*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Monday, September 26, 2011

ఇంటికి రా అమ్మా!

                                                                                                            
అమ్మ పొద్దున్నే మా ఇద్దరికీ ఆహారం 
తీసుకురావడానికి వెళ్ళిందా. 
ఇంకా రాలేదు.
అమ్మకి ఏమయింది?

అయ్యో ! వేటగాడి వలలో చిక్కూన్నావా?
లేకపోతే దెబ్బ తగిలి కింద పడి పోయావా?
అయ్యో ! నాకు ఆకలేస్తుంది!

అయ్యో ! ఇప్పుడు శత్రువుల బారి నుండి ఎవరు రక్షిస్తారు?
అమ్మా మమ్మలని మరిచి పోయావా?
లేకపోతే నీ పిల్లలనుకొని వేరే పిల్లలతో ఆడుతున్నావా?

అయ్యో బాగా చీకటి పడుతుందే !
చెట్టుతాత కూడా నిద్రపోతున్నాడు! 
అయ్యో ! నాకు చాలా భయంగా ఉంది.
తొందరగా ఇంటికి రా అమ్మా!

***
దశాని , 9 వ తరగతి, రిషీవ్యాలీ స్కూలు 5.9.11

***
http://prabhavabooks.blogspot.com/2011/09/blog-post_25.html
***
Prabhava,Books and Beyond ! * All rights reserved.

1 comment:

భాస్కర రామిరెడ్డి said...

చిన్నారి దశాని భావం, అక్షరబద్ధంచేసిన తీరు బాగుంది. పాప కు ఆశీస్సులు.