ఒక ఇంటిలో ఒంటి కుర్రవాడు
వాడి చుట్టు పిల్లలు
పండుమగ్గిన మామిడిముట్ట
గుడ్లలోని సొన
కొప్పులో మల్లెపువ్వు
రోజురోజుకీ కరిగిపోయే మంచుగడ్డ
పసుపుపాల మీగడ కలిసిన పాలగడ్డ

అమావాస్య రోజు కళ్ళు విప్పి
చూసినా కనబడదు.
ఆకాశంలో జున్నుగడ్డ
భూమతకు ముద్దుబిడ్డ
చిట్టిపాప బలపంతో...
పలకపై చుట్టు సున్న.
దుఖఃము వచ్చు పాప ...
నిన్ను చూచి తిను పాలబువ్వ .
మా మామ చందమామ
నల్లకాగితం మీద తెల్ల సున్న
ప్రతిపదముకు వచ్చే రావత్తు
అర్ధంలేని అరసున్న ఎందుకమ్మ?
జాబిల్లికి జంట మామ!

("పఠాభి" జాబిల్లి, నిశిలో శశి , ని విన్నాక అప్పటికప్పుడు ఈశ్వరి రాసినదిది)
***
పి ఈ శ్వరి 7 వ తరగతి
విద్యావనం,రిషీవ్యాలీ పల్లెబడి,
10-1-2007
10-1-2007
Prabhava,Books and Beyond ! * All rights reserved.
No comments:
Post a Comment