*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Saturday, January 29, 2011

పదిలం పదిలం !

ఇక్కడ బుజ్జి బాబు పక్కనున్నది ఎవరో మీరు గుర్తు పట్టేసారు కదా?

ఊహు లేదూ?

పోనీ, ఈ చిట్టి పాప చేతికి పూలతో బాటు కుండీ ని అందిస్తోందే తనెవరో గుర్తు పట్టేసే ఉంటారు!
ఇంకా తెలియదా?




మరి, మన మైఖేలు మామయ్య  పసినవ్వులు నవ్వుతున్నాడేమిటిక్కడ! 
నేనైయితేనా, ఇలాంటి వారెవరయినా ఎదురయితే గజ గజ వణికి గజం దూరం గెంతుదును!
ఈయన గారేమో ఏకంగా భుజాన చెయ్యేసుకొని మరీ ఫోటో దిగేసాడు!



మీకు ఇక్కడున్నదెవరో తెలిసిపోయిందిలే!
ET!

అవునండీ  ET గారే!
స్ప్లీల్ బర్గ్ సినిమాసిత్రం.

మనమంతా పిల్లలుగా చూసి తెగ ఆనందిచేసాం. 
మన పిల్లలేమో ..ఇలా జాదూతో దాగుడు మూతలు ఆడారు.


     మరి ఇక్కడెవరున్నారో ఒక్కసారి చూడండి!
అచ్చం ET లాగానే ఉన్నదే!
ET  లేదా అంతరిక్ష జీవి కి చెల్లెలా తమ్ముడా  లేక మేనల్లుడా?


అవేవీ కాదండి.
నన్నే ఫోటో తీస్తు న్నారన్నట్లు ,
ఇక్కడ నిక్కి నిక్కి చూస్తున్నది ,మన  చిన్ని ఆస్ట్రిచ్ గారు.



మరి , అమ్మలూ నాన్నలూ ..
మీరు మీ పిల్లలతో కలిసి మొదట ET సినిమా చూడబోతున్నారా?
ఆస్ట్రిచ్ గారి కుటుంబాన్ని పలకరించి రావడానికి వెళుతున్నారా?


ప్రణవ్ రాసిన చిన్ని కథ గుర్తుంది కదా?

ప్రకృతి పదిలంగా ఉంటే మనం పదిలం.
పదికాలాల పాటు మన కళాకాంతులూ పదిలం!

Friday, January 28, 2011

ముట్టుకొంటే బంగారం


ఒక ఊరిలో ఒక రాజు ఉండే వాడు.
ఆ రాజు కొడుకు చాలా పెద్దవాడు.
ఆ రాజు కొడుకు రాజుతో ఒక కోరిక కోరాడు.
అది ఏమిటంటే ,"నేను ఏది ముట్టుకొంటే అది బంగారం అయిపోవాలి"అని.
"అలాగే" అన్నాడు రాజు.

అట్లే ,రాజు అతని మంత్రులు వారి దగ్గరికి పోయి మాంత్రికునితో ఇలా మాట్లాడారు.
ఆ మంత్రాల వాడు అలాగే అన్నాడు.
"నీ కొడుకు ఏది ముట్టుకొంటే అది బంగారం అవుతుంది! "అన్నాడు మాంత్రికుడు.

మొదటిసారిగా రాజు గారి ఇల్లు ముట్టుకొన్నాడు.
రాజుగారి ఇల్లు మొత్తం బంగారం  అయిపోయింది.
అట్లే రాజుకొడుకు గ్రామం గ్రామం అంతా బంగారు ఇళ్ళగా మార్చేసాడు.

 ఒక రోజు రాజు కొడుకు ఒక్కడే, రాజు నడిగి చేను దగ్గరికి వెళ్ళాడు.
చేను దగ్గరికి పోతుంటే వానిని దొంగలు నరికేసారు.
రాజు చాలా బాధ పడూతున్నాడు.
*
"అత్యాశకు పోతే నిరాశ మిగులుతుంది"
*
యం . ఆదేశ్ ,6 వ తరగతి. విద్యావనం, రిషీవ్యాలీ పల్లెబడి.
2006




Prabhava,Books and Beyond ! * All rights reserved.

Wednesday, January 26, 2011

ఎలుక మాట


'ఎలుకా! ఎలుకా!ఎలుకా!


నీవు కీచు కీచు మంటవ్ ఎలుకా!


నీవు కూరగాయలు తింటవ్ ఎలుకా!


నన్ను ఏమంటవ్ ఎలుకా?"



"నిన్ను తినివేస్తా" అన్నది ఎలుక 



అప్పుడు పారిపోయా కిమ్మనక !


మరో మాట మాట్లాడక!
*

యం.గోపి ,
5 వ తరగతి.
విద్యావనం ,రిషీవ్యాలీ పల్లె బడి.2006



Prabhava,Books and Beyond ! * All rights reserved.

Friday, January 14, 2011

To Live Forever

ప్రభవ పిల్లలలకు జేజే ,కథారచనలో ప్రథమ బహుమతి పొందిన ప్రణవ్ కథ  సంక్రాంతి ప్రత్యేక ప్రచురణ .
 మీరు మీ కుటుంబం, మీ బంధుమిత్రులు సంతోషంగా సంక్రాంతి  గడపాలని కోరుతూ ....ప్రణవ్ కు అభినందనలతో. To Live Forever
అన్నట్లు , ప్రణవ్ రాసిన చిన్ని కవితనూ మీరు లోగడ చదివారు. 
మరో మారు ఇక్కడ చదవండి.
http://prabhavabooks.blogspot.com/2010/11/dont-want-to-miss.html

*
To Live Forever









I am an Ostrich .
My name is Pranav.
We are last Ostrich family living on this Earth.
We were worried that we'll be vanished soon.
I might miss my family.
In order to make my family live forever ,I've to find a way.










I have decided to go to my tree friend for a suggestion.

My mother told me to be careful and come with victory.
I told my mother not to worry about me .I went to the place where my friend was living.
I asked him to do something to make my family and me live forever.
He told me to do the Meenu Mountains and get the “Forever Drink “
My tree friend said,“Who ever drinks it,  will live forever.But, you have to make two voyages which are challenging and dangerous. I know you brave and strong. But, I will give you two magic fruits that can help you “
I too the magic fruits and thanked my friend . I started my journey.

Humans say I am the fasted bird known to them.
                                                  I am fast.I could reach the place very quickly.

But, till some distance ,
I could see nothing but firestones on the path.
Then ,I remembered the magic fruits that my treefriend gave me.
I ate the first fruit.
I was amazed that I was flying . 
Suddenly , I dropped down. 
I recalled my treefriend’s words. That magic will work only upto a certain limit.
Then , I ran as fast as I could. I couldnot go beyond the river.
The upland began . It was very steep and high.I ate the second fruit that my friend gave .


I am surprised to find my self jumping high .


I was amazed that I was flying . Suddenly , I dropped down. I recalled my treefriend’s words. That magic will work only upto a certain limit.
Then , I ran as fast as I could. I couldnot go beyond the river.The upland began . It was very steep and high.I ate the second fruit that my friend gave .
I am surprised to find my self jumping high .What a wonder, an Ostrich flying, atlast ! I landed on the top of the cliff. I was tired. I rested for a while .I continued my journey. Soon I reached Meenu Mountains and took the  pot of “Forever Drink” and returned to my family. 

I shared my experiences  and the drink with everyone . My mother said,” How wonderful it would be if your good friend lives with us?”
I invited my friend to our home and shared “Forever Drink “


He now lives with us along  his family, children , grand children and great grand children.
His relatives and friends also joined us .He gives magic fruits to any one who meets him.
And, we all lived happily ever after.


***
D.Pranav Reddy
6th class,Discovery , Gomathy School, Nellore




Prabhava,Books and Beyond ! * All rights reserved.

Wednesday, January 12, 2011

మీకు చెపుతున్నా వినవే

అమ్మా మీకు చెపుతున్నా వినవే అమ్మా
నాన్నా మీకు దండం పెడతా వినవా నాన్నా                                          "2"

నా తోటి వాళ్ళందరూ   "ఓహో"
బడికి వెళ్తుంటే    "ఆహా"

నాకు కూడా వెళ్ళాలనిపిస్తుంది ఓ నాన్నా
నన్ను కూడా బడికి పంపించవే ఓ అమ్మా

చదువు వల్ల "ఓహో "
ఉపయోగం ఉంది "ఆహా"                                                                            "2"
చదువు వల్ల ఉపయోగం ఉంది అమ్మో నా యమ్మా
దాన్ని మనం ఊయోగించుకొందామే అమ్మా                                           "2"     "అమ్మా"

ఊరి ప్రయాణం "ఓహో"
అవుతూ ఉంటే "ఆహా"
ఊరి ప్రయాణం అవుతూ ఉంటే ఓ నాయమ్మా
బస్సు బోర్డు చదవడానికి ఉపయోగపడూతుంది  అమ్మో నాయమ్మా              "2"  " అమ్మా"

చదువులేని వాళ్ళు "ఒహో"
ఆరిన దీపం వంటివారు "అహా"
చదువు లేనివాళ్ళు ఆరిన దీపం వంటి వారమ్మా
ఆ దీపాన్ని నేను కాపాడుకొంటానే "అమ్మో "నా యమ్మా                                   2" అమ్మా"

పత్తి డబ్బులొచ్చినప్పుడు "ఓహో"
ఎంత లాభం వచ్చిందని "అహా"                    "2"
ఇతరులను అడగడం ఎందుకే అమ్మో నాయమ్మా                                           "2" "అమ్మ"

అదే  నేను "ఒహో"
చదువుకొని ఉంటే "అహా"
ఇతరులను అడగడం ఎందుకే అమ్మా ఓ నాయమ్మో                                        "2" " అమ్మా"

అదే నేను "ఓహో"
చదువుకొని ఉంటే "అహా"
అదే నేను చదువుకొని ఉంటే ఓ నాయమ్మా
వాళ్ళను వీళ్ళను అడక్కరలేదే అమ్మో నాయమ్మో                                           "2" "అమ్మా"

నేను మంచిగా చదివి "ఓహో "  ఒక  ఉద్యోగం తెస్తే   "అహా "                                 "2"" అమ్మా"
నేను మంచిగా చదివి ఉద్యోగం తెస్తే ఓ నా యమ్మా
మన కష్టాలన్నీ తీరుతాయో అమ్మో నాయమ్మో                                               "2"

***

"గిరిజ , ప్రత్యేక వార్షిక సంచిక " నుంచి.
*
జె.శారద , 1st year MPC ప్రభుత్వ జూనియర్ కళాశాల ,కారేపల్లి ,ఖమ్మం జిల్లా.
*
Prabhava,Books and Beyond ! * All rights reserved.

Monday, January 10, 2011

అనగనగా ఓ ఫ్రెండిడ్లీ

నా పేరు ఇడ్లీ.
నా అమ్మ ఇడ్లమ్మ.నాన్న డాడి
డ్లి.

మేము పొద్దున్నే అందరి నోరు ఊరించేస్తాం.
మమ్మల్ని హోటల్లో వారు పెద్దగాచేస్తే ,ఇంట్లో వారు మెత్తగా చేస్తారు.
నేను మొదట్లో నీళ్ళ నీళ్ళగా ఉంటాను. తరువాత ,నన్ను ఇడ్లీకుక్కరులో పెట్టేస్తే ,తెల్లగా మెత్తగా అయ్యి బయటికి వస్తాను.
 నాకు ప్రత్యేకమైన శత్రువులంటూ ఎవరూ లేరు. 
కానీ, కొంతమంది మనుషులు ఎవరయితే నన్ను ఇష్టపడరో  వారు, మల్లె పూవులా ఉన్న నన్ను కాకి పిల్లలా చేసేసి ,నన్ను చెత్త కుండీలో వేసేసి , నన్ను ఊపిరి పీల్చుకోన్నివాకుండాచేస్తారో , వారే నా శతృవులు.

నాకు చాలా మంది మిత్రులు ఉన్నారు. వారిలో కొంతమంది వడ, చట్నీ , సాంబారు.హోటల్లో వారు ఇడ్లీతో వడలేకుండా ఇవ్వరు.సరే,ఒక వేళ ఏ చిన్న హోటలో ఇచ్చిందనుకోండి ,సాంబారు చట్నీ ని మాత్రం ఇస్తారుగా.
అప్పుడు నకు ఏమీ భయం ఉండదు. మేము వాళ్ళ కడుపుల్లోకి వెళ్ళి దాగుడు మూతలాడుకొంటాం.


ఒక రోజు నన్ను వడ "అమ్మ చేసుకొందామా ?" అని అడిగాడు.
అప్పుడు నేను మా ఆమానాన్నలు ఇడ్లమ్మ డాడిడ్లీలను అడిగి చెప్తాలెమ్మన్నాను.
 వాళ్ళు," నువ్వు ఇంకా చిన్న వయసులో ఉన్నావు .అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు" అన్నారు.
"సరే"అన్నాను.
 వెళ్ళి ఈ విషయం వడతో చెప్పాను. తను మొదట్లో బాధపడ్డా ,తరువాత వారు చెప్పింది కూడా కరెక్టేగా అనుకొన్నాడు.

నాకు ఇంకో మంచి ఫ్రెండ్ ఉన్నాడు. వాడు ఎవరో తెలుసా?
వాడే ఫ్రెండిడ్లీ .
వాడు నేను ఎక్కువగా కలుసుకోము. ఎందుకంటే వాడు  శని గ్రహంలో ఉంటాడు.
ఇక, వాడు వచ్చినప్పుడు చాక్లెట్లు బిస్కట్ట్లు బోలెడన్ని తెస్తాడు. వాడు శని బేకరీలో చేసే కేకు కూడా తెస్తాడు.
నా చేతిలో చాకు చూడగానే , కేకు నన్ను పొడవద్దు అని ఏడుస్తుంది.
కానీ, దాన్ని రుచిచూడాలన్న నా ఆరాటం చూసి,"సరేలే ,నన్ను తినేయి . నన్ను మళ్ళీ శని బేకరీలో తయారు చేస్తారులే" అని అంటుంది.
నేను కడుపుబ్బే దాకా తినేసి ,ఒక కునుకేసుకొని ,మళ్ళీ లేస్తాను!
*

శ్రీశాంత్, 8 తరగతి "బి".  త్రిశూల్ ,రిషీవ్యాలీ. 


Prabhava,Books and Beyond ! * All rights reserved.

Friday, January 7, 2011

ఇలా క్కూడా

అచ్చమైన పల్లెటూరు. 
పిల్లలకేమో ఇంగ్లీషు నేర్పాలి. 
తెలుగెలా నేర్పడమబ్బా ..అని తెలుగు టీచరుగారే  ఆ బడిలో తికమక పడుతుంటే ఇక ఇంగ్లీషు ఉపాధ్యాయుల సంగతి అడగండి!
అప్పుడు అక్కడ అక్క ,సారు ఒక చిన్న ప్రయత్నం చేశారు.
ఏం చేశారో చూడండి.
అయితే ,ఇలా క్కూడా భాషను నేర్పచ్చన్న మాట!
*

ఒక ఊరిలో ఓ Dog ఉండేది.దానికి ఒక puppy ఉండేది.
ఒక రోజు Cat  puppy ని కొడుతుంటే ,
 dog వచ్చి cat  ని తరుముకొంటూ వెళ్ళింది.
ఆ Cat దాక్కొనేసింది.
Rat వస్తూ ఉంటే ,  cat ...rat ని చూసి ,
తరుముకొని వెళ్ళి, నీళ్ళల్లో పడి పోయింది.

అప్పుడు  Cat కి ఊపిరాడక చనిపోయింది.
Rat,Dog,Puppy ..happy గా ఉన్నారు.

*
పర్వీన్,
రిషీవ్యాలీ పల్లెబడి, హరితవనం ,
4వ తరగతి, 19-12-2007
*
Prabhava,Books and Beyond ! * All rights reserved.

Saturday, January 1, 2011

ఈ ఏడాది మనదేనండి!

ఈ కొత్త సంవత్సరం  బొమ్మలు గీసేయండి .
రంగులు చిందించేయండి. 
కథలు వినండి.
 పుస్తకాలు చదవండి. 
బోలెడన్ని కబుర్లు చెప్పండి.
పాటలు పాడండి. 
ఆటలు ఆడండి.
ఈ ఏడాది మనదేనండి!
శుభాకాంక్షలు .
***

 చిన్నారి లక్ష్మీ యశోధర,  టై అండ్ డై చేస్తూ .
***


Prabhava,Books and Beyond ! * All rights reserved.