ఎక్కడ చూసినా మబ్బులు
హఠాత్తుగా ఉరుములు మెరుపులు
టప,టప,టప,టప ,టప
నా ముఖం మీద వాన జల్లు
ఒకటి రెండు మూడు
చూస్తూనే పెద్ద వర్షం
ఎక్కడి నుంచి వచ్చాయో
రెయిన్ కోట్లు గొడుగులు
గబగబ గబగబ పరుగులు
దూరంగా మిరప మందారం నందివర్ధనాలు
మిల మిల మెరుస్తూ వజ్రాల్లా వానచుక్కలు
దగ్గరలో ఓ చిన్న అబ్బాయి ఆశ్చర్య పడుతూ అన్నాడు.
" ఎవరు ఇలా కన్నీరు వదులుతున్నారు !"
అప్పుడే మేఘం చాటునుంచి
ఇంద్ర ధనుస్సుతో పాటు వచ్చిన సూర్యుడు
"కాగితం పడవలు చేసిస్తావా?
ఆ చిన్న అబ్బాయి చిన్న కోరిక
పక పక మంటూ నన్ను పలకరించింది వర్షం
"ఎంత మంచి రోజు !"
అనుకొంటూ వెళ్ళానిక ఇంటికి.
***
ఆకాశ్, 6 వ తరగతి, రిషీవ్యాలీ స్కూలు, 2006
Prabhava,Books and Beyond ! * All rights reserved.
3 comments:
ఎంత మంచిగుంది. చక్కటి భావాలు.
name ఆకాష్ కదా ఆకాసం గురించి వ్రాయడం గొప్పెముంది
ఇంత బాగా వ్రాయడం నిజంగా గొప్పె
అబినందనలు ఆకాష్ కి.
ఆకాశ్ తన తరుపున ధన్యవాదాలు చెప్పమన్నాడు.మీ అందరికీ.:-)
తనేమో వానలో తడిచి జలుబు తెచ్చుకున్నాట్ట..అదీ విషయం అన్న మాట!
Post a Comment