*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Monday, February 14, 2011

పట్నమెంత దూరం !

అనగా అనగా  కూనవరం అనేగ్రామం ఉండేది.ఇది పట్టణానికి అరవై మైళ్ళ దూరంలో ఉంది. ఈ గ్రామంలో  గోపాలం ,నాగయ్య అనే ఇద్దరు వ్యక్తులు ఉండే వారు.
వారిద్దరూ ఎప్పుడూ వ్యవసాయం పనులు చూసుకొంటూ ఊరిలోనే ఉండే వారు.
ఒక సారి పట్నం నుంచి ఒక అతను పని మీద కూనవరం వచ్చాడు.
గోపాలం ,నాగయ్యల్ను కలిశాడు. ఆ మాటా ఈ మాటా మాట్లాడుకొంటూ ,"మా పట్నం ఎప్పుడీనా చూశారా?" అని వారిద్దరిని  అడిగాడు ఆ పట్నం అతను.
"పట్నంలో ఉండే వింతలు విషేశాలు తెలుసుకోవాలని మీకు లేదా" అతను ఆశ్చర్యంగా అడిగాడు.
"మాకూ చూడాల్నై ఉంది. కానీ మాగ్రామానికి 60 మైళ్ళ దూరంలో ఉన్నందున చూడలేక పోయాం"అన్నారు వారు.
"మీరు వస్తే నేను పట్నం చూపిస్తా "అన్నడతను.
అతను వెళ్ళి పోయాడు.
ఆ తరువాత వారిద్దరూ పట్నం బయలు దేరారు.ఎంతదూరం పోయినా పట్నం రాలేదు.ఎంత దూరం నడిస్తే పట్నం వస్తుందో వారికి తెలియదు. నడిచి నడిచి ఇద్దరు అలసిపోతున్నారు.
ఎంతకీ పట్నం కనిపించడం లేదు.ఇంకా ఎంత దూరం నడిస్తే పట్నం వస్తుందో వారికి తెలియదు.నడిచి నడిచి ఇద్దరు అలసిపోతున్నారు. ఎంతకీ పట్నం కనిపించడం లేదు.
ఇంకా ఎంత దూరం ఉందో చూద్దామని చెట్టుపైకి ఎక్కారు. ఎక్కిన తరువాత పట్నం ఏదిక్కున ఉందో మరిచి పోయారు.
చెట్టు మీద నుంచి వాళ్ళు వచ్చిన పల్లెటూరు మాత్రమే చూడసాగారు.కానె , వాళ్లు దానిని పట్నమనే అనుకొన్నారు.
"నాగయ్యా ,నీకు ఒపట్నం కనిపిణ్చిందా?ఎలా ఉంది ?" చెట్టెకిన నాగయ్యను గోపాలం అడిగాడు.
"అచ్చం మన ఊరిలాగానే ఉంది" అన్నాడు నాగయ్య.
"నాకూ అలాగే అనిపించింది " అన్నాడు గోపాలం.
"పట్నంలో చాలా వింతలున్నాయని పట్నం అతను చెప్పి, మనకు లేని ఇబ్బందులు పెట్టారు. దీనికోసమని మనం ఇన్ని మైళ్ళు కష్టపడి నడుచుకొంటూ వచ్చింది ఎందుకు?"
"అవును "నాగయ్య అనడంతో ,ఇద్దరూ చెట్టు దిగి ,వచ్చిన దారినే ఇంటికి బయలు దేరారు.
***
యస్. గంగాధర 10వ తరగతి,జిల్లాపరిషత్ పాఠశాల ,తెట్టు

Prabhava,Books and Beyond ! * All rights reserved.