ఇక్కడ బుజ్జి బాబు పక్కనున్నది ఎవరో మీరు గుర్తు పట్టేసారు కదా?
మరి , అమ్మలూ నాన్నలూ ..
మీరు మీ పిల్లలతో కలిసి మొదట ET సినిమా చూడబోతున్నారా?
ఆస్ట్రిచ్ గారి కుటుంబాన్ని పలకరించి రావడానికి వెళుతున్నారా?
ప్రణవ్ రాసిన చిన్ని కథ గుర్తుంది కదా?
ప్రకృతి పదిలంగా ఉంటే మనం పదిలం.
పదికాలాల పాటు మన కళాకాంతులూ పదిలం!
ఊహు లేదూ?
పోనీ, ఈ చిట్టి పాప చేతికి పూలతో బాటు కుండీ ని అందిస్తోందే తనెవరో గుర్తు పట్టేసే ఉంటారు!
ఇంకా తెలియదా?
నేనైయితేనా, ఇలాంటి వారెవరయినా ఎదురయితే గజ గజ వణికి గజం దూరం గెంతుదును!
ఈయన గారేమో ఏకంగా భుజాన చెయ్యేసుకొని మరీ ఫోటో దిగేసాడు!
మీకు ఇక్కడున్నదెవరో తెలిసిపోయిందిలే!
ET!
అవునండీ ET గారే!
స్ప్లీల్ బర్గ్ సినిమాసిత్రం.
మనమంతా పిల్లలుగా చూసి తెగ ఆనందిచేసాం.
మన పిల్లలేమో ..ఇలా జాదూతో దాగుడు మూతలు ఆడారు.
మరి ఇక్కడెవరున్నారో ఒక్కసారి చూడండి!
అచ్చం ET లాగానే ఉన్నదే!
ET లేదా అంతరిక్ష జీవి కి చెల్లెలా తమ్ముడా లేక మేనల్లుడా?
అవేవీ కాదండి.
నన్నే ఫోటో తీస్తు న్నారన్నట్లు ,
ఇక్కడ నిక్కి నిక్కి చూస్తున్నది ,మన చిన్ని ఆస్ట్రిచ్ గారు.
మరి , అమ్మలూ నాన్నలూ ..
మీరు మీ పిల్లలతో కలిసి మొదట ET సినిమా చూడబోతున్నారా?
ఆస్ట్రిచ్ గారి కుటుంబాన్ని పలకరించి రావడానికి వెళుతున్నారా?
ప్రణవ్ రాసిన చిన్ని కథ గుర్తుంది కదా?
ప్రకృతి పదిలంగా ఉంటే మనం పదిలం.
పదికాలాల పాటు మన కళాకాంతులూ పదిలం!