ఒక రోజు మొలకలపున్నమి వచ్చింది.
ఆ రోజు సూర్యగ్రహణం పట్టింది.
ఆ రోజు పూజారి పూజ చేస్తుండగా మారెమ్మ అతనిలోకి చేరింది.
అప్పుడు పూజారి వేపాకు తింటూ ఉంటే పూనకం వచ్చింది.
అప్పుడు పొట్టేలిని నరికేసారు.పూజారి రకం తాగాడు.కోడితల కొరికి విసిరేశాడు.
అప్పుడు ప్రజలంతా భయపడ్డారు.
అప్పుడు మాఇంటికి వచ్చి పై నుంచి కిందికి దూకాడు. ఒక ఆయనను వేప ఆకులతో కొట్టాడు. "ఏంటి నీ కోరిక?" అని పూజారి అతనిని అడిగాడు.
"వానలు పడడం లేదు . మా పంటలు సక్రమంగా పండలేదు."
అప్పూడు పూనకం వచ్చిన వ్యక్తి "ఈ నెల తరువాత పడుతాయి" అని చెప్పాడు.
మళ్ళీ ఇంటికి పోయి స్నానం చేసాడు.అప్పటి నుంచి అతను సంతోషంగా ఉన్నాడు.
అతడు చేతులో కర్పూరం పెట్టుకొని ముట్టించుకొన్నాడు.
మారెమ్మ తమ్ముడు పోతులురాజు మారెమ్మ ముందు ఉన్నాడు. అందరి గంగమ్మల ముందు పోతులరాజు ఉంటాడు. పోతులరాజు కూడా ఒక ఆయనకు వస్తుంది.
ఇద్దరికీ పూనకం వస్తుంది.
అలా ఆయనకు వస్తూనే ఉంది.
వాన మాత్రం రాలేదు !
***
బి. రాజేంద్ర ,6 వ తరగతి, విద్యావనం ,2005,
***
పట్టుపువ్వులు ,పిల్లలకలాలు సంకలనం నుంచి.
Prabhava,Books and Beyond ! * All rights reserved.
No comments:
Post a Comment