*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Wednesday, August 31, 2011

పండు... పత్రి ... పండుగ


ప్రభవలో రంజాన్ మరియు వినాయక చవితి సంధర్భంగా  "ఆఫ్టర్ స్కూల్ విద్యార్థులు ,ఉపాధ్యాయులతో ఒక అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించడమైనది.
మొదట,  సమీరా బేగం గారు రంజాన్  ప్రాసస్థ్యాన్ని సచిత్రంగా వివరించారు. ఆపై విద్యార్థుల సందేహాలను తీర్చారు. పవిత్ర ఆహారం,heavenly food, గా పరిగణించే ఖర్జూరం పండు ప్రాముఖ్యాన్ని వివరించి ,విద్యార్థులకు ఖర్జూరం పండ్లను పంచారు.
ఆపై డా.యు.వినీత, వ్యవసాయ శాస్త్రవేత్త, గారు  మొదట ఖర్జూరం పండు స్వర్గం నుచి అందిన పవిత్ర ఆహారం గా ఎందుకు పరిగణించుతారో ,అందులో గల పోషక వివరాలతో వివరించారు.
ఆపై, రసాయానా లతో మిళితమైన రంగు రంగుల వినాయకుడి ప్రతిమలను మట్టిప్రతిమలను ,పిల్లలకు చూపించి , వాటి మంచీచెడులను వివరించారు. వినాయకుడి పూజకు వినియోగించే పత్రిపుష్పాల ప్రాసస్థ్యన్ని, వాటి ఔషధ గుణాలను, వాటి ని ఆయుర్వేదంలో వినియోగించిన తీరును, వారికి వివరించారు.పిల్లలలు తమకు కలిగిన అనేక సందేహాలను వారిని అడిగి తెలుసుకొన్నారు.పిల్లలందరు మట్టికి ,నీటికి హాని చేయని సహజ ముడిపదార్ధాలతో వినాయకుని ప్రతిమలను తయారు చెడానికి సుముఖులయ్యారు.
చంద్ర లత, రచయిత్రి, పండగలకు ప్రకృతికి, వ్యవసాయానికి కల సంబంధాన్ని వివరించి,” పత్రి ఫల పుష్పాలతో కళకళాడే  పకృతిని పదిలంగా ఉంచుకోవాలని గుర్తుచేసుకోవడానికి ఈ పండుగలు ముఖ్యమైన సంధర్భాలు "అని అన్నారు.
మేఘన, లక్ష్మీ యశోధర, చంద్రశేఖర్, గోకుల్,ప్రణవ్, ప్రీతి, పవిత్ర,కృష్ణవంశీ...మొదలైన విద్యార్థులు తమ   శ్లోకాలతో ,గీతాలతో,కవితాగానాలతో అలరించారు.
ఆ పై, పిల్లలు పెద్దలు కలిసి, సహజ ముడిపదార్థాలతో వినాయకుడి ప్రతిమలను చేసారు.  ఆద్యంతమూ ఎంతో సరదాగా హయిగా సాగిన ఈ కార్యక్రమం తరువాత అందరికీ రెండు పండుగలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతివనరులను పదిలపరచమని సహజమైన పదార్థాలతో తయారు చేసిన విగ్రహాలను వినియోగించమని విజ్ఞప్తి చేసారు.
 
Prabhava,Books and Beyond ! * All rights reserved.

Tuesday, August 30, 2011

ఆహా... బొమ్మలొచ్చెను !

ఓహో... పండగొచ్చెను !
ఆహా... బొమ్మలొచ్చెను !
నాకో బొమ్మా నీకో బొమ్మ.

కళ కళలాడే రంగుల బొమ్మా?
వెల వెల పోయే ఈ మట్టి బొమ్మా?

అదామ్మా? ఇదామ్మా?
ఏదమ్మా? నీదమ్మ?


ఒట్టి దైనా గట్టిదైన
నా బుజ్జి మట్టి బొమ్మ! 



నునులేత ఆకులు అలములు ,
విరబూసిన పూరెమ్మలు, 
ఉండ్రాళ్ళు కుడుములు పూర్ణాలు 


పచ్చిపసుపు..  పత్తిదండా
ఎర్రెర్రని కుంకుమ ..చందనం 

తొలి పండు ...తొలి దండం.
చూశారా ఆ అందం చందం !

ఓ బొజ్జ గణపయ్య ..నీ బంటు నేనయ్యా ..
ఈ మట్టితో పుట్టి ఈ మట్టిలో కలిసే ..
నీవే నా తొలిగురవయ్యా..

జై బోలో గణపత్ మహరాజ్ కీ...!


Prabhava,Books and Beyond ! * All rights reserved.

Friday, August 26, 2011

Being Independent



"Stay in Water !" tells my Mom.
"Stick to the ocean !"yells my Dad.
When do I get freedom from  water ?
When do I get freedom to watch movies?
When do I hoist my golden flag?
When do I sing my ocean anthem?
Tell me,
When do I get freedom,
 to do all these ?

***
D.Pranav Reddy,
15-8-2011
7th class.
Prabhava, ISE 2,Trinity College London,ESOL.

Prabhava,Books and Beyond ! * All rights reserved.

Wednesday, August 24, 2011

Prabhava ,once again!












Prabhava,Books and Beyond ! * All rights reserved.