*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Wednesday, August 11, 2010

అద్భుత శక్తులు

ఒకానొక ఊరిలో రాము అనే అబ్బాయి ఉండే వాడు.
అబ్బాయికి ఎప్పుడూ తనకు గొప్ప శక్తులు ఉండాలనీ , లోకాన్ని కాపాడాలనీ ,అందరూ తనని పొగడాలనీ ఒక కోరిక ఉండేది. కానీ అబ్బాయి ఎప్పుడూ తన కోరిక గురించే ఆలోచించే వాడు.


అతని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కూడా అబ్బాయికి 
" అది ఎలాగు తీరని కోరిక . నువ్వు బాగా చదువుకొని కలెక్టరో ఇంజనీరో అయితే అందరూ నిన్నే పొగుడుతారు .కాబట్టి నువ్వు బాగా చదువుకో" అని ఎన్నో సార్లు చెప్పి చూశారు.
అయినా లాభం లేదు
కానీ ,వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం అబ్బాయిని ఎలాగైనా మార్చాలనుకొంటారు. బాగా ఆలోచిస్తారు  .వాళ్ళకు ఒక ఉపాయం తట్టింది.

అది అలా ఉండగా , అబ్బాయి రోజూ దేవుణ్ణి అద్బుతశక్తుల కోసం ప్రార్ధించడం మొదలు పెట్టాడు.


ఒక రోజు వాళ్ళ అమ్మానాన్న వచ్చి అబ్బాయితో ,"మేము తీర్ధ యాత్రలకు వెళుతున్నాము .నువ్వు ఇంట్లోనే ఉండు " అని చెప్పి తీర్ధయాత్రలకు వెళ్ళిపోతారు 

అలా అని వాళ్ళు నిజంగా వెళ్ళలేదు .వారిద్దరూ ఒక సాధువు ,భక్తురాలిగా వేషం మార్చుకొని ,తిరిగి వాళ్ళ ఊరు వస్తారు.

ఊరికి ఎవరో సాధువు  వచ్చారని ఎవరో చెపితే రాము విన్నాడు.

వెంటనే సాధువు వద్దకు వెళ్ళాడు రాము.వెళ్ళి సాధువుతో తన కోరికను చెప్తాడు. దానికి సాధువు "నువ్వు రెండేళ్ళు కష్టపడి చదువు అప్పుడు నీకే అద్భుతశక్తులు వస్తాయి "అని చెప్పాడు
అబ్బాయి సరేనని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు.

అప్పటినుంచీ ప్రతి రోజు కష్టపడి చదువుకొంటూ ఉంటాడు . వారం రోజుల తరువాత వాళ్ళ అమ్మానాన్న వస్తారు. అప్పటికే రాము చదువుకొంటూ ఉంటాడు. వాళ్ళు చేసిన కృషి ఫలించినందుకు వారు ఎంతో సంతోషించారు.

అయితే వారు ఇంటికి రాగానే ," అమ్మానాన్న రండి రండి " అంటూ వారిని ఇంట్లోకి ఆహ్వానించి ,జరిగిన విషయమంతా చెప్పాడు.

రెండేళ్ళు బాగా చదివాడు. అయితే ప్రతిసారీ ,క్లాసులో తనే ఫస్టు వచ్చేవాడు.అయితే రెండేళ్ళు అయ్యేసరికి అబ్బాయికి అద్భుత శక్తుల గురించి ఏదీ గుర్తు లేదు .
 బాగా చదివి గొప్పవాడయ్యాడు
అందరూ అతనిని పొగడసాగారు


ఒక రోజు అతనికి తన కోరిక గురించి గుర్తొచ్చింది.అప్పుడు సాధువు అన్న విషయం పూర్తిగా అర్ధమైంది. తన చదువు తన ఉద్యోగం వలన అందరూ అతనిని పొగుడుతున్నారు. అవే అతని  అద్భుత శక్తులు అని తెలుసుకొన్నాడు.

***

K. శ్రీ  సాయి సుమ స్మిత,
7 తరగతి,
బాలోత్సవ్- 2009, కథారచన, జూనియర్స్, ప్రథమ బహుమతి

***
డా. వాసిరెడ్డి రమేష్ గారు మరియు ఇతర పిల్లల శ్రేయోభిలాషులు, కొత్తగూడెం క్లబ్,కొత్తగూడెం వారికి నమస్సులతో  
***
Prabhava,Books and Beyond ! * All rights reserved.

2 comments:

Anonymous said...

soooo cute for such a little brain. May god bless you

rambabu said...

positive vuuha baagundi.