ఒక అడవిలో చెరువు గట్టు దగ్గర ఒక హంస ఉండేది.
ఆ గట్టు మీద చెట్టు పైన కాకి ఉండేది, పాల వంటి ఈకలతో దర్జాగా నడుస్తూ ఈదుతూ ఉండే హంస అంటే కాకికి అసూయ.
ఏదో రకంగా హంసను అవమాన పరిచేది.
ఒక రోజు ఉదయం హంస చెరువులో ఉంది. ఈదుకొంటూ గట్టుపైకి వచ్చింది.
అప్పుడే కాకి కూడా చెట్టు మీద నుంచి గట్టు మీదకి వచ్చింది.
"నీకు తెల్లని ఈకలే గానీ అసలు తెలివి లేదు." అని హంసను చూసి అంది కాకి.
హంస ఏమీ మాట్లాడలేదు.
"మాట్లాడినా నువువ్ ఏమీ నోరు విప్పడం లేదు. "అని హంసను చూసి అంది.
అయినా హంస ఏమీ మాట్లాడ కుండా రెక్కలను ఆరబెట్టు కొంటూ ఉంది.
"నీకు గర్వమే కాదు.తల పొగరు కూడా. ఎప్పుడూ నీళ్ళలోనే బురదలో ఆహారం తినేదానికి తల పొగరు ఉండకూడదు. ఛీ ..ఛీ .. నీలాంటి వాళ్ళు మా పక్షిజాతికే అవమానం. నాకు కనుక అధికారం ఉంటే ఒక్క తన్ను తన్ని వెళ్ళగొడతాను."అంటూ కాలెత్తి తన్నుతున్నట్లు చేయబోయింది.
అంతే.
సర్రున కాలు జారి కాకి చెరువులో పడి పోయింది.
కాకికి ఈత రాదు. ప్రాణభయంతో కొట్టుకొంటున్న ,హంస జాలి పడింది.
నీటిలోకి దిగి కాకిని రక్షించింది.
***
జి నరేష్ ,9 వ తరగతి, తెట్టు ,జిల్లా పరిషత్ స్కూలు.
***
Prabhava,Books and Beyond ! * All rights reserved.
No comments:
Post a Comment