సూర్యుడు బాగా మెరుస్తున్నాడు.
ఇంతలో వర్షం కురవడం మొదలయ్యింది.
ఇంద్రధనుస్సు ఏడు రంగులతో బయటకు వచ్చింది.
కళ్ళు అప్పగించి పిల్లలు చూస్తూ ఉండి పోయారు.
ఆ ఇంద్రధనుస్సు కింద ఓ కుండలో బంగారం దొరికింది.
చినుకులు ముత్యాలలాగా పిల్లల్ను తడిపేస్తున్నాయి.
వడగళ్ళు పడ్డాయి.
అవి ఇంద్రధనుస్సును విరగకొట్టేసాయి.
అప్పుడు పిల్లలకళ్ళలోంచి
వాన చినుకులులాగా కన్నీళ్ళు వచ్చాయి.
కొన్ని చినుకులు ఆకుల మీద
మణులుగా మారిపోయాయి.
పిల్లలందరూ ప్రతి ఆకు వద్దకూ వెళ్ళి
ముత్యాలను సేకరించారు.
చెట్టు మీద నుండి వాడి తల మీద
ముత్యం పడినపుడు "ఓ" అన్నాడు భవ తారక్.
ఆ చినుకులు సూర్యుడి మీదా పడుతున్నాయి.
అప్పుడు సూర్యుడు కూడా "ఓ" అని అరిచాడు.
మేఘాలు దగ్గరగా వచ్చేసాయి.
ఆకాశం అంతా నిండి పోయాయి.
మళ్ళీ అంతా మొదలయ్యింది!
***
అమిత్ వీర, 6 వ తరగతి, రిషీవ్యాలీ స్కూలు, 2006
Prabhava,Books and Beyond ! * All rights reserved.
No comments:
Post a Comment