వాసిరెడ్డి నవీన్ గారు అతిథులను అహుతులకు పరిచయం చేసి, వేదిక మీదికి ఆహ్వానించారు.
డా. మంజులత గారు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
.డా. మంజులత గారు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
డా.ఆనంద స్వరూప్ గారు పుస్తకాన్ని ఆవిష్కరించారు .
శ్రీమతి అబ్బురి చాయా దేవిగారు తొలిప్రతిని అందుకొన్నారు.
డా. ఆనంద స్వరూప్ గారు: మడతపేజీ నుంచి వ్యవసాయానికి సంబందించిన అంశాల్నుంచి
నేను కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకొన్నాను.
డా. మంజులత గారు : చంద్ర లత ప్రకృతి గురించి చెప్పినా పిల్లల గురించి చెప్పినా భాషా శైలి, తనదైన ముద్ర ఉన్నది.వీటన్నిటిలోను స్వాభావికత పదిలం చేసుకోవాలని గట్టిగా చెపుతారు.
శ్రీమతి అబ్బూరి ఛాయ దేవి గారు: చంద్రలత ఎప్పుడు ఒక సరికొత్త అంశంతో మన ముందుకు వస్తుంది. ఈ మారు ఈ బ్లాగుటపాల సంకలనంతో.కొత్తగా బ్లాగులు రాయాలనుకొనే వారికి ఎలా రాయ వచ్చునో దీనిని చదివి తెలుసుకోవచ్చు. క్లుప్తంగా,లోతుగా ,సామాజిక స్పృహతో రాసిన టపాలివి.
శ్రీమతి కొండవీటి సత్యవతి గారు: వర్షం పడినప్పుడు ఆ అనుభవాన్ని పంచుకోవాలనుకొని రాసాం అనుకోండి ఎవరు ప్రచురిస్తారు ? బ్లాగుల్లో మనకు నచ్చినవి రాసుకొని నలుగురితో పంచుకొనే స్వేఛ్ఛ ఉంది.
వీవెన్ గారు: బ్లాగు సంకలనాలతో ఒక పుస్తకం రావడం ఇదే మొదలు .
మడత పేజీ పుస్తకం , e- ప్రపంచానికి సాహిత్య ప్రపంచానికి ఒక లంకె అవుతుందనుకొంటాను.
7 comments:
బ్లాగు టపాలతో ఒక పుస్తకం రావడం ప్రయోగాత్మకం. మడతపేజీ పుస్తకం గా వెలువడటం ఆనందకరం. అభినందనీయం.
"బ్లాగు సంకలనాలతో ఒక పుస్తకం రావడం ఇదే మొదలు." -వీవెన్
2008 లో సాహితీ పరులు, పాత్రికేయులతో సరసాలు అనే పుస్తకం వెలువడింది. నా ప్రపంచం బ్లాగులో వచ్చిన టపాలతో ఈ సంకలనం వచ్చింది. "సాహితీపరులతో సరసాలు" ఈ పరంపర లో వచ్చిన తొలి వ్యాసం ఇక్కడ చూడవచ్చు.
ఈ పుస్తక వివరాలు ఇక్కడ చూడవచ్చు.
చావా కిరణ్ పోతీ. కాం సహకారం తొ రెండు పుస్తకాలు ప్రచురించారు. అయితే అవి Books on Demand పద్ధతి లో వెలువరించినవి. ఈ పుస్తకాలు ప్రత్యేక వర్గంగా పరిగణించాలి.
ఆన్‌లైన్ పబ్లిషింగ్ కూడా పబ్లిషింగేనని అంగీకరిస్తే బ్లాగుటపాల సంకలనాలలో మడతపేజీ మొదటిది కానే కాదు. నాకు తెలిసినంతవరకు కొత్తపాళీగారి బ్లాగుటపాల సంకలనం (పి.డి.ఎఫ్) మొట్టమొదటిది. రెండోది తాడేపల్లిగారి అనాహతం-౧ (పి.డి.ఎఫ్). అలా చూసినప్పుడు మడతపేజీ మూడోది అవుతుంది. నా మాట నమ్మకపోతే ఈ పేర్లతో గూగుల్ సర్చ్ చేసి చూడండి.
మడతపేజీ మొట్టమొదటి బ్లాగుటపాల సంకలనం కాదనే విషయంలో కుమార్ దత్తా గారితో ఏకీభవిస్తున్నాను. కానీ కొత్తపాళీగారి సంకలనం కూడా మొదటిది కాదు. దానికంటే ముందు ఇంకో రెండు వచ్చాయి. ప్రవీణ్ గార్లపాటిగారు సంకలనం చేసిన బ్లాగు పుస్తకం (పి.డి.ఎఫ్.) ఇన్నయ్యగారి టపాల సంకలనం కంటే ముందు అంతర్జాలంలో వెలువడింది. అసలు అదే అన్నింటికన్నా మొదటిది. దాన్ని తెలుగుబ్లాగు గూగుల్ గుంపు ఫైళ్ళలో చూడవచ్చు. ఆ తరువాత తెలుగు బ్లాగింగు పితామహుడైన చావా కిరణ్ కుమార్ గారి టపాల సంకలనం వెలువడింది. ఇహపోతే తాడేపల్లిగారి అనాహతం-౧ ఈ (2010) సంవత్సరారంభంలో వెలువడింది. అందుచేత ఈ టపా-సంకలనాలను ఈ క్రింది సమయక్రమం (chronological order) లో అమర్చవచ్చు ననుకుంటా.
౧. ప్రవీణ్ గార్లపాటిగారి బ్లాగుపుస్తకం
౨. చావా కిరణ్ కుమార్ గారి టపాల సంకలనం
౩. కొత్తపాళీ (నారాయణస్వామి) గారి టపాల సంకలనం
౪. నరిసెట్టి ఇన్నయ్యగారి పాత్రికేయుల సరసాలు
౫. తాడేపల్లిగారి అనాహతం-౧
౬. మడతపేజీ
మీరు అందించిన సమాచారానికి ధన్యవాదాలు.
ఇది అతిథుల అభిప్రాయమే కానీ రచయితది గానీ ప్రచురణకర్తలది కానీ కాదని సవినయ మనవి.
ఇది కేవలం ఒక పుస్తకావిష్కరణ సమాలోచన , ఒక స్నేహపూర్వక సమావేశం మాత్రమే.
బహుశా ,అతిథుల దృష్టికి వచ్చిన మొదటి బ్లాగు రచనల సంకలనం ఇదే అయి ఉండవచ్చును.ఈ రూపేణా ఇప్పటికే అచ్చయిన బ్లాగుపుస్తకాల విశేషాలు తెలిసాయి.ఆయా రచయితలకు అభినందనలు.
ఇక, చావా కిరణ్ గారు కూడా ఆ పూట అక్కడ ఉండడం విశేషం.
మరొక మారు,
మీరు అందించిన వివరాలకు ధన్యవాదాలు.
ప్రభవ
౧. ప్రవీణ్ గార్లపాటిగారి బ్లాగుపుస్తకం
౨. చావా కిరణ్ కుమార్ గారి టపాల సంకలనం
౩. కొత్తపాళీ (నారాయణస్వామి) గారి టపాల సంకలనం
౪. నరిసెట్టి ఇన్నయ్యగారి పాత్రికేయుల సరసాలు
౫. తాడేపల్లిగారి అనాహతం-౧
౬. మడతపేజీ
పై పుస్తకాలలో అచ్చులో, సాంప్రదాయ పద్ధతిలో (book on demand కాదు, p.d.f కాదు), పుస్తకరూపంలో మొదటగా వచ్చింది నరిసెట్టి ఇన్నయ్యగారి పాత్రికేయుల సరసాలు.
సదస్సులో 2007 లో ప్రవీణ్ చేసిన తెలుగు బ్లాగుల సంకలనాన్ని ప్రస్తావించాను (నేను కవర్ డిజైన్ చేసిన దాన్ని ఎలా మర్చిపోగలను).
అలానే, జాన్ హైడ్ కనుమూరి చేసిన "అమ్మ" గురించిన టపాల సంకలనాన్ని కూడా ప్రస్తావించాను. అన్నట్టు, ఇక్కడ వ్యాఖ్యానించిన వారందరూ దీన్ని మర్చిపోయారు. :)
అలానే ఇతరత్రా సంకలనాలూ, ప్రయత్నాలు కూడా జరిగాయని చెప్పాను.
నాకు గుర్తున్నంతవరకూ ముద్రణా రూపంలో ఒక పుస్తకంగా మడతపేజీనే మొదటిదని చెప్పాను. :)
Post a Comment