నేను తెట్టు గ్రామంలో నివసిస్తున్నాను.
ఒకరోజు సమయం ఆరు గంటలు కావస్తున్నది.
పక్షులు అన్నీ గాలిలో ఎగురుతూ అరుస్తూ ఉన్నాయి.
వాతావరణం చాలా ప్రశాంతంగా ఉన్నది.
పక్షులు కూడా గూళ్ళకు వెళుతున్నట్లుగానే , నేను కూడా సాయంత్రం హాయిగా పాటలు పాడుకొంటూ..స్కూలు నుండి ఇంటికి వెళుతున్నాను.
దారిలో నేను ఒక్కడినే వెళుతున్నాను.
ఒకాయన నాకు ఎదురు వచ్చి,
" నవీన్, మీ ఇంట్లో కి పాము వెళ్ళింది ." అని చెప్పాడు.
నాకు ఒక్కసారిగా అదురుపు వచ్చింది.
నేను వేగంగా పరిగెత్తుకొని వెళ్ళే సరికి , మా ఇంటి ముందంతా జనం పోగయి ఉన్నారు.
ఇద్దరు మా ఇంటిలోనికి వెళ్ళి పామును వెతుకుతున్నారు.
ఒక్కొక్క వస్తువునీ తీసి చూస్తూ ఇల్లంతా గాలిస్తున్నారు.
అపుడు అలా చూస్తుండగా, పాము సంచిలోకి దూరింది.
అది తెలుసుకొని , అతడు ఆ సంచిని తీసుకొని బయటకు వచ్చాడు.
అతడు పాము ను చంపేస్తానన్నాడు.
"వద్దు. వదిలేయమని" చెప్పగా "సరే" నన్నాడు.
పాము ఉన్న సంచిని తీసుకు వెళ్ళి ఒక చోట వదిలాడు.
పాము బయటకు రాగానే చంపడానికి ప్రయత్నిచసాగాడు.
కానీ, ఆ అవకాశం లేకుండా ,కర్ర తీసుకొని గట్టిగా కొట్టాడు.
పాము చనిపోయింది.
నేను అతని దగ్గరగా వెళ్ళి పామును ఎందుకు చంపుతున్నావు అని అడిగే ధైర్యం లేక,
పాము అంటే భయం చేత ,
అక్కడే అలాగే చూస్తూడి పోయాను.
ఆ తరువాత అతను వచ్చేసరికి,
" ఆ పామును చంపటం వలన ఏమి సిద్ధించింది ?" అని అడిగాను.
అతను ఏమీ మాట్లాడ లేదు.
"నిన్ను కూడా ఒక పామును హింసించినట్లు హింసిస్తే ,నీకు ఎలా ఉంటుంది?" అని అడిగాను.
"చిన్న పిల్లవాడి వైనా బాగా మాట్లాడావు" అని నా చుట్టూ ఉన్న కొంతమంది అన్నారు.
అతడు ఏదో కొద్దిగా అర్ధం చేసుకొనే వాడు కనుక,
కొద్దిగా మారాడు.
మరొక రోజు ఇలాంటి సంధర్భం వచ్చినపుడు ,
అతడు పూర్తిగా మారాడు.
*
ప్రాణులను హింసించ రాదు.
*
S. నవీన్ ,
10 వ తరగతి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠ శాల ,తెట్టు.
10-9-10
Prabhava,Books and Beyond ! * All rights reserved.
No comments:
Post a Comment