ప్రభవలో రంజాన్ మరియు వినాయక చవితి సంధర్భంగా "ఆఫ్టర్ స్కూల్ విద్యార్థులు ,ఉపాధ్యాయులతో ఒక అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించడమైనది.
మొదట, సమీరా బేగం గారు రంజాన్ ప్రాసస్థ్యాన్ని సచిత్రంగా వివరించారు. ఆపై విద్యార్థుల సందేహాలను తీర్చారు. పవిత్ర ఆహారం,heavenly food, గా పరిగణించే ఖర్జూరం పండు ప్రాముఖ్యాన్ని వివరించి ,విద్యార్థులకు ఖర్జూరం పండ్లను పంచారు.
ఆపై డా.యు.వినీత, వ్యవసాయ శాస్త్రవేత్త, గారు మొదట ఖర్జూరం పండు స్వర్గం నుచి అందిన పవిత్ర ఆహారం గా ఎందుకు పరిగణించుతారో ,అందులో గల పోషక వివరాలతో వివరించారు.
ఆపై, రసాయానా లతో మిళితమైన రంగు రంగుల వినాయకుడి ప్రతిమలను మట్టిప్రతిమలను ,పిల్లలకు చూపించి , వాటి మంచీచెడులను వివరించారు. వినాయకుడి పూజకు వినియోగించే పత్రిపుష్పాల ప్రాసస్థ్యన్ని, వాటి ఔషధ గుణాలను, వాటి ని ఆయుర్వేదంలో వినియోగించిన తీరును, వారికి వివరించారు.పిల్లలలు తమకు కలిగిన అనేక సందేహాలను వారిని అడిగి తెలుసుకొన్నారు.పిల్లలందరు మట్టికి ,నీటికి హాని చేయని సహజ ముడిపదార్ధాలతో వినాయకుని ప్రతిమలను తయారు చెడానికి సుముఖులయ్యారు.
చంద్ర లత, రచయిత్రి, పండగలకు ప్రకృతికి, వ్యవసాయానికి కల సంబంధాన్ని వివరించి,” పత్రి ఫల పుష్పాలతో కళకళాడే పకృతిని పదిలంగా ఉంచుకోవాలని గుర్తుచేసుకోవడానికి ఈ పండుగలు ముఖ్యమైన సంధర్భాలు "అని అన్నారు.
మేఘన, లక్ష్మీ యశోధర, చంద్రశేఖర్, గోకుల్,ప్రణవ్, ప్రీతి, పవిత్ర,కృష్ణవంశీ...మొదలైన విద్యార్థులు తమ శ్లోకాలతో ,గీతాలతో,కవితాగానాలతో అలరించారు.
ఆ పై, పిల్లలు పెద్దలు కలిసి, సహజ ముడిపదార్థాలతో వినాయకుడి ప్రతిమలను చేసారు. ఆద్యంతమూ ఎంతో సరదాగా హయిగా సాగిన ఈ కార్యక్రమం తరువాత అందరికీ రెండు పండుగలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతివనరులను పదిలపరచమని సహజమైన పదార్థాలతో తయారు చేసిన విగ్రహాలను వినియోగించమని విజ్ఞప్తి చేసారు.
Prabhava,Books and Beyond ! * All rights reserved.
No comments:
Post a Comment