Monday, July 12, 2010
పిచ్చుకమ్మో ఓ పిచ్చుకమ్మా!
చిట్టి పొట్టి పిచ్చుకమ్మా !
ప్రతి కంటిలో ఉంటావామ్మా!
భూమితో పోలిస్తే...
నువ్వు చుక్కావమ్మా !
గాలితో పోలిస్తే ...
మిలుక్కుమని పోతావమ్మా!
మా ఇంటిలో గుడ్లు పెట్టావమ్మా.
ఉగాది పండుగకు శుభ్రం చేస్తుంటే ..
నీవు పెట్టిన గుడ్లు పోతి పోయాయమ్మా.
అందువలన బాధ పడ్డావామ్మా?
నన్ను క్షమించవమ్మా...
ఓ పిచ్చుకమ్మో !
***
పి.ఈశ్వరి ,7 వ తరగతి.
10-1-2007
విద్యావనం,రిషివ్యాలీ పల్లె బడి.
Prabhava,Books and Beyond ! * All rights reserved.
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
chalaa chakka gaa raasindi chinna pilla ainaa
Post a Comment