wallpaperstock.net |
***
అనగనగా ఒక ఊరిలోఒక రాజు అనే అబ్బాయి ఉండే వాడు.ఆ ఊరికి దగ్గరగా ఒక చిట్టడవి ఉండేది. రాజునాన్న అడవికి వెళ్ళి తేణె సేకరించేవాడు.
ఒక సారి రాజు నాన్నకు బాగా జ్వరం వచ్చింది.
రాజు నాన్న ," అడవికి వెళ్ళి నువ్వు తేనె తేవాలి. అప్పుడే మనం డబ్బు సంపాదించుకోవాలి" అన్నాడు.
రాజు ఒక బుట్టను ,కత్తిని ,అగ్గిపెట్టెను తీసుకొని అడవికి వెళ్ళాడు.
అతడికి తేనె తెట్ట కనిపించ లేదు.
సాయంత్రం అయినా అతనికి తేనెతెట్ట కనిపించలేదు. అతడు ఇక వెళ్ళి పోదాం అనుకొన్నాడు. అతనికి దారి తెలియదు.
తేనె కోసం అతడు అడవి మొత్తం తిరుగుతూ ,ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ,సేద తీర్చుకొన్నాడు.
ఆ రోజు రాత్రి అతడు అక్కడే ఉన్నాడు, రాజు నాన్న అతడు ఇంకా రాలేదని అడవిలో ఏదైనా మృగం అతన్ని చంపేసిందేమో నని భయపడ్డాడు.
ఆ రోజు రాత్రి అతనికి నిద్ర పట్టలేదు.
bengalnewz.blogspot.com |
రాజు అడవిలో తప్పి పోయాడు. రాజుకు బాగా చలి వేసే సరికి ,తన దగ్గర ఉన్న కత్తితో ఎండు కట్టేలు నరికి అగ్గిపెట్టెతో మంట వేశాడు. కొంతసేపు నిద్రపోయాడు.
పొద్దున్నే లేచి తన ఇంటికి వెళదాం అనుకొన్నాడు.
రాజు నాన్న జ్వరంతో ఉండడంతో తన కొడుకును వెతకడానికి రాలేక పోయాడు.
రాజు అడవిలో మళ్ళీ తేనె తుట్టెలు వెతికాడు. ఈ సారి అతనికి తేనె తుట్టె కనిపించింది. మంటపెట్టి తేనె టీగలను తరిమి ,తెట్టెబు కత్తితో కోసి ,తేనెను బుట్టలోకి పిండాడు. మధ్యాహ్న సమయంలో రాజు తేనె తాగి ఆకల్ని తీర్చుకొన్నాడు.
అక్కడ వాళ్ళ నాన్న ఎలా ఉన్నాడని రాజు బాధ పడ్డాడు.
రాజు మూడిటిని తీసుకొని ,ఒక దగ్గర కూర్చుని ,కత్తితో కట్టే పుల్లలను నరికి ,ఒక డేరాలాగా ఏర్పాటు చేసుకొన్నాడు. ఎందుకంటే ఆ రోజు సాయంత్రం వర్షం బాగా కురిసింది.
ప్రొద్దున్నే లేచి రాజు ఆలోచించి ,"నేను అడవికి వచ్చినప్పుడు కత్తిని ఒకసారి, బుట్టను ఒకసారి నేల మీద అప్పుడప్పుడు పెట్టాను.అంతే గాక అగ్నిని కూడా మండించాను."
ఆ గుర్తులను వెతుకు కుంటూ అడవి మొత్తం తిరుగగా ,అతనికి ఒక దగ్గర అతడు కాల్చిన కట్టె పుల్లలు కనిపించి ,ఆ దారినే ఇంటికి వెళ్ళగా ,బుట్టగుర్తు కత్తి గుర్తు ఉంది.
అక్కడినుంచి అతడు వెళ్లి పోయాడు.
అతడు ఒకవేళ ఆ మూడు వస్తువులను ఉపయోగించకపోయుంటే , అతడు ఇంటికి చేరుకొనే వాడు కాడు.
ఇంటికి వచ్చిన అతనిని చూసి వాళ్ళ నాన్న ఎంతో సంతోషించాడు.
***
బాలోత్సవ్ కథారచన -2010 లో జూనియర్ విభాగంలో ప్రథమ బహుమతి పొందిన రచన.
13-11-2010.
Prabhava,Books and Beyond ! * All rights reserved.
No comments:
Post a Comment