*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Monday, November 15, 2010

రోడ్డు పైన ధర్మం

బాలోత్సవ్ @ కొత్తగూడెం కథారచన లో సీనియర్ లలో ప్రథమ బహుమతి పొందిన ఆర్ .సాయికుమారి, 9 వ తరగతి, త్రివేణి స్కూల్, కొత్తగూడెం ,రచన ఇప్పుడు చదవండి.

(అలాగే, సంధర్భం వేరయినా ,వంటినిండా వెండి రంగు తో గాంధి లా ఉన్న  ఒక కళాకారుడిని ఇక్కడ చూడొచ్చు మీరు.


రోడ్డు పైన ధర్మం

ఒకానొక ఊరిలో ఒక కుటుంబం.
ఆ కుటుంబం చాలా బీద కుటుంబం.
అందులో రాజయ్య తన భార్య ,ఇద్దరు పిల్లలు చాలా సంతోషంగా ఉండేవారు. రాజయ్య చెప్పులు కుట్టుకుంటూ తన కుటుంబాన్ని పోషించేవాడు. తన ఇద్దరు పిల్లలు చాలా చురుకైన వారు. కానీ, వారి దగ్గర డబ్బు లేక పోవడంతో చదువులేక ఎంతో బాధ పడే వారు.
ఒక రోజు ఆ ఇద్దరు పిల్లలు బాధగా, చెప్పులు కుడుతున్న రాజయ్యను అడిగారు." నాన్నా! మన కుటుంబం ఇలా ఉండడానికి కారణం ఏమిటి? మన జీవితాలే ఎందుకిలా ఉన్నాయి?మేము ఎందుకు చదువుకోవడం లేదు? "
అతనికి ఏం సమాధానం చెప్పాలో అర్ధం కాలేదు.

కొన్ని రోజులు గడిచాయి.
రాజయ్యకు అనారోగ్యంగా ఉండడం వల్ల అతను కొద్దికాలంలోనే మరణించాడు.
ఇప్పుడు కుటుంబాన్ని పోషించే దిక్కు కూడా లేదు.
"అమ్మ ఎలా పోషిస్తుంది?" అన్న ప్రశ్నలు ఆ పిల్లలిద్దరి మనసులో మొదలయ్యాయి.

వారిద్దరు ఒక రోజు అలా రోడ్డు మీద నడిచి వెళుతుండగా , వారికి అక్కడ ఉన్న స్కూల్లో హడావుడిగా ఉండడం గమనించారు.అందులో ఒక అబ్బాయి గాంధి గారి వేషం వేయడం  చూశాడు, రాజయ్య పిల్లల్లో ఒకడు.

తన అక్కతో అన్నాడు,"అక్కా! నాకొక ఆలోచన వచ్చింది. "
"ఏంటి?" అక్క ప్రశ్నించింది.
అప్పుడు వాడు చెప్పాడు," ఇప్పుడు ఆ అబ్బాయి గాంధివేషం వేస్తున్నాడు కదా ,అదే వేషంలో నేను కూడా రోడ్డు మీద నిల్చుంటే ఎవరైనా డబ్బులు వేస్తారు .అప్పుడు అమ్మకు సహాయం చేసినట్టు ఉంటుంది.అలాగే మిగిలిన డబ్బుతో మనం చదువుకోవచ్చు."
అప్పుడు తన అక్క ," అలా చేయడం తప్పు కదా!" అంది.
అతను ," ఇలా చేయడం తప్పు ఎందుకవుతుంది?" అని చెప్పాడు.

సరే అని ఇద్దరు  పరిస్థితి ని వారి అమ్మకు చెప్పారు.
వాళ్ళ అమ్మ ," నా పిల్లలకు ఇలాంటి పరిస్తిథి రావడం ఏమిటి? "అని చాలా బాధ పడింది.

కానీ, ఆ పిల్లాడు మాత్రం గాంధి వేషం వేసి ,రోజుకి కొంత డబ్బు సంపాదించేవాడు.కొన్ని రోజులకే రాజయ్య భార్య కూడా మరణించడంతో ఇద్దరూ అనాథలయ్యారు.
కానీ, వారికి ఆ ఆలోచన తోడుగా ఉందని సంతోషించారు.
అలా అలా కొన్ని రోజులు డబ్బు సంపాదించారు.

వారి పరిస్థితిని అటుగా వెళ్తున్న చింటూ అనే కుర్రాడు హేళన చేయడం ప్రారంభించాడు. చింటూ రోజూ ఆ అబ్బాయిని " నువ్వేంటి? ఇలా ఒంటి నిండా కలర్ పూసుకొని ,చేతిలో కర్ర పట్టుకొని అడుక్కొంటున్నావు ?'అని ఏడిపించేవాడు.
 రోజు రోజుకీ చింటూ అల్లరి ఎక్కువైపోయింది.
అతని చేతిలోని డబ్బుని లాక్కుని ఏడిపించేవాడు. కానీ,అటుగా వెళుతున్న పెద్దవారు కానీ, పిల్లలు కానీ పట్టించుకొనే వారు కాదు.ఆ అబ్బాయి ఎవరైనా వచ్చి రక్షిస్తారేమో అనుకొంటే ఎవరూ పట్టించుకొనే వారు కాదు.

కొన్ని సంవత్సరాల తరువాత, ఆ అబ్బాయి ఆలోచించి ,తాను పోగు చేసిన డబ్బుతో చదివి ఒక లాయర్ అయ్యాడు.

అలా రోడ్డు మీద అడుక్కున్న అబ్బాయి లాయర్ అవ్వడం ఏంటని అందరూ అశ్చర్యపోయారు.

దానికి అతను చెప్పిన సమాధానం ," ధర్మం రోడ్డున పడినపుడు ఎవరూ పట్టించుకోలేదు.అందుకే నావంతు కృషి చేసి ,నాలా ధర్మాన్ని రోడ్డు మీద నిలబెట్టి గొప్పవారు కాకుండా ,అనాధలైన వారిని రోడ్డున పడకుండా చేస్తాను. ధర్మాన్ని కాపాడతాను."

ఒక బీద కుటుంబం లోని వాడు బయటికి వస్తే ఎంత గొప్పవాడు అవుతాడని సందేశమిచ్చాడు.చింటూ వంటి వారు ఇక కనపడరని వాగ్దానం చేసాడు.

ధర్మో రక్షిత  రక్షితః  !
***

బాలోత్సవ్ @ కొత్తగూడెం కథారచన లో సీనియర్ లలో ప్రథమ బహుమతి :13-11-2010.

ఆర్ .సాయికుమారి, 9 వ తరగతి, త్రివేణి స్కూల్, కొత్తగూడెం ,
***

Prabhava,Books and Beyond ! * All rights reserved.

2 comments:

Raju said...

Dear Sai.. Intha chinna vayasulo Peda kutumbam gurinchi meeru aalochinchadam.... really great. Kashtapadithe ekkadinuchaina unnathi saadhincha vachanna abhiprayam meelo kalagadam... Bhavishyathu pai nammakam kaligisthondi.

Congrats..

Keep it up.

andhra said...

now a days children esp. those are in early youth thinking that their priorities are totally different and totally career oriented. Awareness about the importance of human touch and understanding importance of social sciences is the need of the hour