*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Sunday, December 19, 2010

అంతు పట్టని ఏ సానుభూతి

బాలోత్సవ్ @ కొత్తగూడెం కథారచన లో సీనియర్ లలో ద్వితీయ బహుమతి పొందిన జి.శ్రీరాం , 9 వ తరగతి ,భద్రాచలం పబ్లిక్ స్కూల్ ,సారపాక ,ఖమ్మం జిల్లా ,రచన ఇప్పుడు చదవండి.
***

అంతు పట్టని ఏ సానుభూతి 
నా పేరు మోగ్లి .నేను బెంగాల్ పులుల జాతికి చెందిన ఒక పులిని .
 పులులజాతికి చెందిన మేను స్వతంత్ర జీవులం . మా మంద నాయకుడికి తప్ప మేమెవరి మాట విని ఎరగం .మా కంటూ పాటించ వలసిన నియమ నిబంధనలు మా పెద్దలు ఎప్పటినుంచో చాలా ఆలోచనలతో స్థాపించారు. ఈ నియమ నిబంధనలను మేము తూ చా తప్పకుండా పాటించేవాళ్ళం.
కానీ అప్పుడప్పుడే ఒక శక్తి ఉన్నతశిఖరాలకు చేరుకుంటున్నది.  అదే మానవ శక్తి . ఆ  మానవులంతా మేము ఉంటున్న ప్రదేశాన్ని జంబూద్వీపం అని పిలిచేవారు.
అప్పటిదాకా కాల హయైగా ,సుఖశాంతులతో గడిచింది. ఈ అడవి మాది ,ఈ నేల మాది. ఇది మా ప్రదేశం అని జీవిస్తున్న సంధర్భంలో ఈ మానవులు మా మీద దాడులు జరిపారు.
 కనిపించిన ప్రతి చెట్టు  ప్రతి పుట్ట  గొడ్డళ్ళతో నరికారు.
అడవిలో జంతువుల్ని ఎడాపెడా వేటాడారు.అడవి నియమాల ప్రకారం ఎవరినీ అకారణంగా వేటాడకూడదు.  ముఖ్యంగా మా నియమాల ప్రకారం మనుష్యుల్ని వేటాడకూడదు. మా దృష్టిలో మనుషులు జంతువులందిరిలో బలహీనమైన వాడు. మనుషుల్ని వేటాడంలో మజా ఉండదు. అంతే కాక నరమాంస భక్షణ వలన జంతువుల కోరల పటుత్వం తగ్గి పోతుంది.  కానీ ,ఈ మధ్య మనుషులు ఏనుగులమీదకెక్కి గోధుమ చర్మం వారిని వెనకేసుకొచ్చి ,జంతువుల చర్మాలు కోస్తున్నారు.
ఇలాంటప్పుడు మనుషుల మీద దాడి చేయచ్చును. మనుషుల దుష్ప్రవర్తన చూసి మేము సహించలేకపోయాము. మనుషుల్ని వేటాడడానికి ముందుకొచ్చాం.మనుషులమీదికి దూకి మరీ వారిని కసితీరా చంపాం. దాంతో ఆ మనుషులంతా కుయ్యో మొర్రో అంటూ అడవి నుంచి పారిపోయారు. అక్కడితో అయిపోయిందనుకొని హాయిగా బతక సాగాం.
కానీ, మనుషుల పగ మాత్రం చల్లార లేదు. చాలా ఏళ్ళవరకు మా మీద ఏదాడీ జరగలేదు.కానీ మనుషులు మాత్రం తమ బుద్ధిబలంతో చాలా ఆయుధాలను రసాయనాలను సృష్టించారు.  భూమిలోని ఖనిజాలను దోచుకొని చాలా నిర్మించారు.
అప్పటికే మా జంబూ ద్వీపాన్ని కొంతమంది తెల్ల వాళ్ళు వలసచేసుకొన్నారు.
వాళ్ళు నిర్మించిన ఆయుధాలతో మా మీద మళ్ళీ దండయాత్ర కొనసాగించారు.

ఈ సారి మా వీరత్వం వాళ్ల ముందు ఏమాత్రం  సరిపోలేదు. కనిపించిన ప్రతి పులినీ కసితీరా చంపారు. ఒక నాయకుడిగా నేను కూడా వాళ్ళను ఎదుర్కొన్నాను. కానీ, నా శక్తి సామర్థ్యాలు వాళ్ళముందు సరిపోలేదు. ఒక పక్కన నా బంధువులు ,నా స్నేహితులు అందరు మనుషుల చేతిలో అధోగతి పాలవుతున్నారు. ఎలాగైనా సరే మేము జీవించాలి. నేను మా మందలో మిగిలిన వారితో కలిసి పారిపోయాను.
నేను మిగతావాళ్ళతో కలిసి పారిపోయునప్పుడు ,నా పై నాయకుడ్ని వాళ్ళు బంధించారు.
తెల్లదొర ఒకడు తుపాకీ తో మా నాయకుడ్ని చంపి ,దాని మొహం మీద కాలు పెట్టి వీరోచితంగా నించున్నాడు.

ఇది చూసి మాలో కసి బాగా పెరిగింది.కానీ ,అక్కడి నుంచి పారిపోయాము.
ఇప్పటివరకు నేను నాతో ఉన్న వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకున్నాను.
కానీ, మనుషులందరూ చెడ్డవాళ్ళన్న భ్రమలోనే ఉన్నాను.
తరువాత తెలిసింది. మనుషుల్లో కొంతమంది మంచివాళ్ళున్నారని.కొంతమంది జంతుప్రేమికులున్నారనీ . వాళ్ళు మమ్మల్ని జాగ్రత్తగా వాళ్ళు తయారు చేసిన అడవుల్లో ఉంచారు.
కానీ, కొంతమంది ఇప్పటికీ వేటాడం మానలేదు. అయినా సరే , ఎవరికీ లొంగకుండా అక్కడే నేను నా మందను కాపాడుకొంటున్నాను.

***

Photo courtesy:
http://www.thewareaglereader.com/2010/09/something-resembling-plainslinks-tiger-cub-edition/
***

Prabhava,Books and Beyond ! * All rights reserved.

1 comment:

sriram said...

this story is written by me
i am g.sriram