The Hindu, 5.9.11
అది సరే కానీ, చూసే వారినిబట్టే చిత్ర"లేఖనం" ఉంటుంది!
హిందూ లో వచ్చిన పై బొమ్మ చూపించి ,
మీకు నచ్చినట్లు రాయమంటే,
ఇదుగోండి ఇలా రాశాడు, నివేద్!
****
ఒక సారి ఒక చిన్న పిచ్చుక ఉండేది.
తన అమ్మ పొద్దున్నే వెళ్ళి,
పిల్లపిచ్చుక కోసం ఒక పండయినా రొట్టయినా తెచ్చేది.
ఒకసారి అమ్మ పిచ్చుక భోజనం వెతకడానికి వెళ్ళి,
ఎన్ని రోజులయినా రాలేదు.
అప్పుడు పిల్లపిచ్చుక తన కోసం వెతుకుతూ వెళ్ళింది.
చాలా రోజులు వెతికినా అమ్మ పిచ్చుక కనబడలేదు.
ఒక రోజు హాస్పత్రి పక్కన నుండి వెళ్ళేటప్పుడు ,
కిటికీలో తన అమ్మ కనిపించింది.
"అమ్మా! అమ్మా! ఏమి అయ్యింది?" అని అడిగింది.
"నేను ఆపిల్ కంపెనీ సింబల్ చూసి ,అది ఒక ఆపిల్ అనుకొని,
ముక్కుతో గట్టిగా పొడిచాను .దాని వల్ల నా ముక్కు విరిగి పోయింది." అని చెప్పింది.
**
నివేద్ ,8 వ తరగతి ,రిషీవ్యాలీ స్కూల్ .6-9-11
Prabhava,Books and Beyond ! * All rights reserved.
No comments:
Post a Comment