద్దకు వెళతాను.మేఘాలపై నడుస్తాను. గాలిలో సాహసాలు చేస్తాను.నక్షత్రాల వద్దకు వెళతాను.
మనిషిని బొమ్మలా మారుస్తాను.పొదల్లో ఉన్న కుందేలును ఏనుగులా మారుస్తాను.ఏనుగును జింకలా మారుస్తాను.
అడివిని చెరువులా మారుస్తాను.గడ్డిని పాములా మారుస్తాను. నా శక్తితో సింహాన్ని చీలుస్తాను.
సింహంతో ఆడుకొంటాను.
ఆహార పదార్ధాలను వజ్రాలుగామారుస్తాను.పండ్లను పువ్వులుగా మారుస్తాను.
నాకు దగ్గరలో నదిలో పడిఉన్న పాపకు ప్రథమ చికిత్స చేసి కాపాడతాను.
నా అద్బుత శక్తితో ఇతరులకు సహాయం చేస్తాను.
డి.విజయ చంద్రిక , 4 వ తరగతి. సబ్ జూనియర్స్ ,ద్వితీయ బహుమతి.
9-11-2008
Prabhava,Books and Beyond ! * All rights reserved.
No comments:
Post a Comment