క్రమం తప్పక ప్రతి ఏడాదీ కొత్తగూడెం క్లబ్ నిర్వహణలో జరిగే బాలోత్సవ్ ...ఒక పిల్లల పండగ.
అందులో కథ చెప్పడం,రాయడం, విశ్లేషించడం ఒక ముఖ్యమైన భాగం.
గతఏడాది జరిగిన కథారచన కు ముందు, పిల్లలతో .. వోల్గా, వాసిరెడ్డి నవీన్, శిరంషెట్టి కాంతారావు,అక్కినేని కుటుంబరావు,భగవాన్, చంద్రలత, ముళ్ళపూడి సుబ్బారావు తదితరులు మట్లాడారు.
కథారచనలోని మెళుకువల గురించి.విషయనేపధ్యాల గురించి. భాష గురించి. అనేకానేకం.
సుమారు వందకు పైగా కథకులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో కొన్ని రచనలను ఇకపై వరసగా మీరు చదవ వచ్చును.
ఇవి పిల్లల రచనలు. మీ అభిప్రాయాలు సూచనలు వారిని కలాలను మెరుగు పరచడానికి ఎంతైనా మార్గదర్శకాలు కాగలవు.ధన్యవాదాలు.
అందులో ఈ అద్బుతశక్తులు అన్న రచన మొదటిది .
***
In the PHOTO (Lto R):
శిరంషెట్టి కాంతారావు, వాసిరెడ్డి నవీన్, వోల్గా, అక్కినేని కుటుంబరావు గారలు మరియు చంద్రలత .
***
డా. వాసిరెడ్డి రమేష్ గారు మరియు ఇతర పిల్లల శ్రేయోభిలాషులు, కొత్తగూడెం క్లబ్,కొత్తగూడెం వారికి నమస్సులతో ***.
Prabhava,Books and Beyond ! * All rights reserved.
Wednesday, August 11, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment