*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Sunday, September 18, 2016

వాళ్ళు... వీళ్ళు.. పారిజాతాలు.

"మానవజీవితం మనిషి శ్రద్ధగా మలుచుకున్న నవల లాంటిది కాదూ? " అని అంటారు ,జోస్ ఒర్తేగా గాసెట్,
ఒకానొక సందర్భంలో !

నవల కు జీవితానికి ఉన్న ఆ అవినాభావ సంబంధం అనిర్వచనీయమైనదీ. అపురూపమైనదీ.
మానవ జీవితంలోని సున్నితపార్శ్వాన్ని ,మరింత సున్నితంగా సునిశితంగా చంద్రలత అక్షరబద్దం చేసే క్రమంలో పరిమళించినవే ఈ "వాళ్ళు... వీళ్ళు.. పారిజాతాలు."
 ఈ శనివారం, 24 వ తేదీన , పుస్తకరూపంలో  ఈ నవలను ప్రభవ మీకు అందించబోతున్నది.

స్థలం :    ఫ్రభవ.పొగతోట, నెల్లూరు
సమయం : 24 సెప్టెంబరు, సాయంకాలం ,6 గంటలనుండి.
నవల ఆవిష్కరణ : శ్రీ Ch.సంజీవ రావు గారు
నవల కబుర్లు చెప్పేవారు,:  ఆర్. ఎం. ఉమా మహేశ్వర రావు గారు,కాట్రగడ్డ దయానంద్ గారు,   వి.ప్రతిమ గారు ,విష్ణు ప్రియ గారు.
, మరికొందరు.
మీ వంతు మీరు మీ దోసిళ్ళనిండా
పారిజాతాలు  నింపుకు పోదురు ,
వచ్చేయండి మరి.


మరిన్ని వివరాలకు :
శ్రీ ఈతకోట సుబ్బారావు గారు ,9440529785
ఫ్రభవ :(0861) 2333767 /2337375 prabhavabadi@gmail.com

***

Prabhava,Books and Beyond ! * All rights reserved.

Thursday, April 7, 2016

ప్రభవ కళాకాంతిపూవులు గీసాం. 
రంగులు వేసాం. 
మరి, మీరు వచ్చి చూస్తే బోలెడంత సంతోషిస్తాం ! 
ప్రభవ కళాకాంతి
పిల్లల చిత్రకళాప్రదర్షన , 
ఈ ఆదివారం నుండి.
తప్పక రండి. 


Prabhava,Books and Beyond ! * All rights reserved.

Sunday, October 18, 2015

"పిల్లవాండ్లకు చాలు.."


"దశరా పండగొస్తుందంటే చాలు.
మా కిష్టప్పపంతులు ,ఆయన వెనకే మా పిల్లల రామదండూతయారు.
సన్నటి కర్రొనొక దానిని బాగా వంచేసి పురికొసతో  చివర చివర ముడేస్తే చాలు విల్లు తయారుఇక బాణాలకు ఏం కొదువ?అన్ని పుల్లలూ చివర్లు చెక్కి సిద్ధం చేసేసుకోవడమే.
తలా ఒక విల్లంబు చేతికి చిక్కినన్ని బాణాలు పట్టుకొని .. పైపంచో కండువానో వల్లె వేసుకొని జోలె కట్టుకొని ఊరంతాతిరుగుతూ... ఒక్కో గడపా ఎక్కీ దిగుతుంటే చూడాలి పిల్లలసరదా.
గొంతు చించుకొని "అయ్య వారికి చాలు అయిదు వరహాలు...పిల్లవాండ్లకు చాలు పప్పుబెల్లాలు " 
అంటూ పాడుతుంటేనే........."

http://chandralata.blogspot.in/2009/09/blog-post_24.htmlPrabhava,Books and Beyond ! * All rights reserved.