మా గ్రంథాలయం
సాయి సాహితి ,10 వ తరగతి 9-2-2008
***
పుస్తకాల పక్కన పుస్తకాలతో
అరల కింద అరలతో
ఉంటుంది మా గ్రంథాలయం.
అలా అని ఖాళీ లేదు అనుకోకండి,
పది ఏనుగులు పట్టే గది,
మా గ్రంథాలయం.
నల్ల రాతి గచ్చు
ఎప్పుడూ చల్లగా ఉంటూ
దానితో పాటు చుట్టూ చెట్లు
బావుంటుంది మా గ్రంథాలయం
చెక్క కుర్చీలు ,బల్లలతో
సున్నితమైన చెక్క నిచ్చెనతో
ఎంతో బావుంటుంది మా గ్రంథాలయం
పార్లమెంటు ఇల్లు కన్నా
బుద్దుడి గుడికన్నా
ప్రశాంతంగా ఉంటుంది మా గ్రంథాలయం.
ఒకటి రెండు మూలలలో ,
పుస్తకాలు పుచ్చుకొని
తిరుగుతూ ఉంటారు విద్యార్థులు.
నచ్చినా నచ్చక పోయినా
లోకం మరిచి పోయి
చదువుతూనే ఉంటారు.
చీకటి పడగానే ,
కళకళాడే దీపలలాగా
వెలుగుతాయి లైట్లు.
సమయం ముగియగానే ,
రైలుపెట్టెల లాగా..అందరూ బయటికి వస్తారు.
చీకటి వెలుతురిని మాతో బాటు బయటకు పంపుతుంది.
అప్పుడు
ఒక ప్రాణం లేని మూగజీవిలాగా ఉంటుంది
మా గ్రంథాలయం.
***
సాయి సాహితి ,10 వ తరగతి, రిషీవ్యాలీ పాఠశాల,9-2-2008
***
Prabhava,Books and Beyond ! * All rights reserved.
Thursday, December 9, 2010
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
చాలా బావుంది.
Post a Comment