జూనియర్ల విభాగంలో ప్రోత్సాహక బహుమతి గెలుచుకొన్న
చాందిని కథ.
ఏమనుకొంటే అది
అనగనగా ఒక రైతు.ఆ రైతు కి ఒక కూతురు ఉంది.
అతడు మగ పిల్లవాడు కావాలని కోరుకున్నాడు. కానీ,ఆ రైతుకి ఆడబిడ్డ పుట్టిందని అసహ్యం. ఆమెను అతను ముట్టుకోను కూడా ముట్టుకోలేదు.
ఆమె పేరు లక్ష్మి అని వాళ్ళ అమ్మ పెట్టింది.ఆమె రోజు బడికి వెళ్ళేది.వాళ్ళ అమ్మానాన్నలు పొలములోకి వెళ్ళే వారు.ఆమె అంటే వాళ్ళ ఊళ్ళో వాళ్ళకి కూడా ఇష్టం లేదు.
ఆమె చక్కటి పుత్తడిబొమ్మ. ఆమె తరగతిలో ఎప్పుడూ ముందుడేది.కాని ఆమె ఎవ్వరికీ ఇష్టం లేదు.
ఆమె రోజు కుంగిపోయేది.
ఆమె ఒక రోజు బాగా ఎండకొడుతుందని ఒక చెట్టుకిందికి వచ్చింది. ఆ చెట్టు కూడా ఆమెను మెచ్చడం లేదు. అప్పుడు ఆమె ఒక దేవత ప్రత్యక్షమైంది. ఆ దేవత తనకు ఏ వరం కావాలో కోరుకోమంది.
ఆమె ఎవరికీ లేని ఒక అద్బుత శక్తి అది ఎవరికీ లేనిది 'నేను ఏమనుకొంటే అది జరగాలనీ "కోరుకుంది.
దేవత ఆమె కోరిన వరాన్ని ఇచ్చి అదృశ్యమైంది.
ఆ శక్తితో తనకేమి చేయాలో తెలియడం లేదు.
ఆ ఏడాది వానలు పడడం ఆగిపోయింది.అప్పుడు వాళ్ళ పొలం అప్పుడు వాళ్ళ పొలం ,ఆ ఊళ్ళో వాళ్ళ పొలాలు అన్నీ ఎండి పోయాయి.
అప్పుడే ఆ అమ్మాయికి ఆలోచన తట్టింది.
"నన్ను ఎలాగో అందరూ తిట్టుకుంటున్నారు.నేను పాఠాల్లో చదువుకొనే దేమిటీ ?ఉపకారికి అపకారం చేయరాదు .చేసినచో వారికి మళ్ళీ ఉపకారం చేయవలెను కానీ అపకారం చేయరాదు.వాళ్ళు నన్ను మెచ్చుకొంటారు కావచ్చని, ఆమె తన కున్న శక్తితో ,వర్షాలు కురిపించింది.
ఆ తరువాత ఊళ్ళో వాళ్ళందరి పంటలు పండాయి .
విషయం తెలిసిన తరువాత ,ఆ అమ్మాయిని అందరు మెచ్చుకొన్నారు.
*
రచన : బి. చాందిని, 7 వ తరగతి,,కాశీ బుగ్గ, వరంగల్ .
బొమ్మ : క్షితిజ , 1వ తరగతి ,,గ్రీష్మప్రభవ -2010, నెల్లూరు.
Prabhava,Books and Beyond ! * All rights reserved.
1 comment:
Can u please post the otheraward winning stories of the year too
Post a Comment