6 వ తరగతి , రచన.
***
ఒక చిన్న గాంధి
***
ఒక రోజు నేను పాఠశాల నుండి వస్తుండగా నాకు గాంధి వేషంలో చిన్న కుర్రాడు కనిపించాడు . నేను అతన్ని చూడగానే పాఠశాలలో వేషం వేస్తున్నాడు అనుకొన్నాను.
కానీ, తీరా చూస్తే ,అతను ఒక భిక్షగాడు. అతను డబ్బులు అడుగుతున్నాడు. అంత చిన్న వయసులోనే అతనికి ఎందుకు డబ్బులు కావాలి?
అప్పుడు నేను ఆ చిన్న అబ్బాయి దగ్గరికి వెళ్ళి అడిగాను," నీవు ఎందుకు డబ్బులు అడుగుతావు వాటితో నీకు ఏమి అవసరం ? ఎందుకు వేషం వేసుకొని డబ్బులు అడూగుతున్నావు? " అని అడిగాను.
అప్పుడు ఆ చిన్న కుర్రాడు ఇలా సమాధానం ఇచ్చాడు. "నా పేరు సోము. నా వయసు ఏడేళ్ళు . నాకు మీలాగానే పిల్లందరితో కలిసి పాఠశాలకు వెళ్ళి ఆడూకొని ఆనందాలు ,బాధలు అన్ని విషయాలు పంచుకోవాలి అనిపిస్తుంది . కానీ దురదృష్టవశాత్తు , నేను ఒక పేద కుటుంబంలో పుట్టాను. మా అమ్మానాన్నలు నన్ను ఎంతో ప్రేమగానో చూస్తారు. కానీ ,మా కుటుంబం ఒక బువ్వ కూడా నోటిలో పెట్టలేని పరిస్థితి లో ఉన్నది.
మా నాన్నకి నేను నాలుగు ఏళ్ళప్పుడే పక్షవాతం అచ్చింది. మా అమ్మ ఏమీ చేయలేక చిన్న చిన్న ఇంట్లో పని చేస్తుంది. రోజుకి పదిరూపాయలు కూడా రావడం లేదు. ఇక నేను బాధలు భరించ లేక ఇలా వీధుల్లో వేషాలు వేస్తూ కొన్ని మాటలు చెపుతూ ,ఇలా డబ్బులు సంపాదిస్తూ ఉన్నాను.
కానీ, నేను ఏమాత్రం ఈ డబ్బులతో సరిపడ లేక పొతున్నాను.నాకు చదువుకోవాలని ఆశగా ఉంది. కాకపోతే నా పరిస్థితి అలాంటిది కాదు."
అప్పుడు నేను ఒక సలహా ఇచ్చాను." నువ్వు గవర్నమెంట్ పాఠశాలకు వెళ్ళి చదువుకోవచ్చు కదా?" అని అన్నాను.
"నేను చదువుకొంటే నా కుటుంబాన్ని పోషించేవారు ఎవరు ?"అని ఏడుస్తూ అన్నాడు.
అప్పుడు నాకు అతన్ని చూడగానే ఇలాంటి వారు ఎంతమందో ఉంటారు .నాకు ఏదో చేయాలి అనే తపన ఏర్పడింది. "వాళ్ళే రేపటి మనదేశానికి పౌరులు కావచ్చు " అని అనిపించింది.
అపుడు నేను మా తల్లిదడ్రుల దగ్గరికివ్ ఎళ్ళి మా నాన్న తో ఇలా అన్నాను. " నాన్నా ,నీకు ఉద్యోగం ఉంది కాబట్టి నన్ను మన కుటుంబాన్ని పోషిస్తున్నావు. నన్ను చదివిస్తున్నావు. కానీ, పేద కుటుంబంలో పుట్టిన పిల్లల సంగతి ఏమిటి ?
వాళ్ళు చదువుకోలేరు కదా.రోజూ పనిచేయాలి. వాళ్ళని మనం చదివిద్దామా?'" అని అడిగాను.
" నీ ఆలోచన బావుంది . కానీ ,నేటికాలంలో చదివిస్తా అని పిలిచినా రానటువంటి పరిస్థితిలో ఉన్నారు . వాళ్ళకి చిన్నగా చదువు మీద ఉన్న శ్రద్ధ పోతుంది . వాళ్ళకి అలా గాలికి తిరగడమే నచ్చేస్తది "" అని అన్నారు.
నిజంగానే సోముకి రెండు నెలల తరువాత చదువు మీద శ్రద్ధ వెళ్ళిపోయి ,అలా వేషాలతోనే తిరిగాడు. అతనికి రోజుకి 50 ఎక్కువనే డబ్బులు వస్తున్నాయి .
కానీ, అతను చదువుకోవడం లేదు.
నాకు అర్ధమైంది ఏమిటంటే, పరిస్థితులను బట్టి , కాలాలను బట్టి , మనుషులుకూడా మారుతారు.
***
బాలోత్సవ్ కథారచన -2010 లో జూనియర్ విభాగంలో 2 బహుమతి పొందిన కె. అభిజ్ఞ ,6 వ తరగతి , తేజ టాలెంట్ స్కూల్, కోదాడ ,నల్గొండ జిల్లా.
రచన.
13-11-2010.
Prabhava,Books and Beyond ! * All rights reserved.
No comments:
Post a Comment