*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Tuesday, August 30, 2011

ఆహా... బొమ్మలొచ్చెను !

ఓహో... పండగొచ్చెను !
ఆహా... బొమ్మలొచ్చెను !
నాకో బొమ్మా నీకో బొమ్మ.

కళ కళలాడే రంగుల బొమ్మా?
వెల వెల పోయే ఈ మట్టి బొమ్మా?

అదామ్మా? ఇదామ్మా?
ఏదమ్మా? నీదమ్మ?


ఒట్టి దైనా గట్టిదైన
నా బుజ్జి మట్టి బొమ్మ! నునులేత ఆకులు అలములు ,
విరబూసిన పూరెమ్మలు, 
ఉండ్రాళ్ళు కుడుములు పూర్ణాలు 


పచ్చిపసుపు..  పత్తిదండా
ఎర్రెర్రని కుంకుమ ..చందనం 

తొలి పండు ...తొలి దండం.
చూశారా ఆ అందం చందం !

ఓ బొజ్జ గణపయ్య ..నీ బంటు నేనయ్యా ..
ఈ మట్టితో పుట్టి ఈ మట్టిలో కలిసే ..
నీవే నా తొలిగురవయ్యా..

జై బోలో గణపత్ మహరాజ్ కీ...!


Prabhava,Books and Beyond ! * All rights reserved.

1 comment:

shridevi said...

పిల్లల పండగ..

వినాయక చవితి

సందర్భంగా..

మీ అందరికీ శుభాకాంక్షలు !

శ్రీదేవి