పుస్తకాలు చదివారు.
పరిచయం చేశారు!
ఇవ్వాళ పొద్దున నుంచీ వాన.
మధ్యాహ్నం కాస్త తెరిపిచ్చినా, సాయంత్రం జోరు వాన.
నిన్నటి దాకా, పిల్లలకు వార్త చేరేయడం తోనే హడావుడి పడ్డ ప్రభవ వారం,
ఈ పూట వాతావరణం చూసి,
ఇక పిల్లలు ఎవరూ ఇంటి నుంచి బయటకు రారను కొన్నాం.
అందులోనూ,కొందరు బడి వాళ్ళు భయపెట్టేసారు కదా,
మా పిల్లలకు యూనిట్ టెస్టులు.ఇలాంటి వన్నీ ససేమిరా "నో " అంటూ.
అయిదింటికల్లా , పిల్లలు వచ్చారు.
వారికి నచ్చిన పుస్తకం తీసుకొన్నారు. చదివారు. మాట్లాడారు.
ఎనిడ్ బ్లైటన్ నుంచి ఐయాన్ కోల్ఫర్ వరకు.
హ్యారీ పాటర్ నుంచి నాడీ , అర్టమస్ ఫౌల్ లవరకు.
' పక్షి ప్రేమించిన పర్వతం' నుంచి 'అమర చిత్ర కథ ల వరకు.
"మానవ హక్కులు" నుంచి "ఇంద్రధనుస్సు" వరకు
పిల్లలు పుస్తకాల గురించి మాట్లాడారు.
అవే ఈ చిత్రాలు.
అయిదింటికి మొదలుపెట్టాం కదా, ఈ అయిదుగంటలూ ఎటు పోయాయో !
అలా, ఈ ఏడాది ప్రభవ లో పిల్లల పండగ ప్రారంభం అయ్యిందన్న మాట !
Prabhava,Books and Beyond ! * All rights reserved.
No comments:
Post a Comment