*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Sunday, September 12, 2010

ఎలాగో,ఆ రాత్రి !

 ఒక రోజు ఉదయం .
వాతావరణం చలిగా ఉంది.
మంచు వర్షంలా పడుతున్నది.
అంతకు ముందు రోజు మా స్కూలు ఉపాధ్యాయులు మరుసటి రోజు ఒక పెద్ద అడవికి పరిశోధనకు వెళ్ళాలనీ నిర్ణయించుకొన్నారు.
అందువలన,
 ఆ రోజు ఉదయం నేను లేచేసరికి ,టైం 6 గంటలు అవుతోంది.నేను త్వరగా , రెడీ అయ్యి స్కూల్ కు వెళ్ళే సరికి , నా స్నేహితులు అందరూ వచ్చేశారు.మేము వెళ్ళే బస్సు పది గంటలకు వస్తుంది.
మేమందరం చాలా ఆనందంగా ఉన్నాం. కానీ, చాలా చలిగా ఉన్నది.
మా పాఠశాల అంతా హడావుడిగా ఉన్నది. అక్కడ తోటలో ఉన్న పూలు కూడా చలికి విచ్చుకోలేదు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా వచ్చారు.
అందరు వారికి కావలిసిన అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలను సమకూర్చుకొని ,ఎంతో ఆత్రుత తో బస్సు   కోసం వేచి ఉన్నారు.
బస్సు వచ్చింది. అందరు వెళ్ళి బస్సులో కూర్చున్నారు.
బస్సులో అందరు జోక్స్ వేస్తూ,అడవికి వెళ్ళే మార్గం గురించి మాట్లాడు కొంటూ ,పాటలు పాడు కొంటూ సరదాగా వెళ్ళాము. ఇక , అడవిలో ప్రవేశానికి కొంత దూరంలో బస్సు ఆగింది.
అక్కడి నుంచి  నడిచి వెళ్ళాలి.
అందరూ ఆ అడవిలో గల పచ్చని చెట్లు ,చల్లని గాలి ,ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అనుభవిస్తూ ,పరిశోధనలు జరుపుతున్నారు.
అలా వెళుతుంటే, అక్కడ ఒక పెద్ద జలపాతం కనిపించింది.అక్కడ, పైనుంచి దూకే నీరు ,ప్రక్కన ఉన్న పూలు అందరినీ ఆకర్షించాయి.
అలా వెళుతుండగా,నేను పక్షులను చూసుకొంటూ ,నా దగ్గర ఉన్న బ్యాగుతో సహా నడుచుకొంటూ ,నాకు తెలియకుండానే ఒక దీవిలోకి వెళ్ళి పోయాను.
అప్పుడు నాకు చాలా భయమేసింది.
నా బ్యాగులో ఉన్న మూడు వస్తువులను ఒకసారి తడిమి చూసుకొన్నాను. అవి కత్తి,లైట్,బట్టలు.
నాకు బాగా ఆకలి వేస్తుంటే , ఏమైనా దొరుకుతున్నదా అని వెతుకుతూ పోయాను.
అక్కడ ఉన్న చెట్లో పండ్లు కనిపించాయి. ఉన్న కత్తితో ఆ పండును కోసి తిన్నాను. 
అలాగే, ముందుకు వెళుతుండగా ,అంతా నిశ్శబ్దంగా ఉన్నది.సూర్యాస్తమయం అయింది.చీకటిగా ఉన్నది.నక్క కూతలు వినబడ్డాయి.పువ్వులు సువాసనలు వెదజల్లాయి.
ఆ చీకటిలో నా దగ్గర ఉన్న లైట్ తీసుకొని ,ఒక రాయి మీద కూర్చున్నాను. ఎలాగో,ఆ రాత్రి గడిచింది.సూర్యుడు ఉదయించాడు.పక్షులు కిలకిలలాడాయి.
నాకు అప్పుడు ఒక ఆలోచన వచ్చింది.
దిక్సూచిని తయారు చేసుకొన్నాను.దాని సాయంతో ఆ దీవిని దాటాను. అప్పుడు నా స్నేహితులు నన్ను  వెతుకుతూ వచ్చారు.
అందరినీ కలిసి ఇంటికి వెళ్ళిపోయాను.


*
రచన : పి.అశ్విని ,పదవ తరగతితెట్టు. 22-8-2010
బొమ్మ:  సుమన్విత ,గ్రీష్మ ప్రభవ,  2010, నెల్లూరు



Prabhava,Books and Beyond ! * All rights reserved.

6 comments:

భావన said...

చాలా బాగుంది కధ. అందరు అలానే ధైర్యం గా వుండాలి అశ్విని.

anu said...

nice story ashwini

Unknown said...

chala bagundi

Unknown said...

chala bagundi

Unknown said...

good one

చక్రవర్తి said...

హమ్మ పిల్ల.. గడుగ్గాయే.. కానీ పిడుగనిపించుకుంది. నాకు ఈ కధలో ఈ అమ్మాయి సూక్ష్మదృష్టి నాకు నచ్చింది. కధనా చాతుర్యం నాకు నచ్చింది. పిల్లే కదా అని ఊరుకుంటే పిడుగై కూర్చునేట్టట్టుంది చూడబోతే.. ఏమైనా సరే ఆ వయస్సుకి బాగా వ్రాసింది. ఇంత వయసు వచ్చి నాకు కొన్ని సార్లు వ్రాయడానికి మాటలు రావు అలాంటిది పదవ తరగతి చదువుతున్న చిన్నారి ఇలా వ్రాసిందంటే మెచ్చుకోదగ్గ విషయమే.

భేష్ అశ్విని.. ఇలాగే మరికొన్ని వ్రాస్తావని ఆశిస్తున్నాను.