ఒక ఊరిలో ఒక రాజు ఉండే వాడు.
ఆ రాజు కొడుకు చాలా పెద్దవాడు.
ఆ రాజు కొడుకు రాజుతో ఒక కోరిక కోరాడు.
అది ఏమిటంటే ,"నేను ఏది ముట్టుకొంటే అది బంగారం అయిపోవాలి"అని.
"అలాగే" అన్నాడు రాజు.
అట్లే ,రాజు అతని మంత్రులు వారి దగ్గరికి పోయి మాంత్రికునితో ఇలా మాట్లాడారు.
ఆ మంత్రాల వాడు అలాగే అన్నాడు.
"నీ కొడుకు ఏది ముట్టుకొంటే అది బంగారం అవుతుంది! "అన్నాడు మాంత్రికుడు.
మొదటిసారిగా రాజు గారి ఇల్లు ముట్టుకొన్నాడు.
రాజుగారి ఇల్లు మొత్తం బంగారం అయిపోయింది.
అట్లే రాజుకొడుకు గ్రామం గ్రామం అంతా బంగారు ఇళ్ళగా మార్చేసాడు.
ఒక రోజు రాజు కొడుకు ఒక్కడే, రాజు నడిగి చేను దగ్గరికి వెళ్ళాడు.
చేను దగ్గరికి పోతుంటే వానిని దొంగలు నరికేసారు.
రాజు చాలా బాధ పడూతున్నాడు.
*
"అత్యాశకు పోతే నిరాశ మిగులుతుంది"
*
యం . ఆదేశ్ ,6 వ తరగతి. విద్యావనం, రిషీవ్యాలీ పల్లెబడి.
2006
Prabhava,Books and Beyond ! * All rights reserved.
No comments:
Post a Comment