*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Sunday, September 25, 2011

అమ్మా , ఓ అమ్మా!

రెండుగంటల ముందు వెళ్ళింది,
 నా ఆహారం కారణం.
ఈ వంటరితనం నా ఆనందం,
తిట్టడానికి లేదు కదా!
అమ్మా, ఓ అమ్మా,
నువ్వు తిరిగి రావద్దే !

కడుపుమంట ,ఆకలి దంచుతుంది,
నా భోజనం ఎక్కడ?
నా సంతోషం మాడిమసిగా మారింది,
కోపం నా ఏకైక భావం.
అమ్మా,ఓ అమ్మా, 
నా కోపాన్ని పరీక్షించ వద్దు! 


చీకటి ముసురుకొంటొంది నాచుట్టూ,
నా కోపము భయముగా మారింది.

ఏంటా శబ్దం? సర్పమో,కౄర మృగమో ,
నా ప్రాణం ఆపదలో చిక్కి ఉంది.
అమ్మా,ఓ అమ్మ,
నువ్వు ఎక్కడ ఉన్నావు?

నల్లటి దూరం నుండి వేగంగా వస్తుంది ,
అదుగో మా అమ్మ!
నా నోటి నుండి ఏమి వచ్చినా,
నువ్వు మాత్రం బాధ పడకు.
ఎందుకంటే,
అమ్మా ,ఓ అమ్మా, 
నువ్వంటే నా ప్రాణం కదా?

***


ప్రియ బిక్కాని,
10 వ తరగతి,
రిషీవ్యాలీ స్కూలు 5.9.11

***
Prabhava,Books and Beyond ! * All rights reserved.

3 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

baagundi. pillala lo..rachanaa shakthi vikasinchadaaniki.. prabhava manchi vedika.

anrd said...

చాలా బాగా రాసావమ్మా.

గీతిక బి said...

ప్రియా... చాలా చాలా బాగా వ్రాశావు. ఆల్ ది బెస్ట్...