*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Tuesday, September 20, 2011

వీధి వీధి లో రాగులు

రామాపురం అనే వూరిలో గోపాల్ అనే రైతు ఉండే వాడు.
అతను ఒక రోజు రాగులు పంట వేయాలని అనుకొన్నాడు. అంగడికి వెళ్ళి రాగులు తీసుకొని వచ్చాడు.
ఆ రాగులను పొలంలో వేసి పంట పండించాడు.
ఆ రాగులను వూరిలో అమ్మాలనుకొన్నాడు.
ఎవరూ కొనలేదు.
మదనపల్లికి వెళ్ళి అమ్మాలనుకొని, మదనపల్లికి వెళ్ళాడు.
మదనపల్లిలో వీధి వీధికి వెళ్ళి అమ్మాడు.
ఎవరూ కొనలేదు.
అక్కడికి ఒకామె వచ్చి,
 "ఏంటయ్యా ,చీప్ గా రాగులు అమ్ముతున్నావు ?"అని అడిగింది.

ఇంతలోనే మరొకామె వచ్చింది. "అర కిలో రాగులివ్వు "అని అడిగింది.

"ఏమిటమ్మా టౌన్ లో ఉండీ చీప్ గా రాగులు కొంటున్నావు ?"అని అడిగింది మొదటి ఆమె.
"నీకేం తెలుసు రాగుల్లో బలం ?" అంది రెండో ఆమె.
"రాగుల్లో ఉన్న బలమేమి చెప్పమ్మా" అంది మొదటామె.
"అది చెపితే తెలిసేది కాదు.తింటే తెలుస్తుంది! "అన్నది రెండో ఆమె.
ఆమె మాట విన్న పక్క వారు కూడా వచ్చి రాగులు కొన్నారు.
అలా వక్కరికి వక్కరు చెప్పుకొని ,అందరూ కొనుక్కొన్నారు.

అలా కొని,ఆ రాగులు తినడం ద్వారా అందరు ఆరోగ్యంగా ఉన్నారు.
"ఎవరైనా సరే, ప్రిస్టేజీకి పోకుండా రాగులు కొనాలి. అవి మాత్రమే కాదు మిగిలిన కూరగాయలు ,పండ్లు కూడా తినాలి." రెండో ఆమె అంది.
అందరు కొనడం ద్వారా, గోపాలు మళ్ళీ రాగుల పంటేసాడు.కూరగాయలు పండించాడు.

***
బి.నందిని  ,6 వ తరగతి,జిల్లా పరిషత్ హైస్కూలు , తెట్టు
***
Prabhava,Books and Beyond ! * All rights reserved.

4 comments:

ఆత్రేయ said...

బాగుంది ప్రభవ.
ఇంకా ఇలాంటి మంచి కధలు వ్రాయి.

Prabhava said...

నమస్కారం .
ఇది బి.నందిని,6 వ తరగతి,జిల్లా పరిషత్ హైస్కూలు , తెట్టు... రాసిన కథ.
కథ నచ్చినందుకు మీరు మెచ్చినందుకు నందిని తరుపున ధన్యవాదాలు.
ఇది నందిని రాసిన మొదటి రచన . మొదట అచ్చయినదీ ఇదే.
ప్రభవ

Pradeep said...

నందిని,
మాదీ మదనపల్లే. మా ఊరే అంత !
ప్రిస్టేజ్ కి పోకుండా నేనూ రాగులు తింటాలే !
నీ మీదొట్టు , వద్దులే రాగుల మీదొట్టు !

sankar said...

బాగుంది ప్రభవ.