కొడుకు మాట
జి, శ్రావణి. 5 వ తరగతి , విద్యావనం, రిషీవ్యాలీ పల్లెబడి.
***
కొత్తపల్లిలో రమణ అనే అతడు ఉండే వాడు.
అతనికి ఒక కొడుకు ఉండే వాడు.అతని పేరు భాస్కర్.
వాళ్ళకి కొబ్బరి తోట ఉండేది.
ఒక రోజు వాళ్ళ నాన్న భాస్కర్ ను తోటకు పిలుచుకు పోవాలనుకొన్నాడు.
తండ్రి భాస్కర్ ను పిలిచాడు.
"నాన్నా... నాకు నడుం నొప్పి వస్తున్నది."అన్నాడు భాస్కర్.
కానీ, తండ్రికి ఎదురు చెప్పలేక పోయడు భాస్కర్.
భాస్కర్ తండ్రి కలిసి తోటకు వెళ్ళారు. భాస్కర్ ను రమణ కొబ్బరి చెట్టు ఎక్కమన్నాడు.
"ఖచ్చితంగా చెట్టు ఎక్కవలసిందే "అన్నాడు తండ్రి.
భాస్కర్ చెట్టు ఎక్కాడు. మధ్యలో నడుం నొప్పి ఎక్కువయ్యింది. కాలు జారి కింద పడి పోయాడు.
"అబ్బ ..అబ్బ.."అని గట్టిగా అరిచాడు.
అక్కడ తండ్రితో పాటు ఇద్దరు మనుషులు ఉన్నారు.
వెంటనే భాస్కర్ ను ఆసుపత్రికి తీసుకు పోయారు.
భాస్కర్ నడవలేక పోతున్నాడు.
"ఇంక జీవితం లో ఎప్పటికీ నడవలేడని" డాక్టర్లు చెప్పారు.
భాస్కర్ మాట వినని తండ్రి రమణ ఇప్పుడు బాధ పడుతున్నాడు.
జరగవలసినది జరిగి జీవితంతో పోరాడుతున్నాడు.
పాపం భాస్కర్ !
***
(October 2005)
***
Prabhava,Books and Beyond ! * All rights reserved.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment