ఒక అడవిలో పట్టుపురుగుల గుంపు ఉండేది.
అవి ఉండే మల్బరి మొక్కలు ఎండి పోయాయి.అప్పుడు అవి అన్నీ గుంపు కూడుకొన్నాయి.
వీటిలో పెద్ద పురుగు లీడర్ గా ఉండేది.
మిగతా పురుగులు ఆ పెద్ద పురుగుతో ఇలా చెప్పాయి.
"మనం నివసించే తోట ఎండిపోయింది .అందుకు మనకు ఆహారం లేకపోతుంది.ఏదైనా ఉపాయం ఆలోచించండి."
"నేను ఆలోచిస్తానులే" అని పెద్దపురుగు చెప్పింది.
"సరే' అని మిగతా పురుగులన్నీ వెళ్ళి పోయాయి.
మరుసటి రోజు మళ్ళీ అదే చోటికి వచ్చాయి.
అప్పుడు చిన్న పురుగులు ,"ఏం ఆలోచించారు పెద్దపురుగు గారు ?" అని అడిగాయి.
"నా స్నేహితులైన మరో పురుగులు వేరే అడవిలో ఉన్నారు.అక్కడ వాళ్ళకు ఆహారానికి ఏమీ లోటు లేదు.మనము అక్కడికి వెంటనే వెళ్ళాలి .తరువాత విషాలన్నీ అక్కడైకి వెళ్ళాక చెప్తాను. "అని చెప్పింది.
"అక్కడికి మనము వెళ్తాము .అక్కడ తేనేటీగలు మల్బరి మొక్కలకు నీళ్ళు తెచ్చి పోస్తాయి.మల్బరి ఆకులను మనం మనకు నచ్చినన్ని తినచ్చు .కానీ , ఒక షరతు . వాటికి మనం మనకువచ్చిన పట్టునంతా వాళ్ళకు ఇచ్చేయాలి" అని అంది పెద్ద పురుగు.
వాళ్ళు సరేనని ఒప్పుకొన్నారు."కానీ, ఇవి వర్షాలు పడే వరకే" అని చెప్తాయి.
*
వాటిలో ఒక తేనెటీగ ,పట్టుపురుగు రెండూ చాలా స్నేహంగా ఉండసాగాయి.
తేనెటీగ ,పట్టుపురుగు ఒక కొలనులో స్నానం చేయడానికి వెళ్ళాయి.
అప్పుడు తేనెటీగ కొలనులో పడిపోతుంది.
కొమ్మ మీద ఉన్న పావురం వచ్చి తేనెటీగను కాపాడుతుంది.
అప్పటినుంచి ముగ్గురూ మంచి స్నేహితులుగా ఉంటారు.
ఆ పావురానికి పట్టుపురుగు పట్టునిస్తుంది. తేనెటీగ తేనెనిస్తుంది.
పావురం పట్టుతో గూడును అల్లుకొంటుంది. తేనెను తన పిల్లలకు ఇస్తుంది.
పట్టుతో అల్లుకొన్న గూడు చాలా అందంగా ఉంది.
మిగతావారు దాన్ని చూసి కుళ్ళుకొంటున్నాయి.
ఈ గూడు ఎంత పెద్ద తుఫాను వచ్చినా కూలిపోదు.
* ఎం. మహేశ్వరి , 9 వ తరగతి ,తెట్టు ,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
Prabhava,Books and Beyond ! * All rights reserved.
Sunday, October 3, 2010
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
కధ అయినట్టు లేదు..? బాగా రాసావు తల్లీ..
కథ బావుంది. ఏ మూసలోకి ఇమడలేదు . నాకు నచ్చిన విషయం : ఇందులో నీతి ప్రబోధన లేదు.
ప్రదీప్.
pradeepsmiles@gmail.com
Post a Comment