నిన్నటికి నిన్న ..అప్పటికి అప్పుడు.. తెలిసీ తెలియగానే ...
ప్రభవలోని పిల్లలు పెద్దలు ..
(అందరం ఈ ఫోటోల్లో లేమండొయ్..:-) .. అనంత రామయ్య గారింటికి వెళ్ళాం.
అక్కడ శ్రీమతి సరోజ గారిని కలిశాం. వారెంతో ఆదరంగా అభిమానంగా మమ్మల్ని పలకరించారు.
శ్రీశ్రీ ప్రగతి ట్రస్ట్ ప్రారంభోత్సవ సంధర్భం అది.
సరోజ గారు అందిరి చిట్టి రచనలను పరామర్షించారు. మరింత తరుచుగా వ్రాస్తూ ఉండమని చెప్పారు. ఎప్పుడు ఆలోచన వచ్చినా వెంటనే అక్షర రూపం ఇవ్వాలని , వాయిదా వేసుకోవద్దని చెప్పారు.
ఒక మారు శ్రీశ్రీ గారితో పాటు ప్రయాణంలో ఉన్నారట. శ్రీశ్రీ గారికి వెంటనే రాయాలనిపించిందట. దగ్గరలో కాగితం ముక్క ఏదీ లేదు. జేబులోంచి అగ్గెపెట్టె తీసి ,అగ్గిపుల్లలు సరోజ గారి చేతిలో పెట్టారట .
సరోజ గారు, పుల్లలను తన చేతి సంచిలో భద్రపరిచారట. శ్రీ శ్రీ గారేమో ఖాళీ పెట్టెను తిరగేసి, కవితను రాసేసి , ఆ అట్ట ముక్కను సరోజ గారికే ఇచ్చారట.దీనిని మరింత భద్రపరిచి, గమ్యం చేరగానె, కాగితమెక్కించారట.
సరోజ గారు, పుల్లలను తన చేతి సంచిలో భద్రపరిచారట. శ్రీ శ్రీ గారేమో ఖాళీ పెట్టెను తిరగేసి, కవితను రాసేసి , ఆ అట్ట ముక్కను సరోజ గారికే ఇచ్చారట.దీనిని మరింత భద్రపరిచి, గమ్యం చేరగానె, కాగితమెక్కించారట.
అదీ కవితాఉద్వేగం అంటే !
ఇలాంటి కొన్ని శ్రీశ్రీ మరమరాల్ని మూటకట్టుకొని .. బిస్కట్లు నోట పెట్టుకొని..
మళ్ళీ ప్రభవ దారి పట్టాం! మేమందరం!
మళ్ళీ ప్రభవ దారి పట్టాం! మేమందరం!
అన్నట్టు అది అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ కవితేనా అని అడగడం మరిచిపోయామండోయ్! ప్చ్!
సరోజ గారు మొదట అగ్గిపుల్లల్ని ..ఆ పై ఆ కణ కణ లాడే ఆ అక్షరాలనూ .. అపురూపంగా భద్ర పరిచారట.
పిల్లలు వారిని కలిసి ఎంతో సంతోషించారు.
అన్నట్టు ,ఈ చివరి ఫొటోలో... ఆ వెనుక కూర్చున్న తాతయ్య గారే ఈ ట్రస్టు కు మూలకర్త..శ్రీ వేములపాటి అనంతరామయ్య గారు.వారి పక్కనున్న వారు, శ్రీమతి కామేశ్వరి గారే .మొదటి లక్ష మూలధనం వారే ఇచ్చారు! వారికి జేజేలు.
ఈ సంధర్భంగా మరో మారు శ్రీ శ్రీ గారిని అందరం అభిమానంగా తలుచుకొన్నాం.
"అహో " కారాలు చేసే వారు ఎలాగు
శ్రీ శ్రీ గారిని వదిలి ఉండలేరు.
"ఊహు" కారాలు చేసే వారు ఎలాగైనా
శ్రీ శ్రీ ని వదిలించుకోలేరు!"
అన్న చంద్రక్క మాటలు సరోజగారికీ నచ్చాయండోయ్ !
సరోజ గారికి ప్రభవ విద్యార్థుల తరుపున అభిమానాలు.
శ్రీ శ్రీ గారికి జేజేలు.
శ్రీశ్రీ ప్రగతి ట్రస్ట్ వారికి ధన్యవాదాలు.
***
Prabhava,Books and Beyond ! * All rights reserved.
2 comments:
Wow.. Emi chepparandi Akkagaru! Aho kaaralu.. oohu kaaralu! Iteevala nenu chadivina best kavitha ide!
Hats off!
Raju
ధన్యవాదాలండి.
మీకు వీలయితే పూర్తి రచన ఇక్కడ చదవండి.ఇప్పటికే చదివి ఉంటే, మన్నించండి. లేదూ, మరో మారు చదవండి...:-)
అక్క
Mar 3, 2011
నిశ్చయముగ నిర్భయముగ
http://chandralata.blogspot.com/2011/03/blog-post.html
Mar 7, 2011
నిశ్చయముగ నిర్భయముగ 1
http://chandralata.blogspot.com/2011/03/1.html
Post a Comment