నాకు కొండ ఎక్కాలని ఎంతో కోరికగా ఉండేది.
అనుకోకుండా ఒకరోజు, ఎవ్వరికీ చెప్పకుండా ,కొండ ఎక్కాను.
అక్కడ నాకు రకరకాల పువ్వులు ,తీగలు, పచ్చని చిగుళ్ళు ,పండ్లు కనబడ్డాయి.
ఇంకా రంగు రంగుల పక్షులను ,సీతాకోక చిలుకలను చూసాను.
ఇవన్నిటినీ చూసాక నాకు ఎంతో సంతోషం కలిగింది.
అనుకోకుండా ,ఒక అనకొండను చూసాను.
అది ఒక పెద్ద గుండుకు చుట్టుకొని నిద్రపోతున్నది. నేను చూడకుండా ,ఆ గుండు పైకి జంప్ చేసాను. అప్పుడు చూసాను దానిని. చాలా భయం వేసింది.
అప్పుడు నేను కదలకుండా అలాగే నిలబడ్డాను. దారిలో వెళుతున్న ఒక మనిషిని చూశాను. అతన్ని పిలిచాను.
అప్పుడు అతదు, "నువ్వు పైకి ఎలా ఎకావో, అలా మెల్లిగా కిందికి దిగు." అన్నాడు.
ఆ తరువాత అతడు,
"గట్టిగా అరిస్తే పాము మింగేస్తుంది" అని అన్నాడు.
అప్పుడు నేను ,వేరొక పక్క గుండు చూచాను. దాని పైకి జంప్ చేశాను.
ఎలాగోలా తప్పించుకొన్నాను.
తిరిగి ఇంటికి వెళుతుండగా ,ఒక పెద్ద పాము మేకపోతును మింగని వస్తోంది.
అది చూసి పెద్దవాళ్ళందరూ తుపాకీ పట్టుకొని వచ్చారు. పాము మేకపోతును సగం తల మింగింది. తుపాకీ కాలచారు. ఆ పాము చచ్చిపోయింది.
కానీ, మేక పోతు, అప్పటికే పాము కరవడం వలన చచ్చిపోయింది.
అప్పుడు నాకు చాలా బాధ వేసింది.
***
బి. తేజ ,
9 వ తరగతి, ZP హై స్కూల్ ,తెట్టు.
11-9-2011
**
గమనిక : మామూలుగా అయితే , అక్కడ అనకొండ ఉండేది కాదు, కొండచిలువ ఉండేది..:-) అలాగే,జంప్ చేసే వాడు కాదు.. ఎగిరి దూకేవాడు!
Prabhava,Books and Beyond ! * All rights reserved.
No comments:
Post a Comment