*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Thursday, September 2, 2010

నందనుడు - చిలుక

  బాలోత్సవ్ -2009 ,కథారచన లో
  జూనియర్ లలో ద్వితీయ బహుమతి పొందిన
  సందీప్ కథ.

  చిత్రం:  హల ,(7 ఏళ్ళు),  గ్రీష్మ ప్రభవ,  నెల్లూరు.9-5-2010




నందనుడు - చిలుక


నందన వనంలో నందనుడు అనే ఒక పుణ్యపురుషుడుండేవాడు. అతనికి ఒక రోజు తన జీవితంలో ఊహించని తరుణం ఎదురయ్యింది.నందనుడి మంచితనాన్ని ,నిజాయితీని మెచ్చి ఆకాశవాణి ప్రత్యక్షమై ,"నీకేం కావాలో కోరుకో " అంది.
అపుడు ఆ నందనుడు ఆకాశంలో విహరించే పక్షిని చూసి , 
"ఆ పక్షిలా నాకు రెక్కలు రావాలి ,నేను                                                                  
ఆకాశం లో అలా తేలి పోతూ ఉండాలని" కోరాడు.

అపుడు ఆ ఆకాశవాణి , " నీవు రెక్కలు కావాలనీ ,పక్షిలా ఎగరాలనే ఎందుకు కోరుకున్నావు? ధన రాశులు వజ్రవైడూర్యాలు వంటివి కోరుకొంటావు అనుకొన్నాను ఇంతకీ నువ్వు ఇలా కొరుకోవడానికి కారణం ఏమిటి?"అని అడిగింది.

అపుడు నందనుడు ," ధనరాశులతో వజ్రవైడూర్యాలతో భవంతులు కట్టుకోవచ్చు .
ధనవంతులవ్వచ్చు .ఆకాశంలోను  విహరించవచ్చు.కాని అది విమానాల ద్వారా.ఈ విధంగా మనిషి జీవితంలో ఎన్ని ప్రదేశాలు తిరిగినా ,ఆకాశంలో స్వేచ్చగా విహరించే పక్షులు పొందిన ఆనందాన్ని పొందలేము. నాకు పక్షులన్నా ,అవి నింగి మర్ధనంలో కేరింతలు కొడుతూ విహరించడమన్నా చాలా ఇష్టం. అందుకే నేను ఈ కోరికను కోరుకున్నాను" అని జవాబిచ్చాడు.

అతని సమాధానానికి పరవశురాలై ,ఆకాశవాణి అతను అడిగిన వరం ఇచ్చి మాయమై పోయింది.
ఆ వరాన్ని పొందిన నందనుడు ఆనందంలో మునిగిపోయి ,తనకు వచ్చిన రెక్కలను ఒక్కసారిగా ఆడించాడు.మరో సారి ఆడించి ,ఆకాశం వైపు చూశాడు.
కానీ, అతను నిల్చున్న చోటనే ఉండిపోయాడు.
అతనికి ఏమీ అర్ధం కాలేదు.

రెక్కలు ఉన్నాయి కానీ ఎగరలేక పోతున్నాడు .అని అర్హ్దమై ,విచారించక ప్రయత్నించాడు. ప్రయత్నిస్తూనే ఉండగా, ఒక రోజు పైకి ఎగిరాడు.రెక్కలు ఆడించే కొద్దీ ఎగురుతూనే ఉన్నాడు.
అపుడు అతని ఆనందానికి అవధులు లేవు. 
ఆ క్షణంలో ఆకాశవాణి ప్రత్యక్షమై,
" నీవు సాధించావు. నీవు రెక్కలు కోరుకొన్నావు,కల్పించాను. కానీ, ఎగరలేక పోవడంతో ,నిరాశ చెందక ప్రయత్నించావు. అందుకనే , నీ కోరికను నీవే సాధించావు" అని చెప్పి చివరలో ఇలా అంది.
"ఇలా మనుషుల్లో ఎగిరే శక్తి మనుషులలో ఎవరికీ లేదు.ఒక్క నీకు తప్ప. నీవు ఈ అద్బుతశక్తిని దుర్వినియోగం చేయకు." అని అదృశ్యమైంది.
అప్పుడు నందనుడు సంతోషంతో ఆకాశం లో కేరింతలు కొడుతున్నాడు.
ప్రపంచంలో అందమైన ప్రదేశాలు ,వింతలువిడ్డూరాలు అన్నీ చూశాడు.ఆనందించాడు. మనుషులెవరికీ లేని ఈ శక్తిని వినియోగించుకొని ప్రపంచం మొత్తం చుట్టేసి వచ్చాడు.
ఈ తరుణం లో అతనికి ఒక ఆలోచన వచ్చింది.
"ఈ అద్బుత శక్తితో ఇతరులకు సాయం చేద్దాము" అని.
దీన్నే ఆచరణలో పెడుతూ ఉన్నాడు. చాలా రోజులకు ఒక వేటగాడి దెబ్బ తిన్న చిలుక కనబడింది.
ఆ చిలుక వద్దకు వెళ్ళి కాపాడడానికి ప్రయత్నించాడు.
అప్పుడు ఆకాశ దేవత కనిపించి  గంగాజలంలో ముంచితే ఆ చిలుక ప్రాణాలు నిలుస్తాయని చెప్పగా , నందనుడు ఆ చిలుకతో గంగానదికి బయలుదేరాడు.
 దారిలో చిలుక అంది,"మీ మనుష్యులలో ఆ వేటగాడి వంటి చెడ్డవాళ్ళు నీ వంటి మంచి ఉంటారని తెలిసింది"
నందనుడు చిలుకను గంగాజలంలో ముంచాడు . చిలుక ప్రాణం నిలిచింది.
ఆ రోజు నుండి నందనుడు చిలుక మంచి స్నేహితులయ్యారు.
అలా వారి జీవితం ఆనందంగా గడిచింది.
***

నీతి:
1. నీ ఆశయ సాధనలో వేయిసార్లు విఫలమైనా ప్రయత్నించు.
2. నీ వద్ద ఉన్న శక్తితో నీవు మాత్రమే సంతోషపడకు నీ తోటి వారికి సహాయం చేసినపుడే , నీ జీవితానికి సార్ధకత 
వస్తుంది.

***

కె.సందీప్ రెడ్డి ,  7 వ తరగతి, ప్రగతి స్కూల్,సారపాక ,14-11-2009


***

Prabhava,Books and Beyond ! * All rights reserved.

5 comments:

పరిమళం said...

very nice!

Prabhava said...

Thank You.

lalithag said...

ఈ కథ చదవగానే బలే అనిపించింది.
ఏడేళ్ళ అమ్మాయి రాసిందంటే ఏమనాలో తెలియడం లేదు.
ఏడో తరగతి వాళ్ళు కూడా, ముఖ్యంగా తెలుగులో చక్కగా రాసిన కథలు నేను ఇంతవరకూ చూసిన వాటిలో ఎక్కువ లేవు. భాషా, ఆలోచనను వ్యక్తీకరించిన తీరు, కథ సాగిన విధానం చాలా బావున్నాయి. అభినందనలు చిన్నారి హలకు.

Prabhava said...

లలిత గారు,
కథ రాసిన సందీప్ ,బొమ్మ వేసిన హల తరుపున ధన్యవాదాలు.

lalithag said...

పేరు, వయసు పొరబడ్డాను. సారీ.
మళ్ళీ ఒక సారి మంచి బొమ్మ వేసిన హలకూ, మంచి కథ రాసిన సందీప్ కూ అభినందనలు.