అమ్మా మీకు చెపుతున్నా వినవే అమ్మా
నాన్నా మీకు దండం పెడతా వినవా నాన్నా "2"
నా తోటి వాళ్ళందరూ "ఓహో"
బడికి వెళ్తుంటే "ఆహా"
నాకు కూడా వెళ్ళాలనిపిస్తుంది ఓ నాన్నా
నన్ను కూడా బడికి పంపించవే ఓ అమ్మా
చదువు వల్ల "ఓహో "
ఉపయోగం ఉంది "ఆహా" "2"
చదువు వల్ల ఉపయోగం ఉంది అమ్మో నా యమ్మా
దాన్ని మనం ఊయోగించుకొందామే అమ్మా "2" "అమ్మా"
ఊరి ప్రయాణం "ఓహో"
అవుతూ ఉంటే "ఆహా"
ఊరి ప్రయాణం అవుతూ ఉంటే ఓ నాయమ్మా
బస్సు బోర్డు చదవడానికి ఉపయోగపడూతుంది అమ్మో నాయమ్మా "2" " అమ్మా"
చదువులేని వాళ్ళు "ఒహో"
ఆరిన దీపం వంటివారు "అహా"
చదువు లేనివాళ్ళు ఆరిన దీపం వంటి వారమ్మా
ఆ దీపాన్ని నేను కాపాడుకొంటానే "అమ్మో "నా యమ్మా 2" అమ్మా"
పత్తి డబ్బులొచ్చినప్పుడు "ఓహో"
ఎంత లాభం వచ్చిందని "అహా" "2"
ఇతరులను అడగడం ఎందుకే అమ్మో నాయమ్మా "2" "అమ్మ"
అదే నేను "ఒహో"
చదువుకొని ఉంటే "అహా"
ఇతరులను అడగడం ఎందుకే అమ్మా ఓ నాయమ్మో "2" " అమ్మా"
అదే నేను "ఓహో"
చదువుకొని ఉంటే "అహా"
అదే నేను చదువుకొని ఉంటే ఓ నాయమ్మా
వాళ్ళను వీళ్ళను అడక్కరలేదే అమ్మో నాయమ్మో "2" "అమ్మా"
నేను మంచిగా చదివి "ఓహో " ఒక ఉద్యోగం తెస్తే "అహా " "2"" అమ్మా"
నేను మంచిగా చదివి ఉద్యోగం తెస్తే ఓ నా యమ్మా
మన కష్టాలన్నీ తీరుతాయో అమ్మో నాయమ్మో "2"
***
"గిరిజ , ప్రత్యేక వార్షిక సంచిక " నుంచి.
*
జె.శారద , 1st year MPC ప్రభుత్వ జూనియర్ కళాశాల ,కారేపల్లి ,ఖమ్మం జిల్లా.
*
Prabhava,Books and Beyond ! * All rights reserved.
Wednesday, January 12, 2011
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment