కేశవపల్లి గ్రామంలో రంగయ్య అనే వ్యక్తి ఉండే వాడు.
అతనికి ఆ చుట్టుపక్కల గ్రామాలలో చాలామంది చుట్టాలు ఉండే వారు.
ఇనికి ఎవరు వచ్చిన రంగయ్య ఇంట్లో బంగాళాదుంపల కూర వడ్డించేవారు.
ఆ కూరంటే రంగయ్యకు చాలా ఇష్టం .అయితే వచ్చిన వారిలో ఆ కూరను కొందరు తినే వారు. కొందరు తినడానికి ఇష్టపడే వారు కారు.
కానీ రంగయ్య ఆ కూర చాలా రుచిగా ఉంటుందనీ వచ్చిన వారందరినీ ఆ కూర తినమని బలవంతపెట్టేవాడు.
దానితో రంగయ్య ఇంటికి రాక పోకలు తగాయి కానీ ,రంగయ్య పట్టించుకోలేదు.
భర్త ప్రవర్తనకు రంగయ్య భార్య ఎంతో నొచ్చుకొనేది.
ఒక సారి రంగయ్య వేరే పని మీద మరో గ్రామానికి వెళ్ళ వలసి వచ్చింది.
ఆ వూరిలో ఉండే సీతయ్య రంగయ్యను భోజనానికి పిలిచాడు.
భోజనాల దగ్గర కాకరగాయల కూర వడ్డించారు.దాన్ని చూడగానే రంగయ్య మొహం మాడ్చుకొన్నాడు.
ఎందుకంటే రంగయ్యకు కాకరగాయ కూర ఇష్టం లేదు.
తన ఇంట్లో కాకరగాయ కూర వండడం అసలు ఒప్పుకోడు.
కంచం దగ్గర ఇబ్బందిగా కూర్చున్నాడు.
అప్పుడు సీతయ్య , "తిను బావా, నాకు కాకరకూర అంటే చాలా ఇష్టం.పైగా ఆరోగ్యానికి మంచిది. అందుకే ఈరోజు నీ కోసం వండించాను, ఆ కాకరకూర తినలేక రంగయ్య ఇబ్బంది పడసాగాడు.
" బావా, నువ్వు కాకరగాయ కూర తినడానికి ఇబ్బంది పడుతున్నట్లు ఉన్నావు. నాకు నచ్చిన అకూర నీకు నచ్చలేదు కదా .అందరి ఇష్టాలు ఒకేలా ఉండవు. మన ఇంటికి వచ్చిన వారికి మన ఇంట్లో ఏదుంటే అది పెడతాం. కానీ, ఎదుటివారికి ఇష్టం లేక పోయినా , మనకు నచ్చింది వాళ్ళను తినమని బలవంత పెట్టకూడదు"అన్నాడు సీతయ్య.
రంగయ్యకు ఇన్నళ్ళు తాను చేసిన తప్పేమిటో అర్ధం అయ్యింది.
"నా ఇంటికి వచ్చిన వాళ్ళకు బంగాళా దుంపల కూర తినమని బలవంత పెట్టను " అన్నాడు రంగయ్య.
"ఆ విషయం నీకు అర్ధం కావాలనే ,ఇలా చేసాను .నన్ను క్షమించు," అన్నాడు సీతయ్య.
*
గంగాధర ,10 వ తరగతి, తెట్టు
Prabhava,Books and Beyond ! * All rights reserved.
1 comment:
ఈ కథ నాకు బాగా నచ్చింది ప్రభవా!
Post a Comment