ఒక రోజు కమల డాబా పైకి చేరింది. ఆకాశం లో ఎన్నో గాలిపటాలు ఎగురుతూ కనిపించాయి ఎంతో అందమైన గాలిపటాలో ! నేనూ ఎగరేస్తానోచ్!"
అనుకుంది కమల. పరిగెత్తి డాబా దిగింది.
"
అమ్మా , నేను కూడా గాలిపటం ఎగరేస్తాను."అంది. కానీ, ఇంట్లో గాలిపటం లేదాయె.
కమల నిరాశ చెందడం ఇష్టం లేదు.
"పద గాలి పటం చేసుకొందాం"అంది అమ్మ .
గాలిపటం కోసం అమ్మ రంగురంగుల కాగితాలు తెచ్చింది.కమల జిగురుతో డబ్బా తీసుకొచ్చింది.
అమ్మ కాగితాలు కత్తిరించింది. పుల్లని వంచింది.
కమల దానిని కాగితంపై జిగురుతో అంటించింది. అమ్మ గాలిపటం మధ్యలో రెండు చిల్లులు పెట్టింది.
"ఆ చిల్లులలో దారాన్ని దూర్చి సూత్రం కట్టాలి " అంది అమ్మ .
కమల గాలి పటానికి రంగుల తోకలు అతికించింది.
గాలి పటాన్ని కొద్దిసేపు ఆరబెట్టింది.
అమ్మ కమల డాబా పైకి వెళ్ళారు. అమ్మ గాలిపటానికి దారం కట్టింది.
ఇద్దరూ గాలిపటం ఎగరవేస్తున్నారు.
కమల దారపు చరఖా పట్టుకొంది.అమ్మ దారం లాగుతోంది.
గాలి పటం ఆకాశం లోకి ఎగిరింది. చాలా ఎత్తులో గాలిపటం ఎగురుతోంది.
కమల ఆనందంతో గంతులేస్తోంది.
మరొక డాబాపై ,సరళ వాళ్ళ అమ్మతో కలిసి గాలిపటం ఎగరేస్తున్నారు. వారి పటాలు ఆకాశం లో పోటీ పడుతున్నాయి.
రెండు డాబాలపై ఇద్దరు అమ్మలు గాలిపటాలు ఎగరేస్తున్నా.రు
కమల,సరళ ఎగిరే గాలిపటాలను చూసి ఆనందించారు.
*
పి.సరోజ,8 వ తరగతి, తెట్టు.
Prabhava,Books and Beyond ! * All rights reserved.
2 comments:
బావుంది. ఇదైతే మంచి పుస్తకం వారు వేసే బుజ్జి పుస్తకాల కథల లాగా ఉంది.
ధన్యవాదాలు లలిత గారు.
ఆ విషయమై ,మంచి పుస్తకం వారికి రాశాను
Post a Comment