*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Friday, September 24, 2010

అన్నం పెట్టే చేతులు

 బాలోత్సవ్ -2009 ,కథారచనలో సీనియర్ లలో ద్వితీయ బహుమతి పొందిన ఎం .అశోక వర్ధన్ కథ.

అన్నం పెట్టే చేతులు
*
పల్లెల్లోని సహత్వం ,ప్రకృతి..పట్నంలోని కృత్రిమత్వంతో కలిసి కలిసి ,కల్తీ అయ్యి ,అక్కడక్కడా కొన్ని హైబ్రీడ్ చెయ్యని చెట్ల రూపంలో ..సహజంగా కనిపిస్తోంది.
పట్నం నిండా వేగానికి బిజీకి అలవాటు పడ్డ దబ్బున్న  బిజినెస్ మ్యాగ్నెట్లే  
ఎక్కువ. అక్కడక్కడా రామయ్య లాంటి చేనేత వృత్తుల వాళ్ళు ,సహజత్వం ప్రాకృతికతత్వం కలిపినట్లు కనిపిస్తారు.
 అది రాం నగర్ కాలనీ.సర్వం బంగ్లాలమయం.
అక్కడక్కడా ,చిన్ని చిన్ని ఇళ్ళల్లో ,రామయ్య లాంటి చేనేతవృత్తుల వాళ్ళు.
ప్రతి రోజూ రామయ్య తన ఇంటి కిటికీలొ నుండి ఎత్తుగా,పాలరాతి మహల్ లా కనబడే మోహన్ రావ్ ఇంటిని చూస్తూ ఉండేవాడు.'ఎప్పటికైనా అలా ఉంటే బాగుండు  'అనుకొనేవాడు. అయినా వాస్తవం తెలిసిన మనిషి. కలలు కంటూనే ,ఒక పక్క తన పని తాను చేసుకొంటాడు. పని చేయక పోతే పూట గడవదు.తన మీద ఆధారపడే భార్య ,కూతురు. చిన్ని ఇల్లు చింతలు లేని ఇల్లులా ..ఉన్న దాంట్లో కాపురాన్ని నెట్టుకొస్తున్నారు.చదువు విలువ తెలుసుకొని కూతురు ,విద్య, ని చదివిస్తున్నారు .. పెద్ద బడిలో.
ఇక, మోహన రావు కూతురు మైథిలి ."డాడీ ! నాకు వాచ్ కావాలి " అన్న మరుక్షణం మైథిలి చేతికి వాచ్ ఉంటుంది. మోహన రావు కి కూతురంటే అంత ఇష్టం మరి.కూతురి కోసం ఎంత పెద్ద మీటింగ్స్ అన్నా వదులుకొని వస్తాడు. తల్లి లేని లోటును తీర్చడానికే ఇదంతా.
ఏదేమైనా ,మోహన రావు మనిషి. మామూలు ధనవంతుడు.
అందరు ధనవంతుల్లాంటి వాడే
విద్య, మైథిలి మంచి స్నేహితులు .ఒకే బడి. ఇళ్ళు పక్కపక్కనే ఉన్నా, మోహనరావు మైథిలిని విద్యతో కలవనివ్వడు. "ఏంటీ ,సిగ్గులేకుండా బికారీ వాళ్ళతొ "అంటూ లోపలికి తీసుకొచ్చేవాడు. కూతురితో విషయంలో నో కాంప్రమైజ్ .
"వాళ్లకూ మనకూ ఏంటి తేడా డాడీ?"అంటూ మైథిలి అమాయకంగా అడిగే ప్రశ్నకి నో ఆన్సర్.

***
 రామయ్య రోజు మగ్గంతో పని చేస్తున్నాడు, "ఇందిరా,ఇందిరా" అంటూ భార్యను కేకేసాడు.
"ఏంటండీ?" అంటూ వంటగదిలో నుండి వచ్చింది ఇందిర.
""ఈ రోజు ఏం జరిగిందో గుర్తుందా?"
"అయ్యో, ఇంకా అదే పట్టుకు వేలాడుతున్నారే, అన్నయ్య వచ్చి , మగ్గం నేసిన తరువాత ఎలాగు ఉపయోగంలేదు ధరలు మండివిషయం . ఎక్కడోఒక చోట పనిలోకి కుదురు.'అన్నాడుగా.అయినా దానికి తొందరేం వొచ్చింది?"
"అదేనే ,మనకు తెలిసిన విద్యల్లా ఇదే.ఈ రెండు చేతులూ ఉన్నంత కాలం నేను మీ ఇద్దరినీ కంటికి రెప్పల్లా కాపాడుకొంటా. దానికి ఈ మగ్గం ఉంది. కానీ, బావ చెప్పే మాటల్లో వాస్తవం కనిపిస్తోంది."
"మీరు ముందు ఆ ఆలోచన ఆపి పని చేయండి. సాయంకాలానికి అనసూయమ్మకి చీర నేసి అమ్మాలి. అయినా,మన అదృష్టం బావుంది కాబట్టే ఇంత బాగా ఉన్నాం.పూటకి గతి లేని వాళ్ళ కంటే మనం చాలా మెరుగు" అంటూ లోనికెళ్ళింది ఇందిర.
అంతలో " నాన్నా" అంటూ విద్య వచ్చింది.గలాగలా తననుకొన్నది ,తనకు తెలిసింది ,బడిలో జరిగింది ..అలా అలా చిట్టి చిట్టి మాటలతో చెప్పింది.
"విద్యా ఇందిరా , మీ ఇద్దరూ నా రెండు కళ్ళు మీకు ఏ కష్టం రానివ్వను .విద్యమ్మా, నిన్ను బాగా చదివించి మంచి డాక్టర్ని చేస్తా. "
"సరే నాన్నా ,నేను డాక్టరౌతా !" అని చెంగు చెంగున గెంతులేస్తూ లోనికెళ్ళింది.
***

మైథిలి ఇంట్లో ఉంది. రోజూలాగా.విద్య కంటే వెయ్యిరెట్లు డబ్బున్నా,తను ఒంటరే.ఇంట్లో దాదాపు లోటు తీర్చడానికి యంత్రాలున్నా,మనుషుల్లేరు. నాన్న అప్పుడప్పుడూ ఉంటాడు.
విద్య వద్దకెళ్దామని అనుకొన్నా అది కుదిరేది కాదు. కానీ,ఒక రోజు కుదిరింది.
మైథిలి ఇంకా ఆడుతుంది. సాయంత్రం 4 గంటల్కి. గోడకేసి బాల్ కొట్టి ,మళ్ళీ గోడతోటే ఆడుతోంది. ఆయాలతో ఆడాలంటే చిరాకు. అందుకే చుట్టూ చూసింది. ఎదురుగా చిన్న ఇల్లు. రోజూ కనిపించేదే.నేడు తలుపులు తెరుచుకొన్నట్లు అనిపిణ్చింది.విద్య ఇల్లది.
మగ్గం నేస్తూ రామయ్య రెస్ట్ తీసుకోవడానికి కాసేపు ఆగాడు.కిటికీ లోనుండి బంగ్లాలో మైథిలి కనిపిస్తోంది.
అలా కాసేపు ఉక్క పోసే ఇంట్లో నుండి గాలికి బైటికి వచ్చాడు.విద్య కోసం మైథిలి వద్దామనుకొంది. బాల్ గోడ బయటికేసింది.వాచ్మాన్ కళ్ళు కప్పి ,బైటకొచ్చింది. రోడ్డుదాటి,ఉరుక్కుంటూ స్వేచ్చగా వదిలిన పక్షిలా బయటకొచ్చింది. కానీ,రామయ్య కళ్ళకు పాపతో పాటూ వేగంగా వస్తున్న కారు కనిపించింది. కారు వాడు చూసుకోవడం లేదు.పాప పరుగు. రామయ్య కాళ్ళు అప్రయత్నంగా కదిలాయి.
***
ఆ రోజు జిల్లా ఎడిషన్లో మొదటి హెడ్ లైన్.
"తృటిలో తప్పిన ప్రమాదం.బిజినెస్ మాగ్నెట్ కూతురికి తప్పిన అపాయం.చేనేత కార్మికుడికి స్వల్ప గాయాలు.చేతులు విరిగి పోయి ఆస్పత్రిలో చేరిన రామయ్యానే చేనేత కార్మికుడు"
ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక గది.
ఇందిర ఏడుస్తూ ఉంది. రామయ్య ముఖం దీనంగా ఉంది. మాట్లాడాలంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు.
పక్కనే చేతికి వేసిన బ్యాండేజీలను తాకుతున్న విద్య.
" యాం వెరీ సారీ! మాప్రయత్నం మేం చేశాం.కాస్త ముందుగా వచ్చి ఉండాల్సింది. చేతులు ఇక పని చేయవు. అయినా బాధ పడకండి.కృత్రిమమైనవి తయారు చేయవచ్చు" అన్నాడు డాక్టర్."ఎంతవుతుందండీ?"ఇందిర ప్రశ్న.
"లక్షన్నర అవ్వచ్చు .అంతే." డాక్టర్ వెళ్లి పోయాడు. తిరిగి చేతులు వస్తాయన్న ఆశ కూడా వెళ్ళి పోయింది.
"ఇక మీరు పనెలా చేస్తారండీ.మన జీవితాలు ఆగిపోయిట్లే . మన లాంటి  చేనేత వృత్తుల వారికి చేతులే కదా కావాలి.అన్నాయ్య కూడా చెపుతూనే ఉనాడు. అయినా, ఎవర్నో రక్షించబోయి మీరు వెళ్ళడమేమిటి? మళ్ళీ ఏడుస్తూ అంది ఇందిర.
"ఔను, మన జీవితాలు ఆగి పోయాయి." అని తల దించుకొన్నాడు రామయ్య.
"ఏమండీ, మీరు కాపాడింది పాపనేగా, ఎలోగోలా నేను అయ్యని అడీగి డబ్బులు తీస్కొస్తా.మనకి దారి లేదు" అని కాస్త తేరుకొని చెప్పింది ఇందిర.
అంతలోనే మోహన్ వచ్చారు. ప్రెస్ వాళ్ళతో .ఫోటోల వాళ్ళతో వచ్చి రామయ్య చేతిలో పూల బొకే పెట్టి ,స్మైల్ ఇచ్చి, ఫోటో దిగాడు.
 "రామయ్యా, చాలా థ్యాంక్స్.నా కూతుర్ని కాపాడావు." అన్నాడు మోహన్.
మొట్టమొదటిసారి అతను రామయ్యతో మాట్లాడాడు.
కలగజేసుకుంది ఇందిర.
"అయ్యా ,అయ్యా..ఆయన చేతులు పడిపోయాయట. చేతులు కదపలేడట. మీ పాపను రక్షించబోయే కదా,చేతులు పోగొట్టుకుంది .అయ్యా అయ్యా ! ఆపరేషన్ కి లక్షలౌతాయట!" అని మాట్లాడుతూ ఉండగానే,
" సరే సరే చేయించండి  .అన్నిటికంటే ప్రాణాలు ముఖ్యం. అవి దక్కాయి గా.మరీ చేతులు  కావాలనుకొంటే అలానే చేపియ్యండి. మరో  విషయం .త్వరగా చేయించకపోతే మరీ కష్టమౌద్ది. వీలున్నంత త్వరగా చేయించండమ్మాఓకే ," అంటూ వెళ్ళి పోయాడు.
ఆమె ఏమడుగుతందో తెలుసు .అందుకే ఇలాగ.
"మన జీవితాలు ఇంతేనా.మన గతి ఇంతేనా .నాకు చేతులు లేనప్పుడు నేను జీవించి అవసరం లేదు. మనకు అన్నం పెట్టే మగ్గం ఇప్పుడు పని లేకుండా పోతుంది. దేవుడా! ఇప్పుడెలా! లక్షన్నరట,ఎలా తేవాలి ? నేను చనిపోవడమే శరణ్యం," అంటూ ఆవేదన చెందాడు రామయ్య.
" డబ్బున్నోళ్ళతా అందరే.సిగ్గూ లజ్జా కోశానా లేదు.మనిషికి సాయం చేయాలన్న ఆలోచనా లేదు. ఆడి కూతురు సచ్చుంటే తెలిసొచ్చేది " అంటూ నిప్పులు చెరిగింది ఇందిర.
"పాపం.. పాపనేమీ  అనకు. వాడినీ వాడి డబ్బునీ ఏదో ఒక రోజు ప్రపంచమే ఛీ కొడ్తది.అప్పుడు వాడికి తెలిసొస్తది." అంటూ కోపంతో అన్నాడు రామయ్య.
"మనం మన జీవితాలు . ప్రపంచం గవర్నమెంటోళ్ళు మారితే తప్ప ,మన జీవితాలు బాగుపడవు.అయ్యో దేవుడా ," అంటూ  బాధ పడింది ఇందిర.
*
నిజమే ఇది. ఆలోచించి మార్పులు చేయకుంటే రామయ్య లాంటి వాళ్ళెందరో రాలిపోతారు.
*
ఎం .అశోక వర్ధన్,పదోతరగతి ,నవభారత్ పబ్లిక్ స్కూల్, పాల్వంచ
*
Prabhava,Books and Beyond ! * All rights reserved.

1 comment:

Vinay Datta said...

A tenth standard student writing with such high standards...great!