నా పేరు ఇడ్లీ.
డ్లి.
మేము పొద్దున్నే అందరి నోరు ఊరించేస్తాం.
మమ్మల్ని హోటల్లో వారు పెద్దగాచేస్తే ,ఇంట్లో వారు మెత్తగా చేస్తారు.
నేను మొదట్లో నీళ్ళ నీళ్ళగా ఉంటాను. తరువాత ,నన్ను ఇడ్లీకుక్కరులో పెట్టేస్తే ,తెల్లగా మెత్తగా అయ్యి బయటికి వస్తాను.
నాకు ప్రత్యేకమైన శత్రువులంటూ ఎవరూ లేరు.
కానీ, కొంతమంది మనుషులు ఎవరయితే నన్ను ఇష్టపడరో వారు, మల్లె పూవులా ఉన్న నన్ను కాకి పిల్లలా చేసేసి ,నన్ను చెత్త కుండీలో వేసేసి , నన్ను ఊపిరి పీల్చుకోన్నివాకుండాచేస్తారో , వారే నా శతృవులు.
నాకు చాలా మంది మిత్రులు ఉన్నారు. వారిలో కొంతమంది వడ, చట్నీ , సాంబారు.హోటల్లో వారు ఇడ్లీతో వడలేకుండా ఇవ్వరు.సరే,ఒక వేళ ఏ చిన్న హోటలో ఇచ్చిందనుకోండి ,సాంబారు చట్నీ ని మాత్రం ఇస్తారుగా.
అప్పుడు నకు ఏమీ భయం ఉండదు. మేము వాళ్ళ కడుపుల్లోకి వెళ్ళి దాగుడు మూతలాడుకొంటాం.
ఒక రోజు నన్ను వడ "అమ్మ చేసుకొందామా ?" అని అడిగాడు.
అప్పుడు నేను మా ఆమానాన్నలు ఇడ్లమ్మ డాడిడ్లీలను అడిగి చెప్తాలెమ్మన్నాను.
వాళ్ళు," నువ్వు ఇంకా చిన్న వయసులో ఉన్నావు .అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు" అన్నారు.
"సరే"అన్నాను.
వెళ్ళి ఈ విషయం వడతో చెప్పాను. తను మొదట్లో బాధపడ్డా ,తరువాత వారు చెప్పింది కూడా కరెక్టేగా అనుకొన్నాడు.
నాకు ఇంకో మంచి ఫ్రెండ్ ఉన్నాడు. వాడు ఎవరో తెలుసా?
వాడే ఫ్రెండిడ్లీ .
వాడు నేను ఎక్కువగా కలుసుకోము. ఎందుకంటే వాడు శని గ్రహంలో ఉంటాడు.
ఇక, వాడు వచ్చినప్పుడు చాక్లెట్లు బిస్కట్ట్లు బోలెడన్ని తెస్తాడు. వాడు శని బేకరీలో చేసే కేకు కూడా తెస్తాడు.
నా చేతిలో చాకు చూడగానే , కేకు నన్ను పొడవద్దు అని ఏడుస్తుంది.
కానీ, దాన్ని రుచిచూడాలన్న నా ఆరాటం చూసి,"సరేలే ,నన్ను తినేయి . నన్ను మళ్ళీ శని బేకరీలో తయారు చేస్తారులే" అని అంటుంది.
నేను కడుపుబ్బే దాకా తినేసి ,ఒక కునుకేసుకొని ,మళ్ళీ లేస్తాను!
*
శ్రీశాంత్, 8 తరగతి "బి". త్రిశూల్ ,రిషీవ్యాలీ.
Prabhava,Books and Beyond ! * All rights reserved.
1 comment:
:)
Post a Comment