
నక్షత్రాలను కోసేస్తా
పూలబుట్టలో నింపేస్తా
భూమికి వచ్చేస్తా
నక్షత్రాలను నాటేస్తా
చెట్లకు పూసిన నక్షత్రాలను కోసేస్తా

దేవుడికి మాలగా పెట్టేస్తా
మా అమ్మకి నగలుగా ఇచ్చేస్తా
మిగిలితే ఆకాశంలోకి ఎగరేస్తా
***
మాల 5 వ తరగతి ,రిషీవ్యాలీ స్కూల్ ,2006
***
Prabhava,Books and Beyond ! * All rights reserved.
1 comment:
అంత పైకెందుకెగరెసావే మాల !
తుంచలేక పోతున్నా !
ఈ సారైనా ఎగరేసే ముందు నాకు కొన్నియ్యి !
Post a Comment