ఇది బాలోత్సవ్ కు ఇరవై ఏళ్ళ పండుగ!
కొత్తగూడెం లో డా .వాసిరెడ్డి రమేష్ గారి సారధ్యంలో , కొద్దిమంది పిల్లలతో ప్రారంభమై, ఇంతింతై తానింతై, రాష్ట్ర వ్యాప్తమై ,
ఈనాడు షుమారు 15 వేల మంది పిల్లలకు, వారి వెన్నంటి వచ్చిన పెద్దలకు , వారిని అభిమానిచే వారందరికీ , కొత్తగూడెం ఆతిథ్యం వహించిన మూడురోజుల పిల్లల పండుగ , బాలోత్సవ్.
తొలినాటి పండుగలలో పాల్గొన్న పిల్లలు ఎందరు ఇవ్వాళ తమ పిల్లల్ని వెంట పెట్టుకొచ్చారో అంచనాలు లేవు కానీ, షుమారు 12 నుంచి 15 వేల మంది పిల్లలు వివిధ కళాంశాలలో తమ ప్రతిభా పాటవాలను ఈ మూడు రోజుల పాటు ప్రకటించారు. అందులోనూ, 13 వ తేదీ పిల్లల కథా, లేఖా రచనలు. మొదటి రోజునే కవి సీతారాం , మంచికంటి ,నవీన్,భగవంతం గార్లు కవితా రచనను నిర్వహించారు.
L to R:సి .హెచ్ .సుదర్షనం,తుమ్మేటి,వాసిరెడ్డి రమేశ్ గార్లు. |
ఆపై , శిరం షెట్టి కాంతారావు, ముళ్ళపూడి సుబ్బరావు గార్లతో పాటు ,పిల్లల రచనలను చదివి ,ఎంపిక చేశారు.వాటినీ , మిగిలిన అన్నిటినీ మీరు ఇక ప్రభవలో చదవవచ్చు!
పిల్లలకు ఇచ్చిన కథన సంధర్భాలివి.
1. పిల్లలు వళ్ళంతా వెండి రంగు పులుముకొని, నడిబజారులో గాంధీజీలా నిలబడి ,యాచిస్తూ ఉండడం చూసే ఉంటారు. వారిని చూసినప్పటి మీ స్పందనలను కథలా రాయండి.
2. మీరొక అంతరిస్తున్న జీవరాశికి చెందిన ఆఖరి కుటుంబ సభ్యుడు . మీరేం చేసి మీ జాతిని/సమూహాన్ని అంతరించి పోకుండా కాపాడుతారో రాయండి.
3. మీరు అనుకోకుండా తప్పి పోయారు. ఒక ఏకాంత ప్రదేశం చేరుకొన్నారు. అప్పుడు మీ వద్ద కేవలం మూడు వస్తువులు ఉన్నాయి. వాటిని వినియోగించి , మీవారిని మీరు ఎలా కలుసుకొంటారో ..కథలా రాయండి.
మీ ఊహ నిజమే నండి! పిల్లల్లో చాలామంది "తప్పి పోయారు !"
కొందరు అడవిలో,సంతలో , విహారయాత్రలో,జాతర లో, బాలోత్సవ్ లో,పట్నంలో ..ఒకరేమో .. కల లో !
ఇంకొకరు తప్పి పోయిన వారిని వెతకబోయి తప్పిపోయారు !
ఇక, వారందరూ తప్పక తీసుకు వెళ్ళిన ఒక ముఖ్యమైన వస్తువు..?!?
అహా!
మీరే చదివి తెలుసుకోవాలి!
అలాగే, వందలాది పిల్లల కథలను చదవగలిగే అవకాశం మాది. మీది కూడా!
చదవండి. మీ సూచనలను అభిప్రాయాలనూ తెలియ పరచండి.
ఈ సరికొత్త బాల సాహిత్యం మనందరిదీ!
బాల రచయితలకు అనేకానేక శుభాకాంక్షలు !
ప్రభవ పాఠకులకు చదవ గలిగినవారికి చదవ గలిగినంత !
L to R : భగవంతం, వాసిరెడ్డి నవీన్, శిరం షెట్టి కాంతారావు,
తుమ్మేటి రఘోత్తం రెడ్డి, చంద్ర లత.
***
Prabhava,Books and Beyond ! * All rights reserved.
No comments:
Post a Comment